అన్వేషించండి

జూలై 25 రాశిఫలాలు, ఈ రాశివారు రహస్య శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ జూలై 25 మంగళవారం రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today July 25, 2023

మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. పనికిరాని పనులకు దూరంగా ఉండాలి. ఆనందం కోసం ఖర్చు చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ప్రేమ వివాహాలకు అనుకూల సమయం. 

వృషభ రాశి
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. మీరు తలపెట్టే పనులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అధికపనివల్ల ఒత్తిడికి గురవుతారు. అందరినీ సంప్రదించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాధలకు కుంగిపోవద్దు.   
దానధర్మాలపై ఆసక్తి ఉంటుంది.

మిథున రాశి5
పనిపై శ్రద్ధతగ్గుతుంది. ఒకేసారి నాలుగైదు పనులు చుట్టుముట్టడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. మీ పిల్లల ప్రవర్తనతో మీకు కోపం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఆత్మీయుల సమస్యల పట్ల జాగ్రత్త వహించండి. 

Also Read: ఈ నెలలో జన్మించినవారు సంఘంలో పేరు ప్రతిష్ఠలు సాధిస్తారు

కర్కాటక రాశి
ఈ రాశివారు ఆస్తి తగాదాల్లో చిక్కుకుంటారు. ఉద్యోగులు పనితీరులో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మంచి జరుగుతుంది. ముఖ్యందా ఆత్మ విశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి.  కార్యాలయంలో సహోద్యోగులతో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించండి.విద్యార్థులకు మంచిరోజు. చిన్న చిన్న విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొద్దు.

సింహ రాశి
జీవిత భాగస్వామి ప్రభావం మీపై చాలా ఉంటుంది. తండ్రి ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన ఉండవచ్చు. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయవచ్చు. విద్యార్థులు కొత్త టైమ్‌టేబుల్‌ను రూపొందించుకుని చదువుకుంటారు. మీరు కొత్త రకాల పరిశోధనలపై ఆసక్తి కనబరుస్తారు.

కన్యా రాశి 
మీ నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ఈ రాశి ఉద్యోగులు పని విషయంలో ఉన్నతాధికాలతో ప్రశంసలు అందుకుంటారు. మిమ్మల్ని తీవ్రమైన చర్యలకు ప్రేరేపించే వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. ప్రేమ జీవితం బావుంటుంది. 

తులా రాశి
ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. రిఫ్రెష్ గా పనిచేస్తారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి  ఈ రోడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీలో నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటారు. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు మంచిది. ఇతరుల నుంచి గౌరవం పొందుతారు. ట

వృశ్చిక రాశి
ఈ రాశివారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల విషయంలో నెగిటివ్ ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నగదు దుర్వినియోగం చేయవద్దు. మనసులో వింత ఆలోచనలు తలెత్తుతాయి. ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుంది. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. 

ధనుస్సు రాశి
మీలో ప్రతిభ పెరుగుతుంది. రాజకీయ వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త దుస్తులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహానికి వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. స్నేహితులతో కలసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. 

Also Read: జూలై 23 నుంచి 29 వారఫలాలు: ఈ వారం ఈ రాశులవారు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి

మకర రాశి
ఈ రాశివారి ఆలోచనల సానుకూలంగా ఉంటుంది.  సామాజిక సమస్యలపై మీ అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేయవచ్చు. రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. తండ్రివర్గం నుంచి ఆస్తులు పొందుతారు. కొత్త ఉద్యోగం కోసం చూసేవారికి ఈ రోజు అనుకూల సమయం. 

కుంభ రాశి
ఈ రాశివారు కొత్త ప్రయోగాలు చేయవద్దు. రహస్య శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. మీ కోపాన్ని నియంత్రించుకోండి. మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాల నుంచి ప్రయోజనం పొందుతారు. బంధువులను కలిసేందుకు వెళతారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు కొంతకాలం ఆగాలి.

మీన రాశి
ఈ రాశివారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.  మనసులో చాలా అనవసరమైన ఆలోచనలు ఉంటాయి. కటువుగా మాట్లాడవద్దు. మీ మనసులో మాటలు ఎవ్వరికీ చెప్పొద్దు. ఆహార నాణ్యతపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు, వ్యాపారులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget