అన్వేషించండి

Horoscope Today Dec 12, 2023: డిసెంబరు 12 మంగళవారం ఈ రాశులవారికి అనుకూలం!

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

 Daily Horoscope Today Dec 12, 2023


మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ రాశివారు కుటుంబానికి తగిన సమయం ఇవ్వండి.  చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం మానుకోండి. మీ మనస్సులో అనవసరమైన ఖర్చుల గురించి చింత ఉంటుంది. ప్రతికూల విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. మీతో పనిచేసే ఉద్యోగులను ఎక్కువగా నమ్మవద్దు.

వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మితిమీరిన కోపం కారణంగా చేయాల్సిన పని పూర్తికాదు. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి..వాటి పరిధిని నియంత్రించడం మంచిది. మీ  ప్రవర్తనా విధానం మెచ్చుకోలుగా ఉంటుంది. పెద్దలకు బహుమతులు కొనుగోలు చేస్తారు.

మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈ రోజు మీరు శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల ఆశలు నెరవేరుతాయి. రాజకీయ పరిచయాల వల్ల ప్రయోజనం పొందుతారు. ఇంట్లో వాతావరణం క్రమశిక్షణగా ఉంటుంది. మీరు కార్యాలయంలో ఎక్కువ పని చేయాల్సి రావచ్చు.

Also Read: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

ఈ రాశివారు ఏదో విషయంలో ఆందోళనగా ఉంటారు. శుభ కార్యాలకు ప్రణాళిక వేస్తారు. స్వార్థపూరిత ప్రవర్తన కారణంగా మీరు ప్రేమలో నెగ్గలేరు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆరోగ్యం జాగ్రత్త.  బాధ్యతల కారణంగా మీ ఇతర పనులు ప్రభావితమవుతాయి.

సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఈ రాశివారు సామాజిక బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తారు. స్త్రీల ఆరోగ్యం  బాగుంటుంది. గతంలోని ప్రతికూల అంశాలు మళ్లీ తెరపైకి రావచ్చు. మీ ఆసక్తికి అనుగుణంగా పని చేయడానికి ప్రయత్నించండి. మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు.

కన్యా రాశి  (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

ఈ రోజు మీరు మీ దినచర్యలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.  ఐటీతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆదాయం పెరగవచ్చు. కుటుంబ జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలలో ఆటంకాలు తొలగిపోతాయి. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు.  ఈ రోజు వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. 

Also Read: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

ఈ రాశివారు అప్పులు చేయవద్దు. మీ ప్రేమికుడితో ఏదో ఒక విషయంలో గొడవలు రావచ్చు. కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తారు. వ్యాపారంలో గొప్ప అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రాశివారికి ఇంటిపనిపై శ్రద్ధ ఉండదు. ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. పాత విషయాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కొంత లోపం వల్ల పని చెడిపోవచ్చు.

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

ఈ రాశివారి ఆరోగ్యం బలహీనంగా మారవచ్చు. మీ కుటుంబ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి రోజు చాలా మంచిది. మీరు పని సమస్యల కారణంగా కొంత ఆందోళన చెందుతారు. అపరిచితులతో ఎక్కువగా సంభాషించవద్దు. పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించండి.

Also Read: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

కుటుంబ సభ్యులు మీకు చాలా మద్దతునిస్తారు. తండ్రి పట్ల గౌరవభావం పెరుగుతుంది. మీరు ప్రదర్శన కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. నిరుపేదలకు సహాయం చేస్తారు. ఆచరణ సాధ్యం కాని లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నిస్తారు. అధికారుల అనుకూలతను సద్వినియోగం చేసుకోండి.

కుంభ రాశి  (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

మీ పని సామర్థ్యం పెరుగుతుంది  కానీ కొన్ని సమస్యల కారణంగా ఇబ్బందులు తప్పవు. సాయంత్రం లోపు అవసరమైన పనులను పూర్తి చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఒకరి భావాలను మరొకరు చూసుకోండి. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు.

మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

నూతన ఉద్యోగం ప్రారంభించడానికి మంచి సమయం. పోటీ పరీక్షల్లో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది.  కార్యాలయంలో మీ స్థానం బలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget