News
News
వీడియోలు ఆటలు
X

Horoscope Today 21st December 2022: ఈ రాశివారికి తమపై కన్నా ఇతరులపై నమ్మకం ఎక్కువ, డిసెంబరు 21 రాశిఫలాలు

Rashifal Today 21st December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Horoscope Today 2st December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు ఈ రాశివారు సమయం వృధా చేయవద్దు. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. తలపెట్టిన పనుల్లో వచ్చిన ముఖ్యమైన అడ్డంకులు తొలగిపోతాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడండి. 

వృషభ రాశి
ఈ రాశి వారికి బుధవారం కొంత భారంగా ఉంటుంది.అందరినీ త్వరగా నమ్మడం హానికరం. మీ రహస్యాలను ఇతరులకు చెప్పొద్దు... లేదంటే ఇబ్బందుల్లో పడకతప్పదు. పాతవ్యాధులు బయటపడే అవకాశం ఉంది ఆరోగ్యో జాగ్రత్త. అనవసర మాటలు నియంత్రించండి. గాయపడే ప్రమాదం ఉంది జాగ్రత్త. రిస్క్ తీసుకోవద్దు.

మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. చాలా కాలంగా ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది. ఇంటా బయటా మీకు సహకారం ఉంటుంది. ఏదో తెలియన భయం వెంటాడుతుంది. వ్యాపారులు, ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు

కర్కాటక రాశి
మీ మనసుకి అనుకూలమైన పని లేకపోవడం వల్ల కర్కాటక రాశి వారికి సమస్యలు పెరుగుతాయి. ఈరోజు మీ ఒత్తిడి, ఆందోళన పెరిగే అవకాశం ఉంది. ఆస్తులకు సంబంధించి చేసే ప్రయ్తనాలు సక్సెస్ అవుతాయి. ప్రయాణం చేసే అవకాశాలున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు జాగ్రత్త

Also Read: ఈ రాశివారికి కొత్త ఏడాది సమస్యలతో ఆరంభం - ఆ తర్వాత అంతా శుభం, 2023 తులారాశి ఫలితాలు

సింహ రాశి
ఈ రాశివారికి తలపెట్టిన పనుల్లో ఆటంకాలు సృష్టించేవారే ఇప్పుడు అభిమానులుగా మారుతారు. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. మీరు చేస్తున్న మేధోపరమైన పని విజయవంతమవుతుంది. పెట్టుబడి, ప్రయాణం మానసిక సంతోషాన్నిస్తుంది

కన్యా రాశి
ఈ రాశికి చెందిన వారు ఈ రోజు విచక్షణతో పని చేయాల్సిన అవసరం ఉంది..నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. ఏదో విషయంలో ఆందోళన చెందుతారు. విచారకరమైన వార్త వినే అవకాశం ఉంది. 

తుల
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ రోజు శుభప్రదం. మీకు ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు తమ పనిని సమయానికి చేయడం నేర్చుకోకుంటే ఇబ్బందులు తప్పవు. మీ జీవిత భాగస్వామి ఈరోజు ఆందోళన చెందుతారు. ఆర్థికలాభం ఉండే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి. రిస్క్ తీసుకోకుండా ఉండడం మంచిది. 

Also Read: ఆ ఒక్క విషయంలో తప్ప 2023 బాగా కలిసొస్తుంది, కన్యారాశి వార్షిక ఫలితాలు

ధనుస్సు రాశి
ఈ రాశివారికి వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆకస్మిక లాభాలు అందుతాయి. వ్యాపారుల ప్రయాణం విజయవంతం అవుతుంది. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు జాగ్రత్తపడతారు. న్యాయపరమైన విషయాల్లో మీదే పైచేయి అవుతుంది.  విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టండి

మకర రాశి
ఈ రోజు మీరు మానసికంగా  బాధపడతారు. ఇష్టం లేకపోయినా ఇతరుల కోసం పని చేయాలి. వివాదాల వల్ల మీ గౌరవం దెబ్బతినే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఏదో ఆందోళనలో ఉంటారు

కుంభ రాశి
ఈ రాశి వారు సాధారణంగా తాము అనుకున్నది చేయరు..ఇతరుల మాటలను చాలా త్వరగా నమ్ముతారు.  మీ విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలి. బకాయిలు తిరిగి పొందే అవకాశం ఉంది. ఏదో అశాంతి వాతావరణం నెలకొంటుంది. మీ ప్రత్యర్థులపై మీదే పైచేయి అవుతుంది

మీన రాశి
ఈ రోజు ఈ రాశివారి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. పిల్లల పట్ల ఆందోళన ఉంటుంది. నూతన ప్రణాళిక రూపొందించండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు వాహన ఆనందం పొందే అవకాశం ఉంది.

Published at : 21 Dec 2022 05:32 AM (IST) Tags: Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today Rasi Phalalu today Aries Taurus Gemini Cancer Leo Virgo Libra Scorpio

సంబంధిత కథనాలు

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు