అన్వేషించండి

గణేష్ చతుర్థి 2025: మండపాల్లో గణేషుడుని ఏ ముఖంగా ఉంచాలి? ఇంట్లో విగ్రహం ఏ దిశగా పెట్టాలి!

Ganesh Chaturthi Special Vastu Tips : వినాయక చవితి సందడి ప్రారంభమైంది. మండపాలకు తరలివచ్చేందుకు గణపయ్యలు సిద్ధంగా ఉన్నారు. ఇంతకీ గణేషుడిని ఏ దిశగా ప్రతిష్టించాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి..

Vastu Tips For Ganesh Idol :  ముక్కోటి దేవుళ్లలో మొదటి పూజ వినాయకుడికే. ఏ పూజ చేసినా, నోము నోచినా, ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా పూజించేది గణేషుడినే. ప్రతి ఇంట్లోనూ వినాయకుడి ప్రతిమ ఉంటుంది.  నిత్యం పూజలందుకునే గణపయ్యకు మరింత ప్రత్యేకమైన రోజు వినాయకచవితి. 

బాల గణేషుడి జన్మదినమే వినాయక చవితి. ఈ రోజు ఊరూ వాడా పండుగే. చిన్నా పెద్దా అందరకీ సందడే. ప్రతి ఇంట్లోనూ విఘ్నాధిపతి కొలువుతీరుతాడు. మండపాల్లో కూర్చుని తొమ్మిది రోజుల పాటూ పూజలందుకుని ఎంత సందడిగా వచ్చాడో అంతకు మించిన సందడిగా గంగమ్మ ఒడికి తరలివెళతాడు.

మండపాల్లో గణేషుడిని ఏ దిశగా ప్రతిష్టించాలి? 

తొమ్మిది రోజుల పాటూ కొలువయ్యే వినాయకుడిని ఇంట్లో అయినా, మండపాల్లో అయినా ఏ దిశలో ఉంచాలి అనే సందేహాలున్నాయి. సాధారణంగా సాధారణంగా మండపంలోని గణేష్ విగ్రహం తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం ఉండేలా ఏర్పాటు చేస్తారు. ఈశాన్య దిశ వాస్తు శాస్త్రంలో పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఇది దైవిక శక్తులకు సంబంధించిన దిశ. విగ్రహం ముఖం ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండాలి. ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు. మండపాల్లో వినాయకుడిని పశ్చిమం, దక్షిణం దిశగా ఏర్పాటు చేయడం మంచిది కాదని చెబుతారు. గణేషుడిని ప్రతిష్టించే స్థలం ఎత్తైన పవిత్ర ప్రదేశంగా ఉండాలి. శుభ్రంగా ఉండాలి.. విగ్రహం వెనుక గోడ ఉండడం మంచిది. మండపాన్ని పూలు, దీపాలు, గంధం, ఇతర పూజా సామగ్రితో  అలంకరించడం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. సాధారణంగా వినాయక మండపం అంటే ప్రజలు భారీగా గుమిగూడే ప్రదేశం..అందుకే ఒక్కోసారి దొరికిన ప్రదేశాన్ని బట్టి కూడా మండప ముఖం ఏర్పాటు చేయాల్సి వస్తుంది
 
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి

దిశ

ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు, విగ్రహం ముఖం ఇంటి లోపలికి ఉండేలా చూసుకోవాలి. అంటే, తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం ఉండేలా ప్రతిష్టించాలి

తొండం

కుడి వైపు తొండం ఉండే విగ్రహం కన్నా ఎడమ వైపు తొండం ఉండే విగ్రహం మంచిదిగా భావిస్తారు

రంగు

తెలుపు లేదా సింధూరం రంగులో ఉండే విగ్రహాలు ఇంటికి శుభం అని వాస్తుశాస్త్రం చెబుతోంది..నలుపు రంగు విగ్రహాలు అస్సలు తెచ్చుకోవద్దు. మట్టి విగ్రహాలను పూజించడం శుభప్రదం

పూజ

వినాయక చవితి రోజున ముందుగా పసుపు గణపయ్యకి పూజలు చేసి..అనంతరం తీసుకొచ్చిన  విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా, విగ్రహానికి నూతన వస్త్రం వేసి అలంకారం చేస్తారు.

 విగ్రహం అపవిత్రమైన ప్రదేశాలకు దగ్గరగా ఉండకూడదు.

ఈ సూచనలు సాధారణ వాస్తు ,  సాంప్రదాయ నియమాలపై ఆధారపడి ఉంటాయి. ఇలాగే ఉండాలని లేదు. స్థానిక సంప్రదాయాలు, పండితుల సలహాలను బట్టి కొన్ని వ్యత్యాసాలు ఉండొచ్చు. మీరు వినాయకుడిని తీసుకొచ్చి ప్రతిష్టించే ముందు స్థానిక పండితులను ఓసారి సంప్రదించి సలహాలు స్వీకరించండి. మీరు అనుసరించే పద్ధతుల కన్నా మీ భక్తి ముఖ్యం అని గుర్తుంచుకోండి.

 

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

2026లో హరియాళి తీజ్, ఆగస్టు 15 సేల్స్: డబుల్ షాపింగ్ ధమాకా! వివాహిత మహిళలు ఏం కొనాలి?
2026లో హరియాళి తీజ్, ఆగస్టు 15 సేల్స్: డబుల్ షాపింగ్ ధమాకా! వివాహిత మహిళలు ఏం కొనాలి?
Shani Vakri 2026: శని వక్రగమనం - కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
శని వక్రగమనం: కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
నాగ పంచమి 2026: పెనం ముట్టుకుంటే రాహు దోషం, ఆర్థిక కష్టాలు!
నాగ పంచమి 2026: పెనం ముట్టుకుంటే రాహు దోషం, ఆర్థిక కష్టాలు!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget