Horoscope Today 14th January 2023 : భోగ భాగ్యాలు కలిగించే భోగి రోజు ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది
Rasi Phalalu Today 14th January 2023 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
![Horoscope Today 14th January 2023 : భోగ భాగ్యాలు కలిగించే భోగి రోజు ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది Horoscope Today 14th January bhogi 2023 Rasi Phalalu Astrological Prediction for Gemini, Aries, leo and other Zodiac signs in Telugu Horoscope Today 14th January 2023 : భోగ భాగ్యాలు కలిగించే భోగి రోజు ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/1e116fca6b87a8121ece955ec0462f8f1673627006529217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
14th January 2023 Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
భోగి రోజు ఈ రాశివారు ఆనందంగా ఉంటారు. వైవాహిక జీవితం బావుంటుంది. కుటుంబంతో కలసి టైమ్ స్పెండ్ చేస్తారు. ముఖ్యమైన పని పూర్తి చేయడంలో విజయం సాధించగలరు. వ్యాపారులు ఈ రోజు లాభాలు పొందుతారు
వృషభ రాశి
మకర సంక్రాంతి రోజున మీ కోరికలన్నీ నెరవేరుతాయి. తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. ప్రయాణం వినోదాత్మకంగా ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులు లాభాలు పొందుతారు
మిథున రాశి
ఆర్థిక సమస్యల కారణంగా ఇబ్బంది పడతారు. మీ నుంచి అతిగా ఆశించే వ్యక్తులకు నో చెప్పేందుకు సిద్ధంగా ఉండండి. స్నేహితులు, కుటంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
Also Read: భోగి రోజు మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి
కర్కాటక రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం కొద్దిగా పెరగొచ్చు. మీ ఆర్థిక పరిస్థితిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. నిరంతర కృషితో మీరు ప్రతికూల పరిస్థితిని అధిగమిస్తారు.
సింహ రాశి
ఈ రోజు మీరు ప్రారంభించిన పనులను అంకితభావంతో పూర్తిచేయాలి. ఇతరుల విజయాలను కూడా ఎంజాయ్ చేయండి. మీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకునే పనులు చేయవద్దు. ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తవచ్చు. ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు.
కన్యా రాశి
మీ పురోగతికి ఆటంకం కలిగించే సమస్యలనుంచి బయటపడేందుకు ఇదే మంచి సమయం. ఈ రోజు మీరు ఆర్థిక పథకాల్లో పెట్టుబడులు పెట్టేదిశగా ఆలోచిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు లాభ నష్టాలను జాగ్రత్తగా పరిశీలించండి.
Also Read: భోగి, సంక్రాంతికి ఇంటి ముందు గొబ్బిళ్లు ఎందుకు పెడతారు, ఆ పాటల వెనుకున్న ఆంతర్యం ఏంటి!
తులా రాశి
భోగి రోజు ఈ రాశివారికి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి మంచి రోజు. కార్యాలయంలో సహోద్యోగి నుంచి సహకారం పొందుతారు.వ్యాపారం బాగా సాగుతుంది. ఈ రాశి విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అవుతుంది.
వృశ్చిక రాశి
ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరంగా మీకు అనుకూలమైన రోజు. పేదలకు సహాయం చేయడం ద్వారా శని దేవుడి అనుగ్రహం పొందుతారు. మీ కారణంగా జీవితభాగస్వామి ఒత్తిడికి గురవుతుంది.
ధనుస్సు రాశి
ఎదుటివారు చెప్పింది జాగ్రత్తగా వినండి...అప్పుడే మీ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. రోజులు గడుస్తున్న కొద్ద ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.మీలో లోపాలన సరిచేసుకోవాలి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది
మకర రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఏ పని విషయంలోనూ తొందరపడకుండా ఉండాలి. ఆధ్యాత్మిక వ్యవహరాలవైపు మొగ్గు చూపుతారు. తల్లిదండ్రులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
కుంభ రాశి
ఈ రోజు ఈ రాశివారి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మాట విషయంలో సంయమనం పాటించడం ద్వారా చాలా అపార్థాల నుంచి బయటపడతారు.
మీన రాశి
మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణంలో సంతోషం ఉంటుంది. బిజీబిజీగాఉన్నప్పటికీ రోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం మంచిది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)