ఫిబ్రవరి 20 రాశిఫలాలు, ఈ రాశివారు ఫాంటసీలలో జీవించడం మానేస్తే మంచిది
Rasi Phalalu Today 20th February 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మేష రాశి
ఈ రోజు ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఏదో విషయంలో ఆందోళన చెందుతారు. అనవసరమైన చిక్కుల్లో చిక్కుకుంటారు. కొనసాగుతున్న ప్రాజెక్టులకో కూడా కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.సొంత చెల్లింపులు చేయడానికి కష్టపడాల్సి ఉంటుంది.
వృషభ రాశి
ఈ రోజు మీపై మీకు అధిక విశ్వాసం ఉంటుంది. గతం గురించి ఆలోచించకుండా దాన్నుంచి బయటపడడానికి పరిస్థితులు మీకు అనుకూలంగా మార్చుకునేందుకు దృష్టి సారించండి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ కాలం.
మిథున రాశి
ఈ రోజు మీకు గడిచిన రోజుకన్నా బావుంటుంది. సామాజిక రంగంలో మీ క్రియాశీలత పెరుగుతుంది. కొన్ని పనులలో సానుకూల ఫలితాలను పొందుతారు. కొంతమంది పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. మీరు కుటుంబానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు అందుకుంటారు.
Also Read: ఈ వారం ఈ రాశివారి జీవితంలో పెద్ద సానుకూల మార్పు రాబోతోంది
కర్కాటక రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం మామూలుగా ఉంటుంది. ఖర్చులు పెరగడం వల్ల మనసు చంచలంగా ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ మాట తూలొద్దు. రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఆందోళన చెందుతారు. మీ భావోద్వేగాలను నియంత్రించండి. వృత్తిపరమైన విషయాలను సజావుగా పరిష్కరించేందుకు ప్రయత్నించండి.
సింహ రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. అనభవజ్ఞుల సలహాలు, సహకారంతో కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబంతో కలసి సంతోష సమయం గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు ఈరోజు జరపొద్దు. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కచ్చితంగా ప్రయోజనం పొందుతారు.
కన్యా రాశి
ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన సమయం.మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీ కెరీర్ మెరుగుదలకు బలమైన సంకేతాలున్నాయి. మీ నెట్ వర్క్ పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవం పొందుతారు.
తులా రాశి
ఈ రోజు మీరు పాత అప్పుల నుంచి విముక్తి పొందుతారు. అదృష్టం మీద ఆధారపడకండి, శ్రమ మీద దృష్టి పెట్టండి. ఓర్పుతో అన్నిటినీ గెలవగలమని గుర్తుంచుకోండి. కాస్త ఓపికగా వ్యవహరిస్తే విజయం మీ సొంతం. భయం మీ ఆనందాన్ని నాశనం చేస్తుందని గుర్తుంచుకోండి.
Also Read: ఫిబ్రవరి 20 నుంచి 26 వారఫలాలు, ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. కొంచెం కష్టపడితే, మీరు మీ లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు. ఆర్థిక పరిస్థితిలో చాలా మెరుగుదల ఉండవచ్చు. వ్యాపార పరంగా ఈరోజు మంచి రోజు.
ధనుస్సు రాశి
ఈ రాశివారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా, ఉద్యోగం కోసం చూస్తున్నా దానికి సంబంధించి కీలకమైన అడుగు పడుతుంది, అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారులు, ఉద్యోగులకు ఇదే శుభసమయం. ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహంతో సిద్ధంగా ఉంటారు.
మకర రాశి
ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం నిండి ఉంటుంది. మీరు మంచి నాయకులుగా ప్రశంసలందుకుంటారు. ఫాంటసీలలో జీవించడం మానేసి భౌతిక ప్రపంచం ప్రకారం నడవడానికి ప్రయత్నించండి. ఈరోజు కుటుంబ సమస్యల వల్ల ఇబ్బంది పడతారు.
కుంభ రాశి
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. పనికి సంబంధించిన కొన్ని పెద్ద సవాలు మీ ముందుకు వస్తుంది. అలాగే మీరు ఇందులో విజయం సాధిస్తారు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు.
మీన రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. మీరు సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలను కనుగొంటారు. మీరు కొత్త వెంచర్‌లోకి ప్రవేశించే బలమైన సూచనలు ఉన్నాయి. విదేశీ పరిచయాలు మీకు మంచి చేస్తాయి. భాగస్వామ్య వ్యాపారం మీకు కలిసొస్తుంది