Chilli Powder: మీరు కొన్న కారం మంచిదో, కల్తీదో ఇలా తెలుసుకోవచ్చు..
మనం తినే ఎన్నో ఆహారపదార్థాలు కల్తీమయంగా మారుతున్నాయి. కల్తీని ముందే తెలుసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
గత దశాబ్ధాలుగా ఆహారపదార్థాలను కల్తీ చేసి లాభాలు పొందే వ్యాపారులు ఎక్కువైపోయారు. పాలు, నూనె, కారం, పసుపు... ఇలా రోజువారీ ఆహారంలోని ముఖ్య పదార్థాలలో ఏవేవో కలిపి అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు, ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ సంస్థ ట్విట్టర్ లో కల్తీని కనిపెట్టడం ఎలా? అనే అంశంపై కార్యక్రమాలను చేపట్టారు. గత కొన్ని రోజులుగా వివిధ ఆహార పదార్థాలలోని కల్తీని ఎలా కనుక్కోవాలో తెలిపే చిట్కాలను ట్విట్టర్ లో పోస్టు చేస్తున్నారు. తాజాగా కారం కల్తీదో కాదో ఎలా తెలుసుకోవాలో చెబుతూ పోస్ట చేశారు.
చాలా సింపుల్...
కారం కల్తీదో కాదో తెలుసుకోవడం చాలా సులువు. ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ప్రకారం ఒక గ్లాసు నీళ్లలో ఒక టేబుల్ స్పూను కారం వేయాలి. రెండు నిమిషాల పాటూ అలా వదిలేయాలి. పైనున్న నీళ్లను ఒంపేసి, కింద ఉన్న అవక్షేపాన్ని వేళ్లతో నలపాలి. మెత్తగా తగిలితే అది కారమే, అలాకాకుండా గరుగ్గా చిన్నచిన్న రేణువుల్లా అనిపిస్తే మాత్రం అందులో ఇటుక పొడి, సోప్ స్టోన్ పొడి... ఇలా ఎర్రగా ఉన్న పొడులను కలిపినట్టే లెక్క. గతంలో ఇలానే వంట నూనె కల్తీని ఎలా కనిపెట్టాలో కూడా చెప్పింది ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ సంస్థ.
Is your Chilli powder adulterated with brickpowder/sand?#DetectingFoodAdulterants_8#AzadiKaAmritMahotsav@jagograhakjago @mygovindia @MIB_India @AmritMahotsav @MoHFW_INDIA pic.twitter.com/qZyPNQ3NDN
— FSSAI (@fssaiindia) September 29, 2021
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Also read: పుల్ల ఐస్ తెలుసుగా... ఇది పుల్ల ఇడ్లీ, చేతికి అంటకుండా తినేయచ్చు
Also read: గొర్రెల కాపరి కనిపెట్టిన కాఫీ.. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలేస్తోంది
Also read: గుండె పంపించే వార్నింగ్ సైన్ లను గమనిస్తున్నారా? నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే
Also read: కోవిడ్ వల్ల మరణించే అవకాశాలు వీరికే ఎక్కువట...
Also read: తాతబామ్మల ఫ్రీజర్లో 1970ల నాటి ఫుడ్... షాకైన మనుమరాలు
Also read: గుండె జబ్బుకు గురికాకుండా ఉండాలంటే తినాల్సినవి ఇవే... తేల్చిన హార్వర్డ్ అధ్యయనం
Also read: వారెవ్వా అనుపమ... అందమంతా అలల్లా ఎగిరే నీ కురుల్లోనే