అన్వేషించండి

Horoscope Today: ఈ రాశులవారు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టాలి - మే 8 రాశిఫలాలు

Daily Horoscope: మే 8 ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...

Daily Horoscope -  రాశిఫలాలు (08-05-2024)

మేష రాశి
ఈ రోజు మీ రోజు సాధారణంగా ఉంటుంది. కార్యాలయంలో సోహోద్యోగులతో అనవసరమైన గొడవలు పెట్టుకోవ్దదు. టీమ్ వర్క్ పై దృష్టి సారించండి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. 

వృషభ రాశి
వృత్తి జీవితంలో మీ పనితీరు బావుంటుంది. కెరీర్‌కు సంబంధించి ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోండి. ఈ రోజు కెరీర్‌లో పురోగతికి అనేక అవకాశాలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ భాగస్వామితో మానసిక బంధం బలంగా ఉంటుంది.

Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!

మిథున రాశి
ఈ రోజు మిథున రాశి వారు నూతన ఉత్సాహంతో ఉంటారు. కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి రోజు. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి. కొత్త ఆర్థిక ప్రణాళికను రూపొందించండి. స్నేహితులు లేదా సన్నిహితులతో విహార యాత్ర ప్లాన్ చేసుకుంటారు. ఆస్తి కొనుగోలుకి అనుకూలమైన సమయం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆయిల్ , స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉండడం మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు కలిసొస్తాయి. భాగస్వామితో బంధం బలపడుతుంది.

కర్కాటక రాశి
ఈ రాశివారికి ఈ రోజు అనుకూలమైన రోజు. ఖర్చులు నియంత్రించుకోగలుగుతారు. డబ్బు ఆదా చేసుకునే అవకాశాలుంటాయి.  పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. ఆఫీసులో చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది.  అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కార్యాలయ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు.  

సింహ రాశి
సింహ రాశి వారు నూతన పెట్టుబడులు పెట్టే అవకాశం పొందుతారు.  టెంప్టింగ్ ఆఫర్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వృత్తి జీవితంలో ఏ నిర్ణయమైనా చాలా ఆలోచించి తీసుకుంటారు. అవసరమైతే ఇంట్లో పెద్దల సలహా తీసుకోవడం ఉత్తమం. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామికి సమయం కేటాయించాలి. 

Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!
 
కన్యా రాశి
ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. కుటుంబంలో సంతోషం ఉంటుంది.  పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు.  కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు కార్యాలయంలో మీ అభిప్రాయాన్ని పంచుకోవడానికి సంకోచించకండి.  మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మానసిక ప్రశాంతత కోసం రోజూ యోగా, ధ్యానం చేయండి. 

తులా రాశి
ఈ రోజు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. వైఫల్యానికి భయపడవద్దు. సృజనాత్మకతతో అన్ని పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు అదుపు తప్పకూడదు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలి. ఆసక్తికరమైన వ్యక్తి మీ  జీవితంలోకి ప్రవేశిస్తారు.   మనసు ఆనందంగా ఉంటుంది.  

వృశ్చిక రాశి
మీరు మీ నైపుణ్యం, ప్రతిభతో వృత్తి జీవితంలో విజయాలు సాధిస్తారు.  సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.  కార్యాలయంలో అదనపు బాధ్యతలు పొందుతారు. వాహనం కొనుగోలు చేయాలనే మీ ఆలచోన కార్యరూపం దాల్చుతుంది. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పాత ఆస్తుల వల్ల కొంత మంది ఆర్థికంగా లాభపడతారు. కొత్త ఆదాయ వనరుల నుంచి  డబ్బు వస్తుంది.  చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు మళ్లీ ప్రారంభమవుతాయి 
Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!

ధనస్సు రాశి
ప్రత్యర్థులు కార్యాలయంలో చురుకుగా ఉంటారు..ఫలితంగా మీ పనిలో కొంత ఆటంకం ఏర్పడుతుంది. ఈరోజు కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.  టీమ్‌వర్క్‌పై దృష్టి పెట్టండి.   ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడానికి డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. ఈరోజు సంబంధాలలో అపార్థాలు పెరగనివ్వవద్దు. మీ భాగస్వామితో సమయం గడపండి. మీ భావాలను వారితో పంచుకోండి.  విద్యార్థులు పరీక్షలో మంచి మార్కులు సాధిస్తారు.

మకర రాశి
ఈ రోజు మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. దూర ప్రయాణాలను ఇప్పుడు వాయిదా వేయండి. ఈ రోజు మీరు  రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. మీరు పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మీ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. 

కుంభ రాశి
ఈరోజు వృత్తి జీవితంలో శుభ ఫలితాలున్నాయి. మీ కలలన్నీ నిజమవుతాయి. మీరు మీ పనిలో ఆశించిన ఫలితాలను పొందుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనాలనే కోరిక పెరుగుతుంది. మీ కెరీర్ లక్ష్యాలకు సంబంధించి ప్రణాళికలు వేసుకుంటారు.  కుటుంబంలో సంతోషం ఉంటుంది.  ఆఫీసులో సహోద్యోగులతో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. 

Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 

మీన రాశి
ఈ రోజు మీన రాశి వారు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి  పొందుతారు. కార్యాలయంలో కొత్త ప్రాజెక్ట్ విషయంలో బాధ్యతలు పెరుగుతాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి.  ఈ రోజు కుటుంబ సభ్యులు ,  స్నేహితుల సహకారంతో అన్ని పనులు  ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీ భాగస్వామి భావోద్వేగాల పట్ల సున్నితంగా వ్యవహరించండి.  

Also Read: అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

JanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP DesamRayapati Aruna on Pithapuram Sabha | నాగబాబుకు MLC పదవి ఎందుకో చెప్పిన రాయపాటి అరుణ | ABP DesamFood Items Menu Janasena Pithapuram Sabha | పిఠాపురం సభలో 10వేల మందికి భోజనాలు | ABP DesamJanasena Pithapuram Sabha Arrangements | పిఠాపురంలో భారీ రేంజ్ లో జనసేన సభ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Viral News: చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Embed widget