Astrology: ఈ నెలలో జన్మించినవారు సంఘంలో పేరు ప్రతిష్ఠలు సాధిస్తారు
జన్మించిన సమయం, నక్షత్రం ఆధారంగా జాతకం చెబుతారు. ఓ వ్యక్తి నక్షత్రం, రాశి, పుట్టిన నెల ఆధారంగా కూడా స్వభావాన్ని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరి మీ స్వభావం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి
Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒకరి జాతకం చూడాలంటే పుట్టిన సమయం, గ్రహాల స్థితిని గమనిస్తారు. జన్మ నక్షత్రాన్ని బట్టి, ఆ నక్షత్రంలో ఉండే నాలుగు పాదాల ఆధారంగా కూడా ఫలితాలు మారుతాయి. రాశి చక్రం, అంశ చక్రం ఆధారంగా భవిష్యత్ ని అంచనా వేస్తారు. ఒక్కో వ్యక్తికి సంబంధించిన పూర్తి సమచారం కోసం వారు పుట్టిన సంవత్సరం, తేదీ, సమయం పరిగణలోకి తీసుకుంటారు. కానీ గ్రూప్ గా వ్యక్తుల స్వభావం గురించి చెప్పేందుకు ఆయా జాతకులు జన్మించిన నెల, రాశి, నక్షత్రం ఆధారంగా చెబుతారు. ఇంగ్లీష్ నెలలు జనవరి నుంచి మొదలైతే తెలుగు నెలలు చైత్రం నుంచి మొదలవుతాయి. తెలుగు నెలల ప్రకారం ఏ నెలలో జన్మిస్తే ఎలాంటి లక్షణం కలిగి ఉంటారో చెబుతారు పండితులు
Also Read: ఈ 3 రాశుల్లో జన్మించినవారి జాతకంలో రాజయోగం, అపారమైన సంపద పొందుతారు!
చైత్ర మాసం
ఈ నెలలో జన్మించిన వారు బలంగా ఉంటారు, ఏదైనా త్వరగా నేర్చుకుంటారు. కొత్తగా ప్రారంభించిన ఏ పని అయినా పూర్తయ్యేవరకూ పట్టువదలరు.
వైశాఖ మాసం
ఈ మాసంలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వం కలిగిఉంటారు. అందరకీ ఆదర్శవంతులుగా ఎదుగుతారు. మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు
జ్యేష్ఠమాసం
జ్యేష్ఠమాసంలో జన్మించినవారు చాలా తెలివిగలవారు,ముందుచూపు కలిగిఉంటారు.
ఆషాఢ మాసం
ఈ నెలలో పుట్టినవారు కష్టజీవులు. ఎంత పెద్ద కష్టాన్ని అయినా ఎదుర్కొనేందుకు, దాన్ని సాల్వ్ చేసుకుని ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉంటారు. కష్టాలకు బెదిరేరకం కాదు.
శ్రావణ మాసం
ఈ నెలలో జన్మించిన వారు ప్రముఖ వ్యక్తులుగా ప్రశంసలు అందుకుంటారు. సంఘంలో పేరు ప్రతిష్ఠలు సాధిస్తారు. సంప్రదాయాలకు విలువనిస్తూ జీవితం సాగిస్తారు
భాద్రపద మాసం
ఈ నెలలో పుట్టినవారు అందంగా ఉంటారు. అందరిలో కలివిడిగా ఉంటారు.
ఆశ్వయుజ మాసం
ఈ నెలలో జన్మించిన వారు దయగలవారై ఉంటారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు
Also Read: కలియుగం ఇంకా ఎన్నేళ్లుంది - కల్కి అవతరించేది అప్పుడేనా!
కార్తీక మాసం
ఈ నెలలో పుట్టినవారు మహా మాటకారులు. ఎదుటివారిని ఆకట్టుకోవడంతో వీళ్లకు వీళ్లే సాటి
మార్గశిర మాసం
ఈ నెలలో పుట్టినవారు పరిశోధనలపై ఆసక్తి చూపిస్తారు. ఎక్కువ ప్రాంతాలను సందర్శిస్తారు
పుష్య మాసం
పుష్యమాసంలో జన్మించిన వారు రహస్యాలు దాచడంలో ఘనులు. ఏ విషయం అయినా వీళ్లకి హాయిగా చెప్పేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో వ్యక్తికి చేరవేయరు.
మాఘమాసం
ఈ నెలలో పుట్టినవారికి చదువంటే పిచ్చి. పుస్తకాల పురుగులుగా ఉంటారు. మంచి ఆలోచనా విధానం కలిగిఉంటారు.
ఫాల్గుణ మాసం
తెలుగు నెలల్లో చివరి నెల అయిన ఫాల్గుణమాసంలో పుట్టినవారు కుటుంబాన్ని ప్రేమిస్తారు. కుటుంబం తర్వాతే ఏదైనా అని అనుకుంటారు. వీరు చాలా అదృష్టవంతులు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కొన్ని పుస్తకాల నుంచి సేకరించినది మాత్రమే. శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial