Friendship Day 2025: మీ స్నేహం ప్రేమగా మారుతుందా? మేషం నుంచి మీనం మీ రాశి ఏం చెబుతోంది !
International Friendship Day 2025: అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ఆగస్టు 3 ఆదివారం. స్నేహం ప్రాముఖ్యతను గుర్తించడమే ఈ రోజు లక్ష్యం. అయితే కొందరు స్నేహితులు అనుకోకుండా ప్రేమికులుగా మారుతారు..

Friendship Day Special
ప్రతి సంవత్సరం ఆగస్టు నెల మొదటి ఆదివారం నాడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు. 2025లో ఫ్రెండ్షిప్ డే ఆగస్టు 3 న జరుపుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే స్నేహబంధం మరింత లోతుగా మారితే అది ప్రేమ అవుతుంది. కానీ అదెప్పుడు ప్రేమగా మారుతుందో తెలియదు. మీ రాశిని బట్టి ప్రేమ విషయంలో మీరు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుందాం.
మేష రాశి
ఇది అగ్నితత్వ రాశి. ఈ రాశి వారిలో చాలా ఉత్సాహం శక్తి ఉంటుంది . తమ ప్రేమ సంబంధాల గురించి వీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ప్రేమికులపై పూర్తి అధికారం ఉందనకుంటారు. వీరి స్నేహం, ప్రేమ చాలా లోతుగా ఉంటుంది. స్నేహితుల్లో ఒకరితో ప్రేమలో పడతారు
వృషభ రాశి
శుక్రుని ప్రభావం వల్ల ఈ రాశి వారు విలాస ప్రియులు. ఈ రాశి వారు చాలా బలమైన అభిప్రాయాలు కలిగిఉంటారు. వీరి ప్రత్యేకత ఏంటంటే వీరు తమ ప్రేమ సంబంధం - స్నేహితుల మధ్య వ్యత్యాసం ఉందని నమ్ముతారు. వీరి స్నేహితులు ప్రేమికులుగా ఎప్పటికీ మారలేదు.
మిథున రాశి
ఈ రాశి వారు చాలా చురుకైన స్వభావం కలిగి ఉంటారు. ఏ విషయాన్నైనా తక్షణమే సమాధానం చెప్పడం వీరి ప్రత్యేకత. తమ ప్రేమ జీవితం గురించి ఈ చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువ కాలం ఒంటరిగా ఉండలేరు..అందుకే ప్రియమైన స్నేహితుడినే ప్రేమికుడిగా ఫిక్సైపోతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారిలో చాలా ఆకాంక్షలు ఉంటాయి. భావోద్వేగ స్వభావం కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు తమ భావాలను అర్థం చేసుకునే ప్రేమ సంబంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటారు. ఈ రాశి వారు బెస్ట్ ఫ్రెండ్ ని జీవిత భాగస్వామిగా చేసుకోవాలని భావిస్తారు.
సింహ రాశి
ఈ రాశి వారు చాలా ఉదారులు , నమ్మకస్తులు. వీరు ఎవరినైతే ప్రేమిస్తారో వారిని మనస్సు లోతుల్లోంచి ప్రేమిస్తారు. ఈ వ్యక్తులకు సాహసం అంటే చాలా ఇష్టం. ప్రేమికుడితో కలిసి తిరగడం వారికి చాలా ఇష్టం. ఈ రాశి వారు తమ స్నేహితులను ఎప్పుడూ ప్రేమికులుగా చేసుకోరు.
కన్యా రాశి
కన్యా రాశి వారు చాలా ఆలోచించి ఏ పని అయినా చేస్తారు. ప్రేమ విషయంలో కూడా చాలా ఆలోచించి అడుగు వేస్తారు. వీరు తమ ప్రేమికులకు , స్నేహితులకు ఇద్దర్నీ ఒకటిగా చూడరు. ఇద్దరి విషయంలో నిజాయితీ, అంకితభావం కలిగి ఉంటారు.
తులా రాశి
ఈ రాశి వారు కాస్త ఎక్కువ సామాజికంగా ఉంటారు. వీరు స్వభావరీత్యా చాలా సరదాగా ఉంటారు. ఈ రాశి వారి స్నేహం చాలాసార్లు ప్రేమగా మారుతుంది. అంతేకాకుండా వీరు కొత్త సంబంధాలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు తమ వ్యక్తిగత విషయాలను చాలా తీవ్రంగా తీసుకుంటారు. ఈ వ్యక్తులు తమ ప్రేమికుల గురించి ప్రతిదీ తెలుసుకోవడానికి , గమనించడానికి ఇష్టపడతారు. ఈ వ్యక్తులు ప్రేమ - స్నేహం రెండింటిలోనూ చాలా నిజాయితీగా ఉంటారు.
ధనుస్సు రాశి
ఈ రాశి వారు చాలా తాత్వికులు. ఈ వ్యక్తులు ఏ సంబంధాన్నైనా మనస్ఫూర్తిగా నిర్వహిస్తారు. ఈ వ్యక్తులు తమ ప్రేమ జీవితాన్ని చాలా ఉత్తేజకరంగా ఉంచుకుంటారు. ప్రేమికులు, స్నేహితులతో కలిసి తిరగడం, సరదాగా గడపడం వారికి ఇష్టం. ఈ వ్యక్తులు తమ స్నేహం - ప్రేమ రెండింటినీ కలపరు.
మకర రాశి
ఈ రాశి వారు తమ ప్రేమ సంబంధాలను చాలా తీవ్రంగా పరిగణిస్తారు. ప్రేమ సంబంధాలలో వీరు ఏమాత్రం తొందరపాటు చూపించరు. ఈ రాశి వారు ప్రతి పనిని చాలా ఆలోచించి చేస్తారు.
కుంభ రాశి
కుంభ రాశి వారు స్నేహితుడితో లోతైన మానసిక భావోద్వేగ సంబంధాన్ని పెంచుకుంటేనే అభిప్రాయం మారుతుంది. వీరి ఆశించిన స్నేహం అందినప్పుడే దాన్ని ప్రేమగా మార్చుకోవాలా వద్దా ఆలోచిస్తారు.
మీన రాశి
మీన రాశి వారు ఎక్కువగా కలల ప్రపంచంలో విహరిస్తారు. వీరు భావోద్వేగ సంబంధాలను కోరుకుంటారు. స్నేహం ప్రేమకు బలమైన పునాదిగా ఉంటుందని నమ్ముతారు. భాగస్వామితో లోతైన బంధాన్ని, పరస్పర అవగాహనను కోరుకుంటారు.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















