అన్వేషించండి

Horoscope Today 31 May 2024: ఏపీ ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ - ఈ రాశులవారు బెట్టింగ్ లకు దూరంగా ఉండడం మంచిది - మే 31 రాశిఫలాలు!

Rasi Phalalu Today: మే నెలలో ఆఖరి రోజు ఏ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి...ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...

Horoscope Today 31  May 2024 : మే 31 రాశిఫలాలు  

మేష రాశి
ఈ రోజు మీ ఆర్థికపరిస్థితి బావుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించవద్దు. కుటుంబంలో ఉండే వివాదాలను ప్రశాంతంగా మాట్లాడడం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి.  

వృషభ రాశి
కస్టమర్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి చిన్న సమస్యలు ఉంటాయి. వ్యాపారులు ఊహించని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బెట్టింగ్ లకు దూరంగా ఉండడం మంచిది. వృత్తిపరమైన వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కాపాడుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. శరీర నొప్పులు ఇబ్బందిపెడతాయి.  

మిథున రాశి
మీ వైవాహిక జీవితం బావుంటుంది. రోజంతా సరదాగా ఉంటారు. ఆహారంపై శ్రద్ధ వహించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ రోజు ఆర్థిక లాభం పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు. 

Also Read: Monthly Horoscopes June 2024: జూన్ నెలలో ఈ రాశులవారికి ఆరంభం అద్భుతంగా ఉన్నా ద్వితీయార్థంలో చికాకులు తప్పవు!

కర్కాటక రాశి
ఈ రోజు మీ కృషి , అంకితభావం ఫలిస్తాయి. కార్యాలయంలో మీ కష్టాన్ని మీ ఉన్నతాధికారులు గుర్తిస్తారు. మీ లక్ష్యాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు వస్తాయి. మీ నైపుణ్యాలు , నాయకత్వ సామర్థ్యాలను ప్రదర్శించడానికి వెనకడుగువేయవద్దు. ఊహించని విధంగా ధనం వస్తుంది. మీరు మీ మునుపటి పెట్టుబడులు , ఆర్థిక ప్రణాళికల నుంచి సానుకూల ఫలితాలను చూస్తారు. 

సింహ రాశి
ఈ రోజు అన్ని రంగాలవారికి కలిసొచ్చే రోజు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది.  సింహ రాశివారు మాటలతో మ్యాజిక్ చేస్తారు. పాత వివాదాలు సమసిపోతాయి. 

కన్యా రాశి
ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఉత్తేజకరమైన ఆలోచనల ద్వారా ఉద్యోగులు పనిలో మంచి ఫలితాలు సాధిస్తారు.  సహోద్యోగులతో మంచి స్నేహం మెంటైన్ చేయండి. మిమ్మల్ని మీరు విశ్వశించాలి. ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగులు ఊహించని గుడ్ న్యూస్ వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

తులా రాశి
ఈ రోజు మీరు అదనపు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రతికూల ఆలోచనలు దరిచేరనివ్వొద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.  

Also Read: మిథున రాశిలోకి శుక్రుడు - ఈ రాశులవారికి కనవర్షమే!

వృశ్చిక రాశి
కొత్త సవాళ్లు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి. కార్యాలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. భాగస్వామిపట్ల ప్రేమను వ్యక్తం చేసేందుకు సంకోచించవద్దు.  

ధనస్సు రాశి
ఈ రాశివారికి ఈరోజు ఉత్తేజకరమైన రోజు. కొత్త ఉద్యోగం పొందుతారు..ఉద్యోగులు ప్రమోషన్ కిసంబంధించిన సమాచారం వింటారు. మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించండి. మీకు సంబంధించిన రంగంలో ప్రభావవంతమైన వ్యక్తులను కలిసేందుకు ఇదే మంచి సమయం. కొత్త సవాళ్లు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి.  

మకర రాశి
మీ ఆలోచనా విధానం మీకు మంచిచేస్తుంది...అందుకే మిమ్మల్ని మీరు విశ్వశించండి. కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకుంటేనే మంచి జరుగుతుంది. అధిక ఒత్తిడి తీసుకోవద్దు...తగిన విశ్రాంతి అవసరం.  మానసిక ,  శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి.

కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశివారికి గ్రహాలు అనుగ్రహం ఉంది. మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. మీ సహజమైన స్వభావాన్ని వ్యక్తపరిచేందుకు వెనుకాడవద్దు. కొత్త ప్రదేశానికి వెళ్లినా అక్కడ గౌరవమర్యాదలు పొందుతారు.  ప్రత్యేకమైన వ్యక్తులను ఈ రోజు కలుస్తారు

మీన రాశి
ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. మీ ప్రేమజీవితం అద్భుతంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కళాకారులు మంచి అవకాశాలు పొందుతారు.మీ వైఖరిలో సానుకూల మార్పులు వస్తాయి..

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget