Horoscope Today 9 December 2021: ఈ రాశివారు మంచి సలహాలు ఇస్తారు.. మీరు అందులో ఉన్నారా, ఈ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
మీరు కొత్త వ్యాపారం కోసం ప్రణాళికను రూపొందించవచ్చు. విద్యార్థులకు శ్రద్ధ పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు అందుకుంటారు. పిల్లల సమస్యలు శ్రద్ధగా వినండి. జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. మీ మాటల మీద సంయమనం పాటించండి.
వృషభం
గృహ నిర్మాణ పనుల్లో పురోగతి ఉంటుంది. ఆఫీసు సహోద్యోగులు మిమ్మల్ని అభినందిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ పని పట్ల సానుకూలంగా ఉండండి. అందరి పట్ల ఒకే వైఖరి కలిగి ఉండండి. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నిపుణులతో చర్చిస్తారు. ఉద్యోగస్తులకు శుభసమయం.
మిథునం
మీ నైపుణ్యంతో ఆకట్టుకుంటారు. మీరిచ్చిన సలహలకు ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభం ఉంటుంది. ఫీల్డ్‌లో పనిచేసే వారి ప్రదేశంలో మార్పు ఉండవచ్చు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు ఒత్తిడి ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు.
Also Read: నెలకు రెండుసార్లు మంటతో స్నానం చేసే అమ్మవారు..
కర్కాటకం
మీ స్నేహితులతో రహస్య ప్రణాళికలను చర్చించవద్దు. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. పొట్టకు సంబంధించిన సమస్యలు రావొచ్చు. కొత్త ప్రణాళికలు వేయొద్దు. మీ ప్రత్యర్థులపై నిఘా ఉంచండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
సింహం
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు జరగుతాయి. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వ్యాపారులకు పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. స్థిరాస్తి కొనుగోలుకు శుభసమయం. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. కోపంతో ఎవరితోనూ మాట్లాడొద్దు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
కన్య
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు మీకు హాని కలిగించవచ్చు. జీవిత భాగస్వామి సలహాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఆఫీసు పనులు ఆలస్యం అవుతాయి.
Also Read: కర్మ అంటే ఏంటి.. పదే పదే ఈ మాట అనొచ్చా.. పురాణాలు ఏం చెబుతున్నాయి...
తుల
కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతారు. మేధోపరమైన పనిలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ వ్యవహారాలు ముందుకు సాగుతాయి. మీ పని మీరే చేయండి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు శుభప్రదం. తెలియని వ్యక్తుల మాటలు నమ్మొద్దు.
వృశ్చికం
ఈరోజంతా బావుంటుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందుతారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిర్మాణ పనులకు ఈరోజు అనుకూలమైన రోజు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ పని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా వివాదాలు రావొచ్చు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
ధనుస్సు
ఆఫీసుకి సంబంధించిన పనుసపై బయటకు వెళ్లొచ్చు. విదేశాలలో ఉండేవారికి కొన్ని సమస్యలు తెలత్తుతాయి. ఎవరితోనైనా వివాదాలు తలెత్తవచ్చు. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకండి. పెట్టుబడి పెట్టడానికి రోజు చాలా బాగుంది.
Also Read: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..
మకరం
విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అప్పిచ్చిన మొత్తం తిరగి చేతికందుతుంది. పిల్లల ప్రవర్తన వల్ల మీరు ఇబ్బంది పడతారు. కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆస్తిలో వాటా పొందొచ్చు. ఆదాయ వనరులు పెరుగుతాయి.
కుంభం
ఈరోజు సంతోషంగా ఉంటారు. కొత్తగా చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూల సమయం. వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు శుభసమయం. ఈరోజు కుటుంబంతో కలిసి షికారు వెళ్తారు. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి.
మీనం
అనవసర మాటలు కట్టిపెట్టండి. ఎవరితోనైనా వివాదాలు రావొచ్చు. ఆఫీసులో వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. ఎవరి వల్లనైనా బాధపడతారు. కొన్ని ముఖ్యమైన ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. మీ సమయాన్ని ప్రశాంతంగా గడపేందుకు ప్రయత్నించండి.
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి