News
News
వీడియోలు ఆటలు
X

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

Weekly Rasi Phalalu ( April 03 to 09) : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Weekly Horoscope ( April 03 to 09):  ఈ ఆరు రాశులవారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆ రాశులేంటో చూద్దాం..

వృషభ రాశి

ఈ రాశివారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవడం మంచిది. వారం ప్రారంభంలో వృత్తి వ్యాపారాలకు సంబంధించి అకాస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు అనకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. తొందరగా అలసిపోతారు కానీ అనుకున్న పని సక్సెస్ అవడంతో సంతోషంగా ఉంటారు. ఇంటిని మరమ్మతు చేయడానికి లేదా సౌకర్యానికి సంబంధించిన ఏదైనా వస్తువులను కొనడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు ఈవారంలో ఎవ్వరి ప్రలోభాలకు లోనుకావొద్దు. డబ్బు వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ప్రేమ సంబంధాన్ని వివాహంగా మార్చాలని ఆలోచిస్తే..తొందరపడొద్దు..ఇరు కుటుంబాల పెద్దల ఆలోచనను గమనించి అడుగేయండి. జీవిత భాగస్వామి భావాలను విస్మరించకుండా ఉంటే వావైహిక జీవితం బావుంటుంది. నిత్యం ఆదిత్య హృదయం పఠించడం మంచిది

మిథున రాశి 

ఈ రాశివారు ఈ వారం బిజీబిజీగా ఉంటారు. ఈ వారం మీరు ఇల్లు, కార్యాలయానికి సంబంధించిన బాధ్యతలను నెరవేర్చడానికి అదనపు కృషి మరియు కృషి చేయవలసి ఉంటుంది. వారం ప్రారంభంలో, మీరు భూమి మరియు ఆస్తికి సంబంధించిన విషయాలను పరిష్కరించే ప్రయత్నాల్లో ఉంటారు. కోర్టులవరకూ వెళ్లాల్సి వస్తే..కోర్టు బయటే చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ పోటీదారులతో కఠినమైన పోటీని ఎదుర్కొంటారు. ఉద్యోగులు వారం ద్వితీయార్ధంలో తమ పని ప్రదేశంలో ప్రత్యర్థులపట్ల జాగ్రత్తగా ఉండాలి...మీ పనికి ఆటంకం కలిగించేందుక ప్రయత్నం చేసేవారుంటారు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం , ఆహారంపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాల పరంగా సమయం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. రోజూ శ్రీ మహావిష్ణువును ఆరాధించండి. 

Also Read:  మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!

కన్యా రాశి

ఈ రాశివారికి ఈ వారం కొంచెం కష్టపడితేనే విజయం సొంతం అవుతుంది. మీరు తలపెట్టిన పనులు కొన్నింటికి ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆలస్యంగా అయినా పనులు పూర్తవుతాయి. వారం ప్రారంభంలో వ్యాపారం, ఉద్యోగానికి సంబంధించి తీసుకునే నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇతరుల మాటల మధ్యకు వెళ్లొద్దు. వారం మధ్యలో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. ప్రయాణం కాస్త అలసటగా అనిపించినా అనుకున్నది విజయవంతమవుతుంది. ఈ సమయంలో మీరు సమర్థవంతమైన వ్యక్తులతో పరిచయం పెంచుకుంటారు..వీరివల్ల భవిష్యత్ లో ప్రయోజనం పొందుతారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం, ఆహారం విషయంలో అజాగ్రత్తకు దూరంగా ఉండండి. నిత్యం వినాయకుడిని ధ్యానించండి. 

తులా రాశి

ఈ వారం తులా రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు..ఆలోచించాలి, అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. వృత్తి-వ్యాపారానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు శ్రేయోభిలాషుల సలహాలను విస్మరించకండి. భాగస్వామ్యం వ్యాపారం చేసేవారు డబ్బులకు సంబంధించిన వివరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారం మధ్యలో తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆశించిన విజయాన్ని సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది... ఇలాంటి పరిస్థితుల్లో వివాదాల కంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటే బాగుంటుంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. మీ సుఖదుఃఖాల్లో జీవిత భాగస్వామి నీడలా మీకు తోడుగా నిలుస్తారు. నిత్యం శివారాధన చేస్తే శుభం జరుగుతుంది. 

Also Read: గోడ గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే, వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి!

వృశ్చిక రాశి 

వృశ్చిక రాశివారికి ఈ వారం సవాలుగా ఉంటుంది. వారం ప్రారంభంలో మీ పని లేదా వ్యాపారానికి సంబంధించిన కొన్ని అడ్డంకులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ పోటీదారులతో కఠినమైన పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే చేతికి అందాల్సిన డబ్బు రావడానికి ఇబ్బందులు ఉండొచ్చు. నిరుద్యోగులకు మరికొంతకాలం నిరీక్షణ తప్పదు. కార్యాలయంలో మీ ప్రత్యర్థులు చాలా ఉత్సాహంగా ఉంటారు మీరు జాగ్రత్తపడాలి..పనిని మరింత మెరుగ్గా నిర్వహించడానికి ప్రయత్నించండి..చిన్న పొరపాటు కూడా మీ భవిష్యత్ పై ప్రభావం చూపుతుంది. దంపతులు లేదా ప్రేమికుల మధ్య మూడో వ్యక్తి మితిమీరిన జోక్యం వల్ల విభేదాలుంటాయి. ఇలాంటి పరిస్థితిలో జాగ్రత్తగా ప్రశాంతమైన మనస్సుతో విషయాలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. నిత్యం హనుమంతుడిని ఆరాధించండి. 

మీన రాశి

మీన రాశివారికి ఈ వారం కాస్త ఒడిదుడుకులు ఉంటాయి. వారం ప్రారంభంలో అదనపు పనిభారం ఉండవచ్చు. దీన్ని సకాలంలో చేయాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే పెద్ద తప్పు మీ పై అధికారి ఆగ్రహానికి గురిచేస్తుంది...అలాంటి పరిస్థితిలో మీ పనిని మరొకరికి వదిలివేయకుండా చాలా జాగ్రత్తగా చేయండి. వ్యాపారులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి లేదా దానిని తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి అప్పు చేయాల్సి రావొచ్చు. ఈ వారం మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. వారం ద్వితీయార్ధంలో మీరు గాయపడే ప్రమాదం ఉంది..జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వైవాహిక జీవితంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఆంజనేయుడిని పూజించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. 

Published at : 02 Apr 2023 06:45 AM (IST) Tags: gemini weekly horoscope astrology predictions in telugu weekly predictions zodiac signs in telugu Every Zodiac Sign's Weekly horoscope 03 April to 09 april rashifalalu Weekly Horoscope 03 April to 09 April

సంబంధిత కథనాలు

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి  ఎప్పుడొచ్చింది,  ప్రత్యేకత ఏంటి!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Shukra Gochar 2023: నెల రోజుల పాటూ ఈ 4 రాశులవారికి అంత బాలేదు!

Shukra Gochar 2023: నెల రోజుల పాటూ ఈ 4 రాశులవారికి అంత బాలేదు!

టాప్ స్టోరీస్

Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

Telangana New Party :  తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

AP Flexi War : ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు - వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !

AP Flexi War :  ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు -  వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Road Accident News : తెలుగు రాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!

Road Accident News : తెలుగు రాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!