Vastu Shastram : ఇల్లు శుభ్రం చేశాక చీపురుని ఇలా పెడితే దరిద్రమట..మీకు తెలుసా..
మహాలక్ష్మీ స్వరూపంగా భావించే చీపురుని..ఇల్లు శుభ్రం చేశాక ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు. ఓ చిన్న చర్య ఇంట్లో చాలా విషయాలపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా..
నిద్రలేచిన వెంటనే ఉత్తమ గృహిణి మొదట చేసేపని ఇంటిని శుభ్రం చేయడం. మహాలక్ష్మీ స్వరూపంగా భావించే చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత ఆ చీపురుని ఓ మూలన పెడతాం. అయితే ఆ చర్య ఇంట్లో చాలా విషయాలపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా. మూలన పెట్టినప్పుడు సాధారణంగా చీపురు పట్టుకునే భాగాన్ని నేలకు ఆనించి పెడుతూ ఉంటారు. కుచ్చు భాగం నేలకు ఆనించి పెడితే పాడైపోతుందని ఇలా చేస్తుంటారు. కానీ ఎప్పుడూ ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మనం ఎలా పట్టుకుంటామో అలాగే పెట్టాలి. పైగా చీపురుకట్టను నిలబెడితే దరిద్ర దేవతకు ఆహ్వానం పలుకుతున్నట్లే అని చెబుతారు. అవసరానికి మించి చీపురు కట్టలు కొని ఇంటిలో నిల్వ ఉంచకూడదు.
ఈశాన్యం, ఆగ్నేయం వైపు కాకుండా నైరుతి, వాయువ్య మూల ఎవ్వరికీ కనిపించకుండా చీపురు పెట్టాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపురు పట్టుకుని శివాయ నమః అంటూ శుభ్రం చేస్తే శనీశ్వరుడు ఆ ఇంటిలోంచి బయటకు వెళ్ళిపోతాడని చెబుతారు. ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి. చీపురు, చాట ఒకే దగ్గర ఉంచడం అరిష్టం. ఇంటిలోపల, బయట ఒకే చీపురు వాడకూడదు. పూజా గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవటం మంచిది. సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. బెడ్ రూమ్ లో మంచం కింద వస్తువులు సర్దేసే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ నిద్రపోయే మంచం కింద ఎలాంటి వస్తువులు, చెత్త, ముఖ్యంగా చీపురు ఉండకూడదట. మంచం కింద మాత్రమే కాదు బెడ్ రూమ్ లో చీపురు కనిపించకూడదని చెబుతారు.
చీపురు ఎప్పుడు కొనాలి..ఎప్పుడు పడేయాలి:
మంగళవారం, శుక్రవారం, మహాలయ పక్షం అంటే భాద్రపదమాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చేయకూడదు. గ్రహణానికి ముందు రోజు, గ్రహణం రోజు, గ్రహణము తర్వాత రోజు చీపురు కొనకూడదు. పండుగ రోజుల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు, హస్తా, శ్రవణం, రోహిణి, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనూరాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురు కొనకూడదని చెబుతారు వాస్తు నిపుణులు. ఇంటిలో పాడైపోయిన చీపురు సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం మాత్రమే బయట పడవేయాలి. ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతికకాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు పడేయాలి. బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంటిలో అప్పటివరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్లీ వాడకూడదని చెబుతారు.
Also Read: స్నానం ఎలా చేయాలి, స్త్రీ-పురుషులు పాటించాల్సిన నియమాలేంటి...ఏ సమయంలో స్నానం చేయకూడదు..
Also Read:ఆ ఊళ్లో చెట్ల నిండా నాణాలే... ఎవరైనా దొంగిలిస్తే కష్టాలే
Also Read: కాశీకి ఎందుకెళతారు….అక్కడ ఏం వదిలేయాలి?
Also read: అన్నీ రుణానుబంధాలే…తస్మాత్ జాగ్రత్త..జాగ్రత్త
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి