Covid Antiviral Pill: కరోనాపై పోరాటంలో మరో ముందడుగు.. కొవిడ్19 యాంటీవైరల్ మెడిసిన్ రెడీ.. అద్భుతమైన ఫలితాలు
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. అమెరికా లాంటి దేశాల్లో కొవిడ్19 మరణాలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఫార్మా సంస్థ కరోనాపై పోరాటానికి టాబ్లెట్ తయారుచేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి మొదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా పూర్తి స్థాయిలో నివారణ మాత్రం సాధ్యం కాలేదు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్19 మరణాలు మరోసారి భారీగా పెరిగిపోతున్నాయి. భారత్‌లో గత రెండు నెలలుగా కరోనా ప్రభావం తగ్గినా, కేరళ లాంటి కొన్ని రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఫార్మా సంస్థ ప్రపంచ దేశాలకు శుభవార్త అందించింది. కరోనా వైరస్ సోకిన బాధితులు ఆసుపత్రులో చేరకుండా చేసే మెడిసిన్‌ను తయారు చేసింది.
కొవిడ్19 యాంటీవైరల్ టాబ్లెట్ వేసుకుంటే మెరుగైన ఫలితాలు గుర్తించామని క్లినికల్ ట్రయల్స్ వివరాలు బయటపెట్టింది ఆ సంస్థ. యాంటీవైరల్ మాత్ర వేసుకోవడం ద్వారా ఆసుపత్రిలో చేరే అవకాశాలను తగ్గించడంతో పాటు కొవిడ్19 మరణాలను సగానికి సగం తగ్గేలా చేసిందని నిపుణులు వెల్లడించారు. అమెరికాకు చెందిన మెర్క్ అండ్ రిడ్జ్ బ్యాక్ బయోథెరపాటిక్స్ అనే ఫార్మా సంస్థ మోల్నుపిరావిర్ అనే మెడిసిన్ తయారుచేసింది. దీని క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త ఆశ రేకెత్తిస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా కరోనా బాధితులపై ప్రయోగాలు నిర్వహించగా ఆ ట్యాబ్లెట్ వేసుకున్న వారిలో మెరుగైన ఫలితాలు కనిపించాయి.
Also Read: డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి... హార్వర్డ్ ఆరోగ్య నిపుణుల సలహా
ఎఫ్‌డీఏ ఆమోదం లభిస్తుందా..
కరోనా సోకిన వారు ఆ మోల్నుపిరావిర్ మాత్ర వేసుకుంటే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి నుంచి మిమ్మల్ని రక్షిస్తుందని, కొవిడ్19 మరణాలు సైతం దాదాపు సగానికి తగ్గాయని పేర్కొనడం విశేషం. తాము రూపొందించిన కొవిడ్ యాంటీవైరల్ మెడిసిన్‌కు ఆమోదం కోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA)కు దరఖాస్తు చేసుకోనున్నామని మెర్క్ అండ్ రిడ్జ్ బ్యాక్ బయోథెరపాటిక్స్ సంస్థ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ ఫలితాల వివరాలను ఎఫ్‌డీఏకు అందించి అనుమతి పొందుతామని ధీమాగా ఉన్నారు.
Also read: కోవిడ్ వల్ల మరణించే అవకాశాలు వీరికే ఎక్కువట...
క్లినికల్ ట్రయల్స్ భేష్...
ఎఫ్‌డీఏ అనుమతి లభిస్తే కొవిడ్19కు తొలి యాంటీవైరల్ మెడిసిన్‌గా మోల్నుపిరావిర్ నిలవనుంది. ఈ మెడిసన్ వాడిన వారిలో కేవలం 7.3 శాతం మంది పేషెంట్లు ఆస్పత్రి పాలయ్యారని శుక్రవారం ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. ఈ క్లినికల్ ట్రయల్స్ ను వ్యాక్సిన్ తీసుకోని వారిపై నిర్వహించారు. 60 ఏళ్లు పైబడటం, స్థూలకాయం (Obesity), మధుమేహం (Diabetes), గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు అధికంగా కరోనా బారిన పడుతున్నారని గుర్తించారు.
Also read: మీరు కొన్న కారం మంచిదో, కల్తీదో ఇలా తెలుసుకోవచ్చు..
5 దేశాలలో క్లినికల్ ట్రయల్స్: అమెరికా, యూకే, జపాన్, తైవాన్, దక్షిణాఫ్రికా దేశాలలో 170కు పైగా నగరాలలో ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఓవరాల్‌గా 14.1 శాతం మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందడం లేదా కొవిడ్ మరణాలు సంభవించాయి. మోల్నుపిరావిర్ కరోనా యాంటీవైరల్ మెడిసిన్ అద్భుతంగా పనిచేస్తుందని ఎఫ్‌డీఏ మాజీ కమిషనర్ స్కాట్ గొట్టిలెబ్ సీఎన్‌బీసీ మీడియాకు తెలిపారు. ఈ టాబ్లెట్ మెడిసిన్ త్వరలోనే ప్రపంచంలో విలువైన కరోనా ట్రీట్మెంట్‌గా మారుతుందని దీన్ని రూపొందించిన ఫార్మా కంపెనీ చెబుతోంది.