సెప్టెంబరు 14 రాశిఫలాలు - ఈ రాశులవారు ఈ రోజు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది!
Horoscope Prediction 14 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for 14 September 2024
మేష రాశి
ఈ రోజు మీరు ఆలోచనల్లో కూరుకుపోయి ఉంటారు. మీ ప్రతిభ, సామర్థ్యాం వృధా కాకుండా అర్థవంతంగా ఉపయోగించుకోండి. మీ భావాలను చిన్నబుచ్చేవారుంటారు..ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ఆదాయం బాగానే ఉంటుంది.
వృషభ రాశి
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పని విషయం మీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించండి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
మిథున రాశి
అనవసర వివాదాలు, వాగ్వాదాలకు దూరంగా ఉండడం మంచిది. మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడతారు. తొందరపాటులో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని మాత్రమే ఖర్చు చేయండి.
Also Read: అజాన్..నమాజ్ సమయంలో దుర్గాపూజ ఆపేయండి!
కర్కాటక రాశి
మీ ప్రవర్తనపై మీ జీవిత భాగస్వామి కోపంగా ఉంటారు.. వైవాహిక బంధంలో ఒత్తిడులు తొలగిపోతాయి. పిల్లల పట్ల మంచి ప్రవర్తన కొనసాగించండి. కష్టపడితేనే ఫలితం అందుకుంటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి కానీ సమయానికి డబ్బు చేతికందుతుంది.
సింహ రాశి
ఈ రాశివారు ఈ రోజు ఆచరణాత్మకంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఇంట్లో టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త వహించండి. మీ ప్రత్యర్థులను కలవాల్సి వస్తుంది. వ్యాపారులు నూతన ప్రతిపాదనలు పొందుతారు.
కన్యా రాశి
చేపట్టిన పనుల్లో ఈ రోజు మీకు అడ్డంకులు తప్పవు. అభ్యంతకర వ్యాఖ్యలకు దూరంగా ఉండడం మంచిది. దగ్గరి బంధువులతో వివాదాలు జరిగే సూచనలున్నాయి. బంధం, బాధ్యతల విషయంలో సీరియస్ గా వ్యవహరించాలి..వినోదం కోసమే మాత్రమే సమయాన్ని కేటాయించవద్దు. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది.
తులా రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన సమావేశాలలో అజాగ్రత్తగా వ్యవహరించవద్దు. కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గవలసి రావచ్చు. ఆదాయం బాగానే ఉంటుంది..ఖర్చులు తగ్గించండి..
వృశ్చిక రాశి
ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగాలలో మంచి ఫలితాలు పొందుతారు. ప్రణాళిక ప్రకారం అన్ని పనులు పూర్తిచేస్తారు. మీ జీవిత భాగస్వామి అంచనాలు నెరవేరుస్తారు. వ్యాపారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నతాధికారులతో మీకు సమనయ్వం పెరుగుతుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశివారు చికాకుగా వ్యవహరిస్తారు. మరింత విసిగించే స్నేహితుల నుంచి దూరంగా ఉండడం మంచిది. కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చు. మీ మాటల్లో వినయం తగ్గనీయొద్దు. ప్రయాణ సమయంలో సరైన జాగ్రత్తలు అవసరం. న్యాయపరమైన విషయాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.
మకర రాశి
స్నేహితుల మద్దతుతో మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు మీతో మొండిగా వ్యవహరించొద్దు. దాన, ధర్మాలు చేయాలనే ఆలోచనతో ఉంటారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఆదాయం పెరుగుతుంది.
కుంభ రాశి
ఈ రాశి ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు అనారోగ్య సూచనలున్నాయి. వ్యాపారులు నూతన ఒప్పందాలకు దూరంగా ఉండాలి. వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నవారి ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.
మీన రాశి
ఈ రాశివారు దూర ప్రాంత ప్రయాణాలకు దూరంగా ఉండండి. రోజు ఆరంభం కన్నా గడిచేకొద్దీ సంతోషం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. చాలా ముఖ్యమైన వ్యక్తులతో మీ పరిచయం బలపడుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. పెద్దల ఆశీస్సులు పొందుతారు.
Also Read: మలయాళీలకు స్వర్ణయుగం - రాక్షసరాజుకు ఘన స్వాగతం!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.