అన్వేషించండి

Horoscope Today January 11th 2024 : ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసొచ్చే టైమ్, జనవరి 11 రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 11th January  2024  - జనవరి 11 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రోజు మీరు అపరిచితులను నమ్మవద్దు. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి...ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావొచ్చు. ఆస్తులలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మంచి సమయమే ఇది. వ్యాపారంలో సాధారణ లాభం ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. ఈ రాశివారికి భౌతిక సుఖాలు, సంపదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు గృహ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. 

వృషభ రాశి (Taurus  Horoscope Today)

మీ ప్రవర్తనలో ఓపికగా , జాగ్రత్తగా ఉండాలి. సీనియర్ అధికారులు మీ పనులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తారు. ఉత్సాహం తగ్గుతుంది. పనిలో సహోద్యోగులు మిమ్మల్ని అగౌరవపరుస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉంటుంది. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. 

Also Read: సంక్రాంతికి నాన్ వెజ్ తింటున్నారా - పండుగ వేళ మీరు అస్సలు చేయకూడని పనులివే!

మిథున రాశి (Gemini Horoscope Today) 

కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. శత్రువులు మీ చేతిలో ఓడిపోతారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనుల్లో విజయం లభిస్తుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతతను కాపాడుకోండి. ఈ రోజు కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల సహకారంతో పనిలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందం, శాంతి, స్థిరత్వం ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనుల్లో విజయం లభిస్తుంది

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక ఖర్చుల వల్ల మనస్సు కలత చెందుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగుతాయి. ప్రేమ సంబంధాల గురించి చాలా ఎమోషనల్ గా ఉంటారు. వ్యాపారానికి సంబంధించి పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. రియల్ ఎస్టేట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు  ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కష్టపడి పని చేసి విజయం సాధిస్తారు. ఉద్యోగాలు మారేందుకు కొత్త అవకాశాలొస్తాయి. 

Also Read: ఇంటి ముందు ముగ్గు లేకపోతే అంత అపచారమా - సంక్రాంతికి మరింత ప్రత్యేకం ఎందుకు!

సింహ రాశి (Leo Horoscope Today)

సింహ రాశి వారు కుటుంబ సభ్యుల కోసం ధనం వెచ్చిస్తారు. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఈ రోజు మంచిది కానీ అనైతిక కార్యకలాపాల పట్ల మీ ఆసక్తి పెరగవచ్చు. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త ఆదాయ వనరుల ద్వారా సంపద పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది.  తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆఫీసులో వాదోపవాదాలకు దూరంగా ఉండండి.

కన్యా రాశి  (Virgo Horoscope Today) 
 
మీరు అనుకున్న పనులు అతికష్టం మీద పూర్తవుతాయి. స్నేహితుల నుంచి మంచి సందేశాలు అందుతాయి. ఉద్యోగులకు శుభసమయం. అనవసర విషయాలకు ఎక్కువ సమయం వెచ్చించవద్దు. కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి. కోపం తగ్గించుకోవాలి. కొత్త ఆదాయ వనరుల ద్వారా సంపద పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది.  ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. మీ జీవిత భాగస్వామితో కొంత విభేదాలు ఉండవచ్చు...మాట తూలవద్దు.

Also Read: అయోధ్య సహా దేశంలో ప్రముఖ రామాలయాలు ఇవే - వీటిలో ఎన్ని దర్శించుకున్నారు!

తులా రాశి (Libra Horoscope Today) 

ఉద్యోగం మారడానికి సమయం చాలా మంచిది. న్యాయపరమైన వివాదాల నుంచి ఉపశమనం పొందే బలమైన అవకాశం ఉంది. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. కొత్త ప్రేమ సంబంధాల పట్ల ఉత్సాహంగా ఉంటారు. మీ ప్రయాణంలో మీకు ముఖ్యమైన వ్యక్తులు పరిచయం కావచ్చు.  మీ జీవిత భాగస్వామితో కొంత విభేదాలు ఉండవచ్చు. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు.  వ్యాపారంలో  పురోగతి సాధిస్తారు. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

కారణం లేకుండా ప్రయాణం చేయవలసి రావచ్చు. విద్యార్థులు తమ కెరీర్‌కు సంబంధించి నిర్ణయం అయినా తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. పిల్లలు చదువు విషయంలో కాస్త అజాగ్రత్తగా ఉంటారు.కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కార్యాలయంలో కొంత గందరగోళం అనిపిస్తుంది. కోపం తగ్గించుకోవడం మంచిది.  వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. 

Also Read: సప్త పురాలు అంటే ఏవి - అయోధ్యదే ఫస్ట్ ప్లేస్ ఎందుకు!

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

పెద్ద వ్యాపార ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బావుంటుంది. కార్యాలయ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కూడా ఉండవచ్చు  మీరు వృత్తిపరమైన విజయాన్ని పొందుతారు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. మేథోపరమైన పనిలో విజయం సాధిస్తారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లకి భయపడకండి  విజయం సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి.

మకర రాశి (Capricorn Horoscope Today) 

మీ కోప స్వభావం మీకు చెడు చేస్తుంది. అసూయతో ఎవరినీ విమర్శించవద్దు. మీకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులను నియంత్రించండి. దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి! 

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

ఈ రాశివారికి శుభసమయం. కార్యాలయంలో కొత్త స్నేహితులు ఏర్పడవచ్చు. సినిమా రంగానికి చెందిన వ్యక్తులు మంచి ఫలితాలు పొందుతారు. మీ మనసులో ప్రేమను తెలియజేసేందుకు ఇదే మంచి సమయం.  మీపై మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. పాత మిత్రులతో సమావేశం ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కార్యాలయంలో కొత్త ప్రాజెక్ట్ కోసం బాధ్యత పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారంలో పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి.

మీన రాశి (Pisces Horoscope Today) 

ఈ రాశి అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. భవిష్యత్ కోసం కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. ఆస్తికి సంబంధించిన వివాదాల్లో మీక అనుకూలఫలితాలు వస్తాయి. ఆదాయంతో పాటూ ఖర్చులు కూడా పెరుగుతాయి. చేపట్టిన పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.  

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   

టాప్ హెడ్ లైన్స్

12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget