అన్వేషించండి

సెప్టెంబరు 18 రాశిఫలాలు - ఈ రాశులవారు కాస్త దూకుడు తగ్గించండి లేదంటే ఇబ్బందులు తప్పవు!

Horoscope Prediction 18 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 18 September 2024

మేష రాశి

ఈ రోజు మీరు నమ్మిన వ్యక్తులు మీకు ద్రోహం చేయవచ్చు. ఆకస్మిక ఉద్యోగ మార్పు వల్ల మీరు ఇబ్బంది పడతారు. చిన్న విషయాలకు కూడా దూకుడుగా ఉండకండి. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన విషయాలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.  

వృషభ రాశి

 పనులన్నీ సకాలంలో పూర్తిచేస్తారు. మిత్రులతో సంబంధాలు ప్రభావితం కావచ్చు. ప్రేమ సంబంధాలకు కుటుంబం నుంచి ఆమోదం లభిస్తుంది. పాత వ్యాధి నుంచి ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. మీ ఆహారాన్ని చాలా సమతుల్యంగా ఉంచండి.
 
మిథున రాశి

ఈ రోజు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం బలహీనంగా అనిపిస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.  ప్రణాళికలను అమలు చేయడం సులభం అవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.

Also Read: సెప్టెంబర్ 18న పితృ పక్షం ప్రారంభం .. కర్ణుడు స్వర్గం నుంచి భూమ్మీదకు వచ్చిన ఈ 15 రోజులు ఎందుకంత ప్రత్యేకం!

కర్కాటక రాశి 

ఈ రాశి విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో చర్చించడం ద్వారా పరిష్కారం అవుతాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చులు అదుపు చేయడం మంచిది. చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. పెద్దల ప్రవర్తన కారణంగా బాధపడతారు.  

సింహ రాశి

చేపట్టిన కొన్ని ముఖ్యమైన పనులు ఈ రోజు ఆగిపోవాల్సి రావొచ్చు. మీ ప్రియమైన వారితో సమయం స్పెండ్ చేయడం మంచిది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం కాదు. విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. 

కన్యా రాశి

ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి స్థాయి మద్దతు పొందుతారు.  షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను పొందుతారు. మీ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. వివాదాస్పద విషయాలు పరిష్కారం అవుతాయి. 
 
తులా రాశి

మీ చుట్టూ ఉండేవారు మీ తెలివితేటలు ఉపయోగించుకుని ఎదిగేందుకు ప్రయత్నిస్తారు. మీ ప్రణాళికలు ఎవరితోనూ పంచుకోవద్దు.. వ్యక్తిగత జీవితంలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించవద్దు. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగజీవితంలో ఆకస్మికంగా మార్పులొస్తాయి.  

వృశ్చిక రాశి

ప్రతికూల అలవాట్లను వదులుకోవడానికి ప్రయత్నించండి. మీ శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయొద్దు. వ్యాపారానికి సంబంధించి ఒత్తిడి ఉండవచ్చు. ప్రేమ సంబంధాల విషయంలో కాస్త సీరియస్‌గా ఉండండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి.   

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, దసరా నవరాత్రులు సందర్భంగా ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే!

ధనుస్సు రాశి

ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొంతమంది మిమ్మల్ని మానసికంగా డిస్ట్రబ్ చేస్తారు. ఆర్థిక లాభం కోసం నూతన అవకాశాలుంటాయి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. 

మకర రాశి

ఈ రాశివారికి ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. అనుకోని అతిథులు ఇంటికి రావొచ్చు. ఆరోగ్యం బావుంటుంది. రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. 

కుంభ రాశి

అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు పెద్ద అవకాశాలను పొందుతారు. కార్యాలయంలో సహోద్యోగులతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయం వారికి తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంది. 
 
మీన రాశి

పాత స్నేహితులను కలుస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ప్రస్తుతానికి ప్రస్తుత పనులపై మాత్రమే దృష్టి పెట్టండి. నూతన పెట్టుబడులు పట్టేందుకు ఇదే మంచి సమయం. మీ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Thiruppavi pasuralu: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
ధనుర్మాసం స్పెషల్: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
Embed widget