చాణక్య నీతి: ఇలాంటి పనులు చేసేవాళ్లు నరకంలోకే వెళతారు



అత్యస్తలేవః కటుతా చ వాణీ దరిద్రతా చ స్వజనేషు వైరమ్
నీచ ప్రసంగః కులహీనసేనా చిహ్నాని దేహే నరకస్థితానామ్



చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకం అర్థం ఏంటంటే...అపకారం, నీచమపు పనులు చేసే వ్యక్తులు నరకానికే చెందుతారు



ఎక్కువ కోపం, వినడానికి కఠినంగా ఉండే మాటలు, శుభ్రత పాటించని వారు



మంచి వ్యక్తులతో వైరం పెట్టుకునేవారు, నీచులతో స్నేహం చేసేవారు...



కులహీనులకు సేవ చేసేవారు..ఇలాంటి పనులన్నీ నరకంలో ఉండే ఆత్మల లక్షణాలు



దుష్టులు అత్యంత క్రోధ స్వభావం కలిగి ఉంటారు. వారి నోట్లోంచి ఒక్క తియ్యటి మాటకూడా రాదు..అన్నీ కఠినమైన మాటలే వస్తాయి.



ఇలాంటి వారెప్పుడు దారిద్ర్యాన్ని అనుభవిస్తారు. మంచి వ్యక్తులతో తగాదా పెట్టుకుంటారు



నీచులతో స్నేహం చేయడం,వారికి సేవచేయడం చేస్తుంటారు. ఈ అవలక్షణాలన్నీ నరకంలో ఉండే ఆత్మలకు ఉంటాయి.



.అంటే మనుషులు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే వారు నరకానికి వెళతారని చాణక్యుడు చెప్పిన శ్లోకం ఉద్దేశం
Images Credit: Pixabay