అన్వేషించండి

జూలై 23 నుంచి 29 వారఫలాలు: ఈ వారం ఈ రాశులవారు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి

Weekly Horoscope 23 to 29 July 2023: జూలై 23 ఆదివారం నుంచి 29 శనివారం వరకూ ఈ వారం ఏ రాశివారికి అనుకూలం, ఏ రాశులవారికి ప్రతికూలమో మీ వారఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Weekly Horoscope 23 to 29 July 2023

మేషరాశి

ఈ వారం మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. మీపై మీశ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. తలపెట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది.  మంచి ఆర్థిక ప్రణాళికను రూపొందించుకునేందుకు ఇదే మంచి సమయం. ఈ వారం తీసుకునే నిర్ణయాలు మీకు బాగా కలిసొస్తాయి. విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి సహకారం పొందుతారు. అదృష్టం కలిసొస్తుంది. ఈ వారం మీరు  "ఓం నమో నరసింహ" మంత్రాన్ని ప్రతిరోజూ 19 సార్లు జపించండి.

వృషభ రాశి

ఈ వారం ఈ రాశివారికి ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణిస్తుంది. విద్యార్థులుక ఈ వారం ప్రత్యేకంగా ఉంటుంది. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలి అనుకుంటే అడుగువేయండి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. "ఓం భార్గవాయ నమః" అనే మంత్రాన్ని రోజుకు 24 సార్లు పఠించండి.

మిధునరాశి

ఈ వారం సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోవాలి. నూతన పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం ఇది. ఉద్యోగులు మంచి ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచిరోజు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలసి తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
"ఓం నమో నారాయణాయ" అనే మంత్రాన్ని రోజూ 41 సార్లు జపించండి.

Also Read: ఈ నెలలో జన్మించినవారు సంఘంలో పేరు ప్రతిష్ఠలు సాధిస్తారు

కర్కాటక రాశి

ఈ వారం ఈ రాశివారి ఆరోగ్యం బావుంది.ఈ వారం మీరు పెట్టబోయే పెట్టుబడులు భవిష్యత్ లో మంచి లాభాలనిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి అడుగేయండి. సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులను కలుస్తారు. వారి అనుభవాల నుంచి కొత్త ప్రణాళికలు రూపొందించడం ద్వారా మీకు ప్రయోజనం చేకూరుతుంది. "ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని రోజూ 19 సార్లు జపించండి.

సింహ రాశి

ఈ వారం సింహరాశివారికి ఒత్తిడి తప్పదు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. లేదంటే ఆ తర్వాత పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. ఎవరినీ అవసరానికి మించి విశ్వసించవద్దు. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. “ఓం సూర్యాయ నమః” అనే మంత్రాన్ని రోజూ 11 సార్లు జపించండి

కన్యా రాశి 

ఈ రాశివారికి ఈ వారం మానసిక ఒత్తిడి ఉండవచ్చు. మీరు మీ అలవాట్లలో కొన్నింటిని మెరుగుపరచుకోవాలి. మీ ఖర్చులు చాలా వరకు పెరగడంతో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆర్థిక జీవితంలో కొనసాగుతున్న సంక్షోభం మీ కుటుంబ సభ్యుల ముందు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మంగళవారం నియమాలు పాటించండి.

Also Read: ఈ 3 రాశుల్లో జన్మించినవారి జాతకంలో రాజయోగం, అపారమైన సంపద పొందుతారు!

తులా రాశి

ఈ రాశివారు కెరీర్‌ని మెరుగుపరచుకోవడంలో  ఈ వారం సక్సెస్ అవుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. రానున్న కాలంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ తోబుట్టువులు మీకు కొన్ని పెద్ద బాధ్యతలను అప్పగిస్తారు. వాటివల్ల మీరు లాభపడతారు. ఆ మార్గంలో సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించగలరు. ఓపికగా ఆలోచిస్తే ప్రతి సమస్యను అధిగమించగలుగుతారు. “ఓం కేతవే నమః” అనే మంత్రాన్ని రోజూ 21 సార్లు జపించండి.

వృశ్చిక రాశి

ఈ వారం మీ ఆర్థికర పరిస్థితి క్షీణించవచ్చు. ఇతరుల సమస్యల మీరు తప్పుగా ఆలోచిస్తారు. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. కుటుంబానికి సంబంధించి ఏదైనా విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు మీ అవగాహనను సరిగ్గా చూపించండి. ఇంట్లో ఉండే సమస్యల పరిష్కరించుకోగలరు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. "ఓం మంగళాయ నమః" అనే మంత్రాన్ని రోజూ 41 సార్లు జపించండి.

ధనుస్సు రాశి

ఈ వారం మీరు మీ దినచర్యతో విసుగు చెందుతారు. కొన్ని లావాదేవీలకు సంబంధించిన విషయాలలో వీలైనంత అప్రమత్తంగా ఉండండి. మీరు మీ కెరీర్‌లో చాలా విజయాలను పొందుతారు. ఉద్యోగులకు జీతంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో లాభం పొందుతారు. చదువుకోసం విదేశాలకు వెళ్లాలి అనుకునే విద్యార్థుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. 

మకర రాశి

ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఈ వారం మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. గతంలో మీ జీవితంలో ఉండే రహస్యనాలను వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు బయటపెట్టడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. "ఓం మండాయ నమః" అనే మంత్రాన్ని ప్రతిరోజూ 44 సార్లు జపించండి.

కుంభ రాశి

ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఇబ్బందుల నుంచి మీరు ఉపశమనం పొందుతారు. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఉండేందుకు ప్రయత్నించండి. బుధుడు సప్తమంలో ఉండటం వల్ల ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఈ వారం విజయం సాధిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.  "ఓం శనైశ్వరాయ నమః" అనే మంత్రాన్ని రోజూ 19 సార్లు జపించండి.

మీన రాశి

ఈ వారం ఈ రాశివారు బిజీ బిజీగా ఉంటారు. ఆర్థిక సమస్యలకు సంబంధించి ఈ వారం ప్రారంభంలో మీకు అనుకూలంగా ఉండవచ్చు కానీ వారం చివరిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మీ ఇమేజ్ దెబ్బతింటుంది.  "ఓం బృహస్పతయే నమః" అనే మంత్రాన్ని ప్రతిరోజూ 21 సార్లు జపించండి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP DesamPV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP DesamAllu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Kangana Ranaut: హాట్ బేబీస్, బీచ్‌లు, ఐటెమ్ నంబర్లే... ‘పుష్ప 2’ని ఉద్దేశిస్తూ ఫైర్ బ్రాండ్ కంగనా కామెంట్స్ వైరల్
హాట్ బేబీస్, బీచ్‌లు, ఐటెమ్ నంబర్లే... ‘పుష్ప 2’ని ఉద్దేశిస్తూ ఫైర్ బ్రాండ్ కంగనా కామెంట్స్ వైరల్
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Bank Defaulters: లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
Embed widget