చాణక్య నీతి: లైఫ్ లో సక్సెస్ అవ్వాలని ఉంటే ఇవి ఫాలో అవండి!
జీవితంలో ఎప్పుడూ విజయమే సాధించాలి ఎక్కడా అపజయం ఉండకూడదు అని అందరూ భావిస్తారు...ఆ దిశగానే అడుగుల వేసేందుకు ప్రయత్నిస్తారు
మీ జీవితంలో జయాపజయాలు రెండూ మీ ఆలోచనా విధానం, మీరు ఎంచుకునే మార్గాలు, మీ చుట్టూ ఉండే వ్యక్తులపై కూడా ఆధారపడి ఉంటుందని బోధించాడు ఆచార్య చాణక్యుడు
ఎప్పుడూ విజయమే దక్కాలి అనుకుంటే మాత్రం కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే మీరు వెళ్లే మార్గంలో అడ్డంకులు ఎదురుకావు
మీ ముందు అభిమానాన్ని చూపించి మీ వెనుక సమస్యలు సృష్టించేవారిని గుర్తించి వారికి దూరంగా ఉండండి
ఎవ్వరినీ అతిగా నమ్మేయవద్దు..ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వారి నుంచి వచ్చే ఇబ్బందులు మీరు ఊహించలేరు
తమ పని మాత్రమే పూర్తిచేసుకుని మీకు అవసరం అయిన ప్రతిసారీ ముఖం చాటేసేవారిని వదిలించుకోవడం మీకే మంచిది
మీ చుట్టూ ఎవరు ఎలా ఉన్నారన్నది కాదు..మీరు నిజాయితీగా ఉండండి..ఆలోచనలో స్పష్టత ఉండేలా చూసుకోండి
సోమరితనం వీడండి..కష్టపడి పనిచేసేందుకు ప్రయత్నించండి..అలాంటప్పుడు విజయం కాస్త ఆలస్యం కావొచ్చు కానీ రావడం ఖాయం
మీరు పనిచేసే రంగంలో నిపుణుల సలహాలు కూడా తీసుకుని అడుగు ముందుకువేస్తే మీరు అపజయం అనేదే ఉండదు..