అన్వేషించండి

Shani Amavasya 2025: ఆగష్టు 23 శని అమావాస్య! మీ రాశి ప్రకారం ఈ వస్తువులను దానం చేస్తే పితృదేవతలు అనుగ్రహిస్తారు!

Shani Amavasya 2025: శ్రావణ శని అమావాస్య 2025: ఆగస్టు 23, 2025 న శని అమావాస్య. మీ రాశి ప్రకారం దానం చేస్తే గ్రహాలు బలపడతాయి, పితృ దోషాలు తొలగిపోతాయని చెబుతారు పండితులు

 Donation According to Zodiac Sign: పంచాంగం ప్రకారం, ప్రతి నెలా కృష్ణ పక్షం 15వ రోజున అమావాస్య వస్తుంది. ప్రస్తుతం శ్రావణమాసం నడుస్తోంది. ఈ నెలలో  అమావాస్య తిథి శనివారం, ఆగస్టు 23న ఉంది. శనివారం రోజున రావడంతో దీనిని శని అమావాస్య లేదా శనిశ్చర అమావాస్య అని కూడా పిలుస్తారు. అమావాస్య తిథి నాడు స్నానం, దానం, పితృదేవతలకు తర్పణం చేయడం చాలా ముఖ్యమైనది.

ఆగస్టు 23న శనిశ్చర  అమావాస్య

శ్రావణ అమావాస్య తిథి ప్రారంభం ఆగస్టు 22 శుక్రవారం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుంచి
శ్రావణ అమావాస్య తిథి ముగింపు ఆగస్టు 23 శనివారం ఉదయం 11 గంటల 17 నిమిషాలకు
శ్రావణ శని అమావాస్య తిథి శనివారం, ఆగస్టు 23 (ఉదయాతిథి ప్రకారం)

 

 

అమావాస్య తిథి నాడు పవిత్ర నదిలో స్నానం చేసి దానం చేసే ఆచారం ఉంది. అమావాస్య నాడు చేసే దానం పితృదేవతలను తృప్తిపరుస్తుందని నమ్ముతారు. ఆగస్టు 23న ఉదయం 11 గంటల 17 నిమిషాల వరకు దానం చేసుకోవచ్చు. కానీ రాశి ప్రకారం చేసే దానం మరింత ఫలవంతంగా పరిగణిస్తారు.  దీనివల్ల పితృదేవతలు సంతోషిస్తారు , జాతకంలో నడుస్తున్న అశుభ గ్రహాలు కూడా శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి.  శ్రావణ శని అమావాస్య నాడు రాశి ప్రకారం ఏయే వస్తువులను దానం చేయాలో తెలుసుకుందాం.

అమావాస్య 2025: రాశి ప్రకారం దానం

మేష  రాశి (Aries)- ఎరుపు రంగు వస్త్రాలు, ఎర్రటి కందిపప్పు, బెల్లం దానం చేయడం ఉత్తమం.

వృషభ రాశి (Taurus)- స్నానం చేసిన తర్వాత పితృదేవతలకు తర్పణం  విడిచి, తెల్లటి వస్త్రాలు, పాలు , బియ్యం దానం చేయండి.

మిథున రాశి (Gemini)- ఆకుపచ్చని వస్త్రాలు, పెసరపప్పు , ధనియాలు దానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

కర్కాటక రాశి (Cancer)-  వెండి, బియ్యం,  పాలు దానం చేయండి. మానసిక శాంతి లభిస్తుంది.

సింహ రాశి (Leo)- స్నానం చేసిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించి గోధుమలు, బెల్లం, రాగి పాత్రను దానం చేయండి.

కన్య రాశి (Virgo)-  పెసరపప్పు, ఆకుపచ్చని వస్త్రాలు, ఆకుకూరలు , పండ్లను దానం చేయండి.

తుల రాశి (Libra)-  తెల్లటి వస్తువులు, ధాన్యం లేదా వస్త్రాలను దానం చేయవచ్చు.

వృశ్చిక రాశి (Scorpio)-  ఎరుపు రంగు వస్త్రాలు, కందిపప్పు , బెల్లం దానం చేయండి. పితృదేవతలు సంతోషిస్తారు .. మంగళ దోషం తొలగిపోతుంది.

ధనుస్సు రాశి (Sagittarius)- పసుపు రంగు వస్తువులు, పసుపు, శనగపప్పు, అరటిపండు , పసుపు వస్త్రాలు  దానం చేయండి.

మకర రాశి (Capricorn)అమావాస్య నాడు స్నానం చేసిన తరువాత శని దేవుడిని ధ్యానిస్తూ నల్లటి వస్త్రాలు, మినపప్పు,  నువ్వులను దానం చేయండి.

కుంభ రాశి (Aquarius)-  తృదేవతలకు తర్పణం ఇవ్వండి.  నీలం రంగు వస్త్రాలు, నువ్వులు , నూనెను దానం చేయండి. సాయంత్రం శని దేవుడిని పూజించండి.

మీన రాశి (Pisces)- పసుపు రంగు వస్త్రాలు, శనగపప్పు, పసుపు పండ్లు, పువ్వులు, వస్త్రాలు  దానం చేయండి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది.  దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. వీటిని పరిగణలోకి తీసుకునేముందు,అమలు చేసేముందు మీకు నమ్మకమైన ఆధ్యాత్మికవేత్తల సలహాలు కూడా స్వీకరించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
వృషభ రాశి ఆగస్టు 16-22 వారఫలం: కెరీర్, ప్రేమలో అద్భుత ప్రగతి!
వృషభ రాశి ఆగస్టు 16-22 వారఫలం: కెరీర్, ప్రేమలో అద్భుత ప్రగతి!
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
మేష రాశి వారఫలాలు ఆగస్టు 16-22: ఆర్థిక పురోగతి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం!
మేష రాశి వారఫలాలు ఆగస్టు 16-22: ఆర్థిక పురోగతి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget