Sai Sudharsan India vs West Indies | వరుసగా విఫలమవుతున్న సాయి సుదర్శన్
ఐపీఎల్ లో మంచి ఫార్మ్ కనబర్చిన సాయి సుదర్శన్ టెస్ట్ క్రికెట్ లో స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడి ... టీమిండియాలో చోటు దక్కించుకున్న సుదర్శన్ కెరీర్‌ను నిలబెట్టుకోవడానికి తడబడుతున్నాడు. అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ టెస్టు క్రికెట్‌లో కూడా పెద్దగా రాణించలేదు. అయినా కూడా వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో చోటు దక్కించుకున్నాడు. కానీ సొంతగడ్డపై కూడా విఫలమవుతున్నాడు.
భారత్ - వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో మూడో స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్ తొందరగా పెవిలియన్ చేరాడు. కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. అయితే, విండీస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ఏతో జరిగిన ఆన్ ఆఫిసియల్ టెస్ట్ సిరీస్‌లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు సాధించి మంచి ఫామ్ కొనసాగించాడు. ఇలా వరుసగా సాయి సుదర్శన్ ఫెయిల్ అవుతుండడంతో విమర్శలు ఎదుర్కుంటున్నాడు. కరుణ్ నాయర్ ను పక్కన పెట్టి సాయి సుదర్శన్ కు టీమ్ లో చోటు ఇస్తే.. ఇలా అవకాశాన్ని వదులుకోకూడదని అంటున్నారు ఫ్యాన్స్.





















