News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Weekly Rasi Phalalu 5th to 11th June : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Weekly Horoscope (05-11 June):  మేష రాశి నుంచి మీన రాశి వరకూ ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో చూద్దాం..

మేష రాశి

ఈ వారం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. వారం ప్రారంభంలో ఉద్యోగం,  వృత్తిలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్టు మీ కార్యాలయంలో సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. ఈ వారం ఆరోగ్యం బాగానే ఉంటుంది. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టాలి. ఈ వారం గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. 

వృషభ రాశి 

ఈ వారం ఈ రాశివారు తమమాటతీరును నియంత్రించుకోవాలి. స్నేహితుల సమస్యలను పరిష్కరిస్తారు. ప్రేమ సంబంధాలు బావుంటాయి. ఇష్టానికి వ్యతిరేకంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ వారం అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. 

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం పనిలో విజయం లభిస్తుంది. కుటుంబం, స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వారం చివర్లో శుభవార్త వింటారు. ఆహారం, దినచర్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని బాధ్యతలు నిర్వహించడంలో సక్సెస్ అవుతారు. కుటుంబానికి సంబంధించిన విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అనవసర ఒత్తిడికి లోనుకావొద్దు. 

కర్కాటక రాశి
ఈ వారం ప్రారంభంలో కుటుంబానికి సంబంధించిన విషయాల గురించి మనస్సు ఆందోళన చెందుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారులు కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.  ఆదాయం కన్నా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

Also Read: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

సింహ రాశి

ఈ రాశివారు ఈ వారం వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. డబ్బు సంపాదించేందుకు మంచి అవకాశాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. వివాహితుల జీవితంలో అపార్థాలు ఉండొచ్చు. వారం ద్వితీయార్థంలో కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

కన్యా రాశి

ఈ వారం ఈ రాశివారికి వ్యాపార రంగంలో పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆరోగ్యం జాగ్రత్త. ఈ నెలలో కుటుంబ జీవితం దెబ్బతింటుంది. ఇంట్లో ఏదో తెలియని గందరగోళం నెలకొంటుంది. అవివాహితులకు ఇంకొంత కాలం ఎదురుచూపులు తప్పవు. 

తులా రాశి
ఈ  వారం తులారాశివారికి కొన్ని ఒడిదొడుకులు తప్పవు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. తలపెట్టిన పనుల్లో కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లాలి అనుకున్న విద్యార్థుల అడుగులు ముందుకు పడతాయి. 

వృశ్చిక రాశి

ఈ వారంలో వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. కుటుంబ జీవితం బావుంటుంది. ఉద్యోగం చేసే ఈ రాశి మహిళలకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే మంచిదే. 

ధనుస్సు రాశి 

ధనుస్సు రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు పొందుతారు.ఈ  వారంలో మీరు విదేశాల్లో కొత్త ఉద్యోగావకాశాలు పొందుతారు. వ్యాపారం బాగా సాగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రేమికులు పెళ్లి దిశగా అడుగులు వేసేందుకు ఇదే మంచి సమయం. 

మకర రాశి

ఈ వారం మకర రాశి వారికి లాభాలతో పాటూ ఖర్చులు కూడా పెరుగుతాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఆర్థిక జీవితంలో ఏదైనా పెద్ద నిర్ణయం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ప్రేమ సంబంధాల్లో చిన్న చిన్న సమస్యలుంటాయి. ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు, వ్యాపారులు పనిపై శ్రద్ధ పెట్టడం మంచిది.

కుంభ రాశి

ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు..సంయమనం పాటించడం మంచిది. ఆరోగ్య పరంగా ఈ వారం మీకు కొన్ని ఒడిదొడుకులు ఉండొచ్చు. వ్యాపారంలో లాభాలు రావాలంటే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.

మీన రాశి

ఈ రాశివారికి కెరీర్ పరంగా ఇది క్లిష్టమైన సమయం. ఈ సమయంలో ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబంలో సంతోషం తగ్గుతుంది. వ్యాపారంపై మరింత శ్రద్ధ పెట్టాలి. వైవాహిక జీవితంలో మరో మలుపు ఉండొచ్చు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. 

Published at : 04 Jun 2023 05:32 AM (IST) Tags: Weekly Horoscope Astrology predictions Horoscope Today Saptahik Rashifal june 05 to 11 weekly predictions

ఇవి కూడా చూడండి

Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు

Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు

Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం

Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు

Horoscope Today September 23: ఈ రాశివారు మాటల్లో నియంత్రణ పాటించడం మంచిది,సెప్టెంబరు 23 రాశిఫలాలు

Horoscope Today September 23:  ఈ రాశివారు మాటల్లో నియంత్రణ పాటించడం మంచిది,సెప్టెంబరు 23 రాశిఫలాలు

Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

టాప్ స్టోరీస్

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Leaders For Chandrababu :  చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు