Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు (17/03/2024) - మీ కెరీర్లో చాలా పెద్ద మార్పు వస్తుంది!
Horoscope Tomorrow's Prediction 17 March 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....
Daily Horoscope for March 17th 2024 Saturday in Telugu
మేష రాశి
వస్తు సౌఖ్యం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు లాభిస్తాయి. పర్యటనలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనవసర ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. ( ఉగాది 2024 - 2025 క్రోధి నామ సంవత్సరం మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
వృషభ రాశి
రోజంతా సంతోషంగా ఉంటారు. పెద్దల సలహాలు తీసుకున్న తర్వాతే ఏదైనా పనిచేస్తే అది సక్సెస్ ఫుల్ గా పూర్తవుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. ఆస్తిలో పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి సమయం. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.కొన్ని సమస్యలు ఎదురవుతాయి ధైర్యంగా ఉండాలి.. (ఉగాది 2024 - 2025 క్రోధి నామ సంవత్సరం వృషభ రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
మిథున రాశి
ఈ రోజు కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు మంచిది. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి. మీ సామర్థ్యాలపై విశ్వాసం కలిగి ఉండండి. వైద్య రంగాలకు సంబంధించిన వ్యక్తులు మంచి ప్రయోజనాలను పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు..మీ దూకుడు ప్రవర్తన మీకు చెడు చేస్తుందని గుర్తించాలి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. (ఉగాది 2024 - 2025 క్రోధి నామ సంవత్సరం మిథున రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కర్కాటక రాశి
వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. మీ మనస్సులో కొంత ఆందోళన ఉంటుంది. ఆరోగ్యం, ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. (ఉగాది 2024 - 2025 క్రోధి నామ సంవత్సరం కర్కాటక రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
సింహ రాశి
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకునే ఇంప్లిమెంట్ చేయాలి. మీరు జీవితంలోని ప్రతి అంశంలో విజయం సాధిస్తారు. మీ పని సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.
కన్యా రాశి
ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు మంచి ప్రయోజనాలు పొందుతారు. తల్లిదండ్రుల ఆశీర్వచనం మీపై ఉంటుంది. చేపట్టిన ప్రాజెక్టులు సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. ఫ్యూచర్ కోసం కొత్త ప్రణాలికలు వేసుకోవచ్చు. మీ కెరీర్లో చాలా పెద్ద సానుకూల మార్పులు ఉంటాయి. కార్యాలయంలో కష్టపడి, అంకితభావంతో చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. ప్రత్యర్థులు కార్యాలయంలో చురుకుగా ఉంటారు...ఫలితంగా వివాదాలు పెరిగే అవకాశం ఉంది.
Also Read: ఈ 3 రాశుల రాజకీయ నాయకులు ఎంత ఖర్చుచేసినా ఓటమి తప్పదు!
తులా రాశి
మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. జీవితంలో కొత్త సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకుంటారు. ఈరోజు తొందరపడి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. ఈరోజు పిల్లల ఆరోగ్యం గురించి మనస్సు ఆందోళన చెందుతుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ పనిని సీరియస్‌గా తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఏదో విషయం మీకు చెడుగా అనిపించవచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవలు రావచ్చు. సామాజిక హోదా పెరుగుతుంది. ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి.
Also Read: రానున్న ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయ నాయకులు ధనం నష్టపోయినా గెలుపు పక్కా!
ధనుస్సు రాశి
రచనతో సంబంధం ఉన్న వ్యక్తులు గొప్ప ప్రయోజనాలను పొందుతారు. స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ సహోద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రతికూలతకు దూరంగా ఉండండి. మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు వస్తాయి. విద్యార్ధులు పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు
మకర రాశి
ఈ రోజు మీకు శుభదినం. రోజంతా ఆనందంగా ఉంటుంది. ఏదైనా పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. మీరు మీ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. అవివాహితులకు సంబంధం కుదిరే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకుంటారు. వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
కుంభ రాశి
మీరు స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత పదవులు పొందుతారు. మతపరమైన కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యుల సూచనలతో పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీ పనిపై దృష్టి పెట్టండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. కుటుంబానికి సమయం కేటాయించాలి.
మీన రాశి
ఈ రోజు మీకు ప్రతికూలంగా ప్రారంభమవుతుంది. ఓర్పు, సంయమనంతో పని చేయాలి. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో వృద్ధికి కొత్త అవకాశాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈ రోజు మీరు మీ కెరీర్‌కు సంబంధించి చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి.
మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.