News
News
X

Devotional: ఏకదండి, ద్విదండి, త్రిదండి...స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...

ఆది శంకరాచార్యుల నుంచి జీయర్ స్వాముల వరకూ చేతిలో కర్ర ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు. స్వామీజీ అంటే కర్ర పట్టుకోవాలనుకుంటే పొరపాటే..దాని వెనుక ఎంత ఆంతర్యం ఉందో తెలుసా...

FOLLOW US: 

ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజం, జీయర్ స్వాములు మరికొందరు..వీళ్లందరి చేతిలో పొడవాటి కర్ర ఉంటుంది గమనించారా. ఏ సమయంలో చూసినా వాళ్ల చేతిలో ఉంటాయి. అదేమైనా ఊతకోసమా అంటే కానేకాదు. మరి ఎప్పుడూ చేత్తో పట్టుకుని ఉంటారెందుకు అంటారా..అవి వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తు.  ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. అయితే ప్రతి ఆకారానికి ఓ అర్థం ఉంది.  గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం పంచభూతాల సమ్మేళనమే మనిషి కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను చేతపట్టుకుని తిరుగుతారని చెబుతారు.  ఈ కర్రల్లో  మూడు రకాలున్నాయి అవే ఏకదండి, ద్విదండి, త్రిదండి. 

ఏకదండి: ఒక కర్రను (ఏకదండి ) ధరించేవారు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. అందుకు ఉదాహరణ ఆదిశంకరాచార్యులు. అద్వైతం అంటే జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదనే  సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుంచి సేకరించిన  కర్ర ఉంటుంది.

ద్విదండి: రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతాన్ని అవలంబించేవారు.  ఇందుకు ఉదాహరణ మధ్వాచార్యులు. వీరిని ‘ద్విదండి స్వాములు’అంటారు. దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు. జీవాత్మ, పరమాత్మ వేరువేరన్నది వీరి ఉద్దేశం. జీయర్ లు అందరూ ఈ సిద్ధాంతం కిందకు వస్తారు.

త్రిదండి: మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అంటారు. ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు. వీరిది రామానుజాచార్యుల పరంపర. శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని విశ్వసిస్తారు. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుంచి విముక్తులై, మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు.

Also Read: అక్టోబర్ 7నుంచి దసరా ఉత్సవాలు, ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు- దర్శనానికి వచ్చే భక్తులకు కుంకుమ, అమ్మవారి డాలర్‌

Also Read: ఇల్లు శుభ్రం చేశాక చీపురుని ఇలా పెడితే దరిద్రమట..మీకు తెలుసా..

Also Read: స్నానం ఎలా చేయాలి, స్త్రీ-పురుషులు పాటించాల్సిన నియమాలేంటి...ఏ సమయంలో స్నానం చేయకూడదు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 30 Sep 2021 08:38 AM (IST) Tags: Ekadandi Dvidandi Tridandi stick in the hands Ramanujacharya madhvacharya jeeyar swamy shankaracharya

సంబంధిత కథనాలు

Ambajipeta News : అంబాజీపేటలో విజయ బేతాళస్వామి ఉత్సవాలు, 56 ఏళ్లుగా వాహన మహోత్సవం

Ambajipeta News : అంబాజీపేటలో విజయ బేతాళస్వామి ఉత్సవాలు, 56 ఏళ్లుగా వాహన మహోత్సవం

Dhanteras 2022 Date: ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడొచ్చింది,ధంతేరాస్ కి బంగారానికి లింకేంటి!

Dhanteras 2022 Date: ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడొచ్చింది,ధంతేరాస్ కి బంగారానికి లింకేంటి!

Karwa Chauth and Atla Taddi 2022: కర్వా చౌత్(అట్ల తదియ) ఎప్పుడొచ్చింది, ఆ రోజు ప్రత్యేకత ఏంటి!

Karwa Chauth and Atla Taddi 2022: కర్వా చౌత్(అట్ల తదియ) ఎప్పుడొచ్చింది, ఆ రోజు ప్రత్యేకత ఏంటి!

Solar Eclipse and Lunar Eclipse 2022: అక్టోబరు 25న సూర్యగ్రహణం, ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

Solar Eclipse and Lunar Eclipse 2022: అక్టోబరు 25న సూర్యగ్రహణం, ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

Horoscope Today 6th October 2022: ఈ రోజు ఈ రాశివారి జీవితంలో ఒక ప్రత్యేక స్నేహితుడు వస్తాడు, అక్టోబరు 6 రాశిఫలాలు

Horoscope Today 6th  October 2022:  ఈ రోజు ఈ రాశివారి జీవితంలో ఒక ప్రత్యేక స్నేహితుడు వస్తాడు, అక్టోబరు 6 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు