Monthly Horoscopes June 2024: జూన్ నెలలో ఈ రాశులవారికి ఆరంభం అద్భుతంగా ఉన్నా ద్వితీయార్థంలో చికాకులు తప్పవు!
June Month Horoscopes 2024: జూన్ నెలలో ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయి ఏ రాశులవారికి మిశ్రమఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి
Monthly Horoscopes June 2024
మేష రాశి ( Aries June Horoscope 2024)
మేష రాశివారికి జూన్ నెలలో అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, విద్యార్థులకు అన్నీ శుభఫలితాలున్నాయి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయనాయకులకు శుభఫలితాలున్నాయి.ఆదాయం బావుంటుంది..
వృషభ రాశి ( Taurus June Horoscope 2024)
ఈ రాశికి చెందిన అన్ని రంగాలవారికి ఆదాయం బాగానే ఉంటుంది. చేసే వృత్తివ్యాపారాల్లో లాభాలుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.
మిథున రాశి ( Gemini June Horoscope 2024)
జూన్ నెల మిథునరాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చులుంటాయి. అప్పులు చేయాల్సి వస్తుంది. బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోలోపల ఏదో భయం వెంటాడుతుంది. కుటుంబంలో సంతోషం తగ్గుతుంది. పిల్లలకు అనారోగ్య సూచనలున్నాయి తగిన జాగత్తలు తీసుకోవాలి
కర్కాటక రాశి ( Cancer June Horoscope 2024)
కర్కాటక రాశివారికి ఈనెల ఆరంభం అద్భుతంగా ఉంటుంది కానీ ద్వితీయార్థంలో ఇబ్బందులు తప్పవు. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. చేపట్టిన పనులకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలుంటాయి. బంధుమిత్రులతో వివాదాలు , ఊహించని సమస్యలు తప్పవు
Also Read: మిథున రాశిలోకి శుక్రుడు - ఈ రాశులవారికి కనవర్షమే!
సింహ రాశి ( Leo June Horoscope 2024)
సింహ రాశివారికి జూన్ నెల అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు.
కన్యా రాశి ( Virgo June Horoscope 2024)
కన్యా రాశివారికి ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం ఉంది. ఫలితంగా అన్ని రంగాలవారు లాభపడతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలుంటాయి. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్యం బావుంటుంది. వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. నూతన పరిచయాల వల్ల లాభపడతారు
తులా రాశి ( Libra June Horoscope 2024)
తులా రాశివారికి జూన్ నెల ఆరంభంలో ఇబ్బందులు తప్పవు...రెండో భాగం అన్నవిధాలుగా కలిసొస్తుంది. జూన్ ప్రథమార్థంలో ఏ పని ప్రారంభించినా ఇబ్బందులు, కుటుంబంలో వివాదాలు ఎదురవుతాయి. నెల రెండో భాగంలో యోగకాలం. మీ మాటకు తిరుగుండదు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు
వృశ్చిక రాశి (Scorpio June Horoscope 2024)
వృశ్చిక రాశివారికి ఈనెలలో గ్రహాల అనుగ్రహం లేదు. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగులు, ఉన్నతాధికారులతో మాటపట్టింపులు ఉంటాయి. కొందరికి ఉద్యోగం మారాల్సిన అవసరం రావొచ్చు. అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి
Also Read: 2025 మే వరకూ మీన రాశిలోనే రాహువు - ఈ రాశులవారికి ప్రతిరోజూ పండుగే!
ధనస్సు రాశి ( Sagittarius June Horoscope 2024)
జూన్ నెల ధనస్సు రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. దుర్వార్తలు వినాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న తగాదాలుంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం ...కానీ..అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమం
మకర రాశి ( Capricorn June Horoscope 2024)
మకర రాశివారికి జూన్ నెల అంతబాగాలేదు. ఉద్యోగులకు స్థానచలనం తప్పదు. అద్దెఇంట్లో ఉండేవారు గృహంలో మార్పులుంటాయి. అనవసర విరోధాలు, మాటపట్టింపులు తప్పవు. నమ్మినవారివల్లే మోసపోతారు...అంతలోనే సమస్య నుంచి తేరుకునే మార్గాలు వెతుక్కుంటారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి ( Aquarius June Horoscope 2024)
అన్ని రంగాలవారికి అనుకూల సమయం. గత కొంతకాలంగా వెంటాడుతున్న సమస్యలు జూన్ నెలలో పరిష్కారం అవుతాయి. రానిబాకీలు వసూలవుతాయి. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తవుతాయి
మీన రాశి ( Pisces June Horoscope 2024)
జూన్ నెల మీన రాశివారికి అన్నీ శుభఫలితాలనే అందిస్తోంది. కుటుంబంలో సమస్యలన్నీ సమసిపోతాయి సంతోషంగా ఉంటారు. కొన్నాళ్లుగా ఉన్న చికాకులు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నవారి కల ఫలిస్తుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు.
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.