అన్వేషించండి

ఏప్రిల్ 3 రాశిఫలాలు, ఈ రాశివారికి రహస్య శత్రువులున్నారు జాగ్రత్తపడండి

Rasi Phalalu Today 3rd April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

ఏప్రిల్ 3 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు మీకు పురోభివృద్ధి ఉంటుంది. పెద్దలపై గౌరవం, మర్యాదలు పాటించాలి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు పోటీ రంగంలో ముందుకు సాగుతారు. అవివాహితులకు ఉత్తమ వివాహం కోసం ప్రతిపాదనలు ఉండవచ్చు. మీరు ఒక పెద్ద లక్ష్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు కానీ కొన్ని కష్టాల తరువాత అది పూర్తవుతుంది. ఒకరు ఇచ్చిన సలహా గురించి జాగ్రత్తగా ఆలోచించండి. 

వృషభ రాశి

ఈ రోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం సంతోషంగా ఉంటుంది. భావోద్వేగ విషయాలలో మీరు మెరుగ్గా ఉంటారు.మీ సంతోషం, శ్రేయస్సు పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. ప్రేమికులు మూడో వ్యక్తి జోక్యం వల్ల ఇబ్బంది పడతారు.  వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. 

మిథున రాశి

ఈ రోజు మీలో ధైర్యం, బలం పెరుగుతుంది. బంధువుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. తలపెట్టిన పని పూర్తిచేయకపోవడం వల్ల ఏదో నిరాశ ఉంటుంది. చేసే పనిని రిలాక్స్ గా చేయండి లేదంటే తలపెట్టిన ప్రణాళికలు కొంతకాలం నిలిచిపోయే అవకాశం ఉంది. పాత రణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ సమస్యల గురించి ఉపాధ్యాయులతో మాట్లాడాల్సి ఉంటుంది. 

కర్కాటక రాశి

ఈ రోజు మీకు సంపద పెరుగుతుంది. రక్త సంబంధ సంబంధీకులను కలుస్తారు...ఓ శుభకార్యం నిర్వహణ గురించి ఆలోచిస్తారు. స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. పిల్లలకు కొన్ని జాగ్రత్తలు వివరిస్తారు. ఉద్యోగులు పని ప్రదేశంలో ఏదైనా తప్పుచేస్తే వెంటనే క్షమాపణలు చెప్పి దాన్ని సరిచేసుకోవడం మంచిది. 

Also Read: ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

సింహ రాశి

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. సృజనాత్మక పనుల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీ మాటతీరుతో అందర్నీ ఆకర్షిస్తారు. కొత్త ప్రణాళికలు అమలు చేయడం మంచిది. నూతన పెట్టుబడులకు మంచి రోజు. మీ రంగంలో మీరు వృద్ధి చెందుతారు. బారీ పెట్టుబడుల వల్ల లాభాలు పొందుతారు. ఉన్నతాధికారులు మీమాటకు విలువనిస్తారు.

కన్యా రాశి

ఈ రోజు ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత పాటించాలి. ఖర్చులు తగ్గించకపోతే భవిష్యత్ లో ఇబ్బంది పడతారు. కార్యాలయంలో మీకు రహస్య శత్రువులు ఉన్నారు..జాగ్రత్త పడండి. భాగస్వామ్య వ్యాపారం పెద్దగా కలసిరాదు. లావాదేవీకి సంబంధించిన విషయం చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే, ఈ రోజు మీరు దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించండి. వ్యాపారంలో నూతన ప్రణాళికల ద్వారా మంచి ఫలితాలు పొందుతారు.

తులా రాశి

ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. న్యాయపరమైన విషయాల్లో అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదిస్తే మంచిది. దూర ప్రాంత ప్రయాణం చేయాల్సివస్తే తల్లిదండ్రులతో సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.ఉద్యోగులు తమ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. సీనియర్లతో మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్త. వ్యాపారులకు కొన్ని సమస్యలు తప్పవు.

Also Read: ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

వృశ్చిక రాశి 

ఈ రోజు పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి . మీ స్థానం పెరగడంతో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఏదైనా శుభకార్యంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ పని వేగం మందగిస్తుంది, అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు పూర్తిచేస్తారు. మీ పై అధికారులతో ఏ విషయాన్నిపంచుకోవద్దు. తోబుట్టువులతో విభేదాలు తలెత్తుతాయి.

ధనుస్సు రాశి

ఈ రోజు మీలో ధైర్యం, బలం పెరుగుతాయి. కొన్ని వ్యాపార ప్రణాళికలు వేసే ముందు జాగ్రత్తగా ఉండండి. మీరు దీర్ఘకాలంగా నిలిపివేసిన కొన్ని పనులు పూర్తవుతాయి..దీనివల్ల మీరు సంతోషంగా ఉంటారు. ఈ రోజు డబ్బుకు సంబంధించిన విషయాలలో కూడా మంచి రోజు అవుతుంది. మితిమీరిన ఉత్సాహంతో ఏ పనీ చేయనవసరం లేదు. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మరో ఉద్యోగం ఆఫర్ కూడా లభిస్తుంది.

మకర రాశి

ఈరోజు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ఏదైనా సమస్య ఎదురైతే నిర్లక్ష్యం చేయకండి.ఈరోజు మీరు ఏ కొత్త పని చేయక తప్పదు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయవచ్చు.ఉపాధి కోసం ఇబ్బంది పడే వారు మరికొంత కాలం ఆందోళన చెందాల్సి ఉంటుంది.  ఈరోజు మీరు పాత మిత్రుడిని కలుసుకుంటారు. భాగస్వామ్యంతో ఏదైనా పని చేసే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలి.

కుంభ రాశి

ఈ రోజు వ్యాపారం చేసే వారికి మంచి రోజు. మీరు పనిప్రాంతంలో మీ మంచి ఆలోచనలను సద్వినియోగం చేసుకుంటారు.  కొన్ని ముఖ్యమైన విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. తోబుట్టువుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 
 

మీన రాశి

ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీరు మీ పనిలో గొప్ప అవగాహనతో ముందుకు సాగాలి, లేకపోతే మీరు తప్పు చేయవచ్చు. ఉద్యోగం చేసేవారు పదోన్నతి కారణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రదేశానికి మారవలసి ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా సలహా ఇచ్చే ముందు మీరు సీనియర్ సభ్యులతో మాట్లాడాలి. ఈ రాశి విద్యార్థులు కష్టపడాలి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

శ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!హైటెక్ సిటీలో పేలుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పరుగో పరుగుAmbani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Embed widget