అన్వేషించండి

Horoscope 8th October 2023: ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం, అక్టోబరు 08 రాశిఫలాలు!

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today October 8th, 2023

మేష రాశి

ఈ రాశివారి కుటుంబ జీవితం బాగుంటుంది. పెద్దల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం బావుంటుంది. మీ ప్రియమైనవారితో గుర్తిండిపోయే సమయం స్పెండ్ చేస్తారు. మీ కెరీర్‌లో ప్రమోషన్‌కు అవకాశాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులు పూర్తిచేస్తారు. ఆస్తి ఒప్పందాలు కుదురుతాయి. అననుకూల గ్రహ సంయోగం కారణంగా ఈ వారం మీకు ప్రయాణానికి మంచిది కాదు. 

వృషభ రాశి

ఆర్థిక రంగంలో శుభవార్తలు మీకు ఉపశమనం కలిగిస్తాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయం. ప్రయాణ ప్రణాళికలు ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు భవిష్యత్ గురించి ఆలోచించాలి.  నిరుద్యోగులకు ఇంకొంతకాలం నిరీక్షణ తప్పదు.

మిథున రాశి

ఆర్థిక రంగంలో శుభవార్తలు ఈ వారం ఉపశమనం కలిగిస్తాయి. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో మీకు సహాయపడుతుంది. ప్రేమ, విశ్వాసానికి సంబంధించిన లోతైన భావాలు బయటపడతాయి. ఆస్తి పెట్టుబడికి కొంత బడ్జెట్ అవసరం కావచ్చు కానీ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారం బాగానే సాగుతుంది. 

Also Read: దేవుడి మందిరంలో విగ్రహాలొద్దు, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచొద్దు-వాస్తు నిపుణులు ఇంకా ఏం చెప్పారంటే!

కర్కాటక రాశి

ఈ రాశివారి ఉద్యోగ జీవితం కొంత గందరగోళంగా ఉంటుంది. అయితే ఆస్తులలో పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ అభిరుచికి తగినట్టుగా ఉండేందుకు ప్రయత్నించండి. సామాజిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. వ్యాపారంలో నూతన పెట్టబుడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది. 

సింహ రాశి

ఈ రాశివారి వృత్తి, ఉద్యోగ జీవితం అద్బుతంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారికి బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది అయితే మీ ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండండి. అపార్థాలు లేదా కఠినమైన పదాలు వినియోగించడం వల్ల వైవాహిక బంధంలో కొన్ని ఇబ్బందులొస్తాయి. వ్యాపారంలో పెట్టబడులు లాభాలను అందిస్తాయి.

కన్యా రాశి
మీ ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ స్థాయిలు చాలా బాగుంటాయి...మీకు వ్యాయామంపై శ్రద్ధ పెరుగుతుంది. వృత్తిపరంగా మీరు ఆశిస్తున్న స్థానం పొందే అవకాశాలున్నాయి. కుటుంబ విషయాలు కొన్ని సవాలుగా ఉండొచ్చు. బాధ్యతలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులకు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. సామాజిక జీవితం సానుకూలంగా ఉంటారు. 

Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!

తులా రాశి

వృత్తిపరమైన అవకాశాలు మీకు రావచ్చు..మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. స్నేహితుల నుంచి మంచి సహకారం ఉంటుంది. పిల్లల నుంచి  శుభవార్త వింటారు.  మీ కుటుంబ జీవితం  ఆనందంతో నిండి ఉంటుంది. అయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, అప్పులు తీసుకునే ప్రయత్నం అస్సలు చేయవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మీ బంధాల్లో కొన్ని మానసిక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావొచ్చు.

వృశ్చిక రాశి 

ఈ రాశివారి కుటుంబ జీవితం బావుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృత్తిపరంగా కొన్ని సవాళ్లు ఎదురుకావొచ్చు. మీ తెలివితేటలతో ఎలాంటి అడ్డంకులను అయినా అధిగమిస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఆస్తి వ్యవహారాలు  అనుకూలంగా ఉంటాయి, ఇల్లు కొనడం లేదా విక్రయించే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి 

ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి లేదా ఫ్రీలాన్స్ పని చేయడానికి ఇది మంచి సమయం. కుటుంబ పరంగా, గృహ బాధ్యతలను అధిగమించడం అవసరమైనప్పుడు కుటుంబ సభ్యుల నుంచి సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని ఆస్వాదించవచ్చు. మీరు డబ్బు పరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది అందుకే  అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. పనులు పూర్తి చేయడానికి కూడా ఇది మంచి సమయం.

మకర రాశి

ఈ రాశివారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. పెద్దల నుంచి సహకారం, మార్గదర్శకత్వం పొందుతారు. భవిష్యత్ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం. ఉద్యోగం అంత సంతృప్తికరంగా సాగదు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి పర్వాలేదు. అన్ని విషయాల్లో సానుకూలంగా వ్యవహరించండి.

కుంభ రాశి

ఈ రాశివారు ఆర్థిక విషయాలలో వ్యాపార విస్తరణ, ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. మీరు మీ బృందంతో కలిసి పని చేయడం, కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టడం ద్వారా మీ కెరీర్ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు. మీ కుటుంబం ఈ రోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు..వాటి నుంచి బయటపడాలంటే కొంత సహనం అవసరం. ఆస్తులు కలిసొచ్చే అవకాసం ఉంది. 

Also Read: గోడ గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే, వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి!

మీన రాశి

ఈ రాశివారికి వృత్తిపరంగా మంచి రోజు.  కెరీర్లో పురోగతికి అవకాశాలుంటాయి. మీ ఆర్థిక స్థితి గతంలో కన్నా మెరుగుపడుతుంది. పెట్టుబడులు కలిసొస్తాయి. తేలికపాటి వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. కుటుంబంలో మీ పెద్దల నుంచి సలహాలు,  మార్గదర్శకత్వం తీసుకుంటే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆస్తి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే ఈ రోజు మీకు మంచి రోజు. 

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
Surya Gochar 2026: సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget