అన్వేషించండి

Horoscope Today 09 November 2024: ఈ రాశులవారికి రహస్య శత్రువుల నుంచి ప్రమాదం పొంచిఉంది!

Dussehra Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today November 09, 2024

మేష రాశి

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. నిర్మాణ పనుల్లో పురోగతి ఉంటుంది. ఆఫీసులో అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. సమాజంలో మీ గౌరవం  పెరుగుతుంది. మీ పని పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు పెట్టుబడిదారుల నుంచి సహాయం తీసుకోవచ్చు

వృషభ రాశి

కార్యాలయంలో ఈ రోజు మార్పు ఉండవచ్చు. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. కొన్ని పనుల్లో ఎక్కువ ఖర్చులు ఉండవచ్చు.  మీ సలహాకు అందరూ చాలా ప్రాధాన్యత ఇస్తారు. భాగస్వామ్యంలో ఆర్థిక లాభం ఉంటుంది. 

మిథున రాశి

మీ ప్లాన్‌లలో కొన్ని ఈ రోజు లీక్ కావచ్చు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కడుపు నొప్పితో ఇబ్బంది పడతారు. పిల్లలకు సమయం కేటాయిస్తారు.  జీవిత భాగస్వామి సలహా నుంచి ప్రయోజనం పొందుతారు. మీరు ఏదైనా ముఖ్యమైన పనిని స్నేహితులతో చర్చించుకోవచ్చు.

Also Read: కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ - శివతాండవ స్తోత్రం ఎందుకంత పవర్ ఫుల్!

కార్కాటక రాశి

ఈ రోజు మీకు శుభదినం. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు ఉండవచ్చు. వివాహితులు సంతోషంగా ఉంటారు.  అవివాహితులకు పెళ్లి సంబంధం ఖరారవుతుంది. ఆస్తి లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు అనుకూలమైనది. వ్యాపార సమస్యలు పరిష్కారమవుతాయి.

సింహ రాశి

మీ జీవిత భాగస్వామి మాటలను విస్మరించవద్దు. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ రోజు మంచి రోజు. ఆఫీసు పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. రహస్య శత్రువులు మీకు హాని కలిగించవచ్చు. నిరంతర పని అలసట కలిగిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

కన్యా రాశి

ఈ రోజు పెట్టుబడికి అనుకూలమైన రోజు. భార్యాభర్తల మధ్య అనుబంధం బావుంటుంది. పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి ఓ ఫంక్షన్ కి హాజరవుతారు. మీరు సాంకేతిక పనిలో విజయం సాధిస్తారు. ఇతరులపై ఆధారపడకుండా మీ పని మీరే చేయండి.

Also Read: కార్తీకదీపం నీటిలో ఎందుకు వదలాలి - ఆంతర్యం ఏంటి!

తులా రాశి

ఈ  రోజు మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. నిర్మాణ సంబంధిత పనులకు ఈరోజు అనుకూలమైన రోజు. స్నేహితుడికి అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి వస్తుంది. పని పట్ల ఏకాగ్రత పాటించండి. సహోద్యోగితో గొడవలు రావచ్చు. తెలియని వ్యక్తుల నుంచి సలహా తీసుకోవద్దు. 

వృశ్చిక రాశి

మీరు ఈరోజు ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరు కావచ్చు. వాహనం చెడిపోవడంతో ఇబ్బందిపడతారు. అధిక పనికారణంగా అలసిపోతారు. పాత చేదు అనుభవాలు మళ్లీ ఎదురవుతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 

ధనస్సు రాశి

ఈ రోజు మీరు విద్యపై చాలా శ్రద్ధ వహిస్తారు. మీ పిల్లల ప్రవర్తన వల్ల మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. కుటుంబంలో సంతోషం  ఉంటుంది. యోగా , వ్యాయామంపై కాన్సట్రేషన్ చేయండి. సంపద పరంగా అదృష్టవంతులు అవుతారు. ఈరోజు మీకు కొన్ని పనులకు సంబంధించి చెడు అనుభవాలు  ఎదురవుతాయి.

మకర రాశి

ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. మీరు కొత్త పనిని ప్రారంభించడంలో విజయం సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా చేసే పని మీకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.

కుంభ రాశి

రియల్ ఎస్టేట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు సమయం చాలా శుభప్రదం. మీ మాటతీరును నియంత్రణలో ఉంచండి. పరుష పదాలు వాడవద్దు. పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. యువ ప్రేమికులు కుటుంబ అసంతృప్తిని ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన ఖర్చులు రావచ్చు. 

Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మీన రాశి

ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. మీ ప్రభావం ఇతరులపై ఉంటుంది. రొటీన్ కొద్దిగా అస్తవ్యస్తంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టొద్దు. అధ్యయనానికి సంబంధించిన పనుల్లో సక్సెస్ అవుతారు. ఆరోగ్యం బావుంటుంది.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayawada News: అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
Manchu Fight: కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
Jagan disqualification: అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్‌పై అనర్హతా వేటు - పులివెందులకు ఉపఎన్నికలు !
అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్‌పై అనర్హతా వేటు - పులివెందులకు ఉపఎన్నికలు !
Battula Prabhakar: రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TDP Won Hindupur Municipality | టీడీపీ కైవసమైన హిందూపూర్ మున్సిపాలిటీ | ABP DesamJC Prabhakar reddy vs Kethireddy peddareddy | తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం | ABP DesamTirupati Deputy Mayor Election | తిరుపతి పీఠం కోసం కూటమి, వైసీపీ బాహా బాహీ | ABP DesamPrabhas Look From Kannappa | కన్నప్ప సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada News: అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
Manchu Fight: కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
Jagan disqualification: అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్‌పై అనర్హతా వేటు - పులివెందులకు ఉపఎన్నికలు !
అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్‌పై అనర్హతా వేటు - పులివెందులకు ఉపఎన్నికలు !
Battula Prabhakar: రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
Next on Netflix: కీర్తి సురేష్ అక్క, ఆర్యన్ ఖాన్ డైరక్షన్, రానా నాయుడు ఎంట్రీ... కొత్త సిరీస్‌లతో దుమ్ము రేపనున్న నెట్‌ఫ్లిక్స్
కీర్తి సురేష్ అక్క, ఆర్యన్ ఖాన్ డైరక్షన్, రానా నాయుడు ఎంట్రీ... కొత్త సిరీస్‌లతో దుమ్ము రేపనున్న నెట్‌ఫ్లిక్స్
AP News: ఏపీ ప్రభుత్వానికిి అంబులెన్సులు అందించిన నటుడు సోనూసూద్ - అభినందించిన సీఎం చంద్రబాబు
ఏపీ ప్రభుత్వానికిి అంబులెన్సులు అందించిన నటుడు సోనూసూద్ - అభినందించిన సీఎం చంద్రబాబు
Hero Nikhil private videos: హీరో నిఖిల్‌కు షాక్ - ప్రైవేటు వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్‌మెయిల్‌ - పోలీసులకు పట్టించిన లావణ్య !
హీరో నిఖిల్‌కు షాక్ - ప్రైవేటు వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్‌మెయిల్‌ - పోలీసులకు పట్టించిన లావణ్య !
BPL Crisis: బీపీఎల్ లో సంక్షోభం.. జీతం ఇవ్వకపోవడంతో ప్లేయర్ల కిట్లను లాక్కున్న బస్ డ్రైవర్.. ఆటగాళ్ల బాయ్ కాట్..
బీపీఎల్ లో సంక్షోభం.. జీతం ఇవ్వకపోవడంతో ప్లేయర్ల కిట్లను లాక్కున్న బస్ డ్రైవర్.. ఆటగాళ్ల బాయ్ కాట్..
Embed widget