Guru Gochar 2025 : కొత్త ఏడాదిలో మిథునంలోకి గురుడు.. ఈ రాశులవారి జీవితంలో అన్నీ ఆహా అనిపించే రోజులే ఇక!
Astrology Predictions 2025: ఏడాది మొత్తం ఒకే రాశిలో సంచరించే బృహస్పతి..అదే రాశిలో వక్రంలో..సాధారణ స్థితిలో ఇలా మూడుసార్లు మారుతుంది. 2025 లో మిథునంలో అడుగుపెడుతున్నాడు గురుడు...
Jupiter Transit in Gemini 2025: ఏడాదిలో బృహస్పతి రాశి మార్పు మూడుసార్లు జరుగుతుంది.. 2024 ఏప్రిల్ నుంచి వృషభ రాశిలో సంచరించిన గురుడు... అక్టోబరు లో అదే రాశిలో వక్రంలో సంచరించి...తిరిగి 2025 ఫిబ్రవరిలో వక్రం పూర్తయి సాధారణ స్థితికివస్తాడు. ఆ తర్వాత 2025 మే నుంచి మిధున రాశిలో అడుగు పెడతాడు బృహస్పతి
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దేవగురు బృహస్పతి లేదా గురుడుని జ్ఞానానికి సంబంధించిన గ్రహంగా చెబుతారు. జాతకంలో ఎలాంటి దోషాలున్నా, మిగిలిన గ్రహాల అనుగ్రహం లేకున్నా గురు గ్రహం అనుగ్రహం ఉంటే విద్య, ఉద్యోగం, గౌరవం పరంగా తిరుగులేదంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. బృహస్పతి మంచి స్థానంలో సంచరిస్తే ఆ సమయంలో ఆయా రాశులవారికి తిరుగుండదు. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి, ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది... సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించే ధైర్యం మీ సొంతం అవుతుంది.
2025 కొత్త సంవత్సరంలో దేవగురు బృహస్పతి తన దిశను మూడుసార్లు మార్చుకుంటుంది. మొదట మే 14, 2025 న బృహస్పతి వృషభం నుంచి మిధునరాశిలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత 2025 అక్టోబరులో కర్కాటకరాశిలోకి పరివర్తనం చెందుతుంది. తిరిగి... 2025 డిసెంబరులో మిధున రాశిలోకి వస్తుంది. ఇలా బృహస్పతి మూడుసార్లు రాశిమార్పు ప్రభావం ఈ మూడు రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది.
Also Read: భారీగా పెరిగిన అయ్యప్ప ఆదాయం, వసతిపై కొత్త విధానం..శబరిమల భక్తులకు కీలక అప్ డేట్స్!
వృషభ రాశి
2025 కొత్త సంవత్సరంలో బృహస్పతి సంచారం వృషభ రాశి వారికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని మార్పులుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అవివాహితులకు వివాహం జరిగే సూచనలున్నాయి. వివాహితుల జీవితం సంతోషంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నా, నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా ఇదే మంచి సమయం. ధైర్యంగా ముందుకు అడుగువేయండి.
మిథున రాశి
మిథున రాశిలోకే బృహస్పతి సంచరిసంతాడు. ఫలితంగా గత కొన్నేళ్లుగా ఎదగుర్కొన్న వారికి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికందుతుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. నూతన మార్గాల నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది. పూర్వీకుల నుంచి డబ్బు అందుతుంది.
Also Read: శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
సింహ రాశి
బృహస్పతి సంచారం సింహ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక లాభం ఉంటుంది. అదృష్టవంతులు అవుతారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. ప్రారంభించిన పనులు, కొన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. గురువు మిథున రాశిలో సంచరిస్తున్న సమయంలో మీరు ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: కార్తీక మాసం ఎప్పటితో ఆఖరు .. పోలి స్వర్గం ఎప్పుడు - ఆ పేరెలా వచ్చింది!