Delhi Election Result 2025 :ఢిల్లీలో 70 సీట్లలో ఎవరు ఎక్కడ గెలిచారో పూర్తి జాబితా ఇదే
Delhi Election Result 2025 :ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మొత్తం 70 స్థానాల ఫలితాలు వచ్చేశాయి. రెండున్నర దశాబ్దాల తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది.

Delhi Election Result 2025 :ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితం బిజెపి శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది, మరోవైపు ఆప్‌లో నిరాశ కనిపిస్తోంది. ఈ ఎన్నికలు చాలా మంది పెద్ద నాయకులను ఓడించడమే కాకుండా, చాలా మంది బిజెపి నాయకుల కెరీర్లకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించగా, ఆప్ 22 స్థానాల్లో విజయం సాధించింది. బిజెపి ఓట్ల వాటా 7 శాతం పెరగగా, ఆప్ ఓట్ల వాటా 10 శాతం తగ్గింది. బిజెపికి 45.56 శాతం ఓట్లు రాగా, ఆప్‌కు 43.57 శాతం ఓట్లు వచ్చాయి.
అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్, సోమనాథ్ భారతి, దుర్గేష్ పాఠక్ వంటి పెద్ద ఆప్ నాయకులు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. మరోవైపు, బిజెపి నుంచి పర్వేశ్ వర్మ, మంజీందర్ సింగ్ సిర్సా, కైలాష్ గెహ్లాట్, అరవిందర్ సింగ్ లవ్లీ, కపిల్ మిశ్రా, మోహన్ సింగ్ బిష్ట్, కుల్వంత్ రాణా విజేంద్ర గుప్తా తమ స్థానాలను గెలుచుకున్నారు.
ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు గెలిచిన అభ్యర్థులు
| క్రమసంఖ్య | నియోజకవర్గం | గెలిచిన అభ్యర్థి | పార్టీ పేరు |
| 1 | నరేలా | రాజ్ కరణ్ ఖత్రి | బీజేపీ |
| 2 | బురారీ | సంజీవ్ ఝా | ఆప్ |
| 3 | తిమార్పూర్ | సూర్య ప్రకాష్ ఖత్రి | బీజేపీ |
| 4 | ఆదర్శ్ నగర్ | రాజ్ కుమార్ భాటియా | బీజేపీ |
| 5 | బద్లీ | దీపక్ చౌదరి | బీజేపీ |
| 6 | రిథాల | కుల్వంత్ రాణా | బీజేపీ |
| 7 | బవానా | రవీందర్ ఇంద్రరాజ్ సింగ్ | బీజేపీ |
| 8 | మండ్కా | గజేంద్ర ద్రల్ (బిజెపి) | బీజేపీ |
| 9 | కిరాడీ | అనిల్ ఝా | ఆప్ |
| 10 | సుల్తాన్‌పూర్ | ముఖేష్ కుమార్ అహ్లవత్ | ఆప్ |
| 11 | నాంగ్లోయ్ | మనోజ్ కుమార్ షౌకీన్ | బీజేపీ |
| 12 | మంగోల్ | రాజ్ కుమార్ చౌహాన్ | బీజేపీ |
| 13 | రోహిణి | విజేందర్ గుప్తా | బీజేపీ |
| 14 | షాలిమర్ | రేఖా గుప్తా | బీజేపీ |
| 15 | షకుర్ బస్తీ | కర్నైల్ సింగ్ | బీజేపీ |
| 16 | త్రినగర్ | తిలక్ రామ్ గుప్తా | బీజేపీ |
| 17 | వజీర్పూర్ | పూనమ్ శర్మ | బీజేపీ |
| 18 | మోడల్ టౌన్ | అశోక్ గోయల్ | బీజేపీ |
| 19 | సదర్ బజార్ | సోమ్ దత్ | ఆప్ |
| 20 | చాందినీ చౌక్ | పునర్దీప్ సింగ్ షావానే | ఆప్ |
| 21 | మాటియా మహల్ | షోయబ్ ఇక్బాల్ | ఆప్ |
| 22 | బల్లిమారన్ | ఇమ్రాన్ హుస్సేన్ | ఆప్ |
| 23 | కరోల్ బాగ్ | విశేష్ రవి | ఆప్ |
| 24 | పటేల్ నగర్ | పర్వేష్ రతన్ | ఆప్ |
| 25 | మోతీ నగర్ | హరీష్ ఖురానా | బీజేపీ |
| 26 | మాడిపూర్ | కైలాష్ గంగ్వాల్ | బీజేపీ |
| 27 | రాజౌరీ గార్డెన్ | మంజిందర్ సిర్సా | బీజేపీ |
| 28 | హరి నగర్ | శ్యామ్ శర్మ | బీజేపీ |
| 29 | తిలక్ నగర్ | జర్నైల్ సింగ్ | ఆప్ |
| 30 | జనకపురి | ఆశిష్ సూద్ | బీజేపీ |
| 31 | వికాస్పురి | పంకజ్ కుమార్ సింగ్ | బీజేపీ |
| 32 | ఉత్తమ్ నగర్ | పవన్ శర్మ | బీజేపీ |
| 33 | ద్వారక | ప్రద్యుమన్ సింగ్ రాజ్‌పుత్ | బీజేపీ |
| 34 | మటియాల | సందీప్ సెహ్రావత్ | బీజేపీ |
| 35 | నజాఫ్‌గర్ | నీలం పహల్వాన్ | బీజేపీ |
| 36 | బిజ్వాసన్ | కైలాష్ గెహ్లాట్ | బీజేపీ |
| 37 | పాలం | కుల్దీప్ సోలంకి | బీజేపీ |
| 38 | ఢిల్లీ కంటోన్మెంట్ | వీరేందర్ సింగ్ | ఆప్ |
| 39 | రాజిందర్ నగర్ | ఉమాంగ్ బజాజ్ | బీజేపీ |
| 40 | న్యూఢిల్లీ | పర్వేష్ వర్మ | బీజేపీ |
| 41 | జంగ్‌పుర | తర్విందర్ సింగ్ మార్వా | బీజేపీ |
| 42 | కస్తూర్బా నగర్ | నీరజ్ బసోయా | బీజేపీ |
| 43 | మాల్వియా నగర్ | సతీష్ ఉపాధ్యాయ్ | బీజేపీ |
| 44 | R K పురం | అనిల్ కుమార్ శర్మ | బీజేపీ |
| 45 | మెహ్రౌలీ | గజేంద్ర సింగ్ యాదవ్ | బీజేపీ |
| 46 | ఛతర్పూర్ | కర్తార్ సింగ్ తన్వర్ | బీజేపీ |
| 47 | డియోలీ | ప్రేమ్ Kr చౌహాన్ | ఆప్ |
| 48 | అంబేద్కర్ నగర్ | అజయ్ దత్ | ఆప్ |
| 49 | సంగం విహార్ | చందన్ కుమార్ చౌదరి | బీజేపీ |
| 50 | గ్రేటర్ కైలాష్ | శిఖా రాయ్ | బీజేపీ |
| 51 | కల్కాజీ | అతిషి | ఆప్ |
| 52 | తుగ్లకాబాద్ | సాహి రామ్ | ఆప్ |
| 53 | బదర్పూర్ | రామ్ సింగ్ నేతాజీ | ఆప్ |
| 54 | ఓక్లా | అమానతుల్లా ఖాన్ | ఆప్ |
| 55 | త్రిలోకపురి | అంజనా పర్చా | బీజేపీ |
| 56 | కొండ్లి | కులదీప్ కుమార్ | ఆప్ |
| 57 | పత్పర్గంజ్ | రవీంద్ర సింగ్ నేగి | బీజేపీ |
| 58 | లక్ష్మీ నగర్ | అభయ్ వర్మ | బీజేపీ |
| 59 | విశ్వాస్ నగర్ | ఓం ప్రకాష్ శర్మ | బీజేపీ |
| 60 | కృష్ణ నగర్ | అనిల్ గోయల్ | బీజేపీ |
| 61 | గాంధీ నగర్ | అరవిందర్ సింగ్ లవ్లీ | బీజేపీ |
| 62 | షహదర | సంజయ్ గోయల్ | బీజేపీ |
| 63 | సీమాపురి | వీర్ సింగ్ ధింగన్ | ఆప్ |
| 64 | రోహ్తాస్ నగర్ | జితేంద్ర మహాజన్ | బీజేపీ |
| 65 | సీలంపూర్ | జుబేర్ చౌదరి | ఆప్ |
| 66 | ఘొండా | అజయ్ మహావర్ | బీజేపీ |
| 67 | బబర్‌పూర్ | గోపాల్ రాయ్ | ఆప్ |
| 68 | గోకల్పూర్ | సురేంద్ర కుమార్ | ఆప్ |
| 69 | ముస్తఫాబాద్ | మోహన్ సింగ్ బిష్ట్ | బీజేపీ |
| 70 | కరావాల్ నగర్ | కపిల్ మిశ్రా | బీజేపీ |





















