Sabarimala Ayyappa 2024 : భారీగా పెరిగిన అయ్యప్ప ఆదాయం, వసతిపై కొత్త విధానం..శబరిమల భక్తులకు కీలక అప్ డేట్స్!
మండల మకరు విళక్కు సీజన్ ఆరంభం నుంచి అయ్యప్ప దర్శనంకోసం భక్తులు పోటెత్తుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శబరిమల వెళ్లి రావాలంటే ముందుగా ఈ కీలక అప్ డేట్స్ తెలుసుకోవాలి..
Sabarimala: మండల మకరు విళక్కు సీజన్ ఆరంభం నుంచి అయ్యప్ప దర్శనంకోసం భక్తులు పోటెత్తుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శబరిమల వెళ్లి రావాలంటే ముందుగా ఈ కీలక అప్ డేట్స్ తెలుసుకోవాలి..
నవంబరు 16 నుంచి కేరళ అయ్యప్ప స్వామి ఆలయంలో మండల మకరు విళక్కు సీజన్ మొదలైంది. ఆలయం తలపులు తెరుచుకున్న క్షణం నుంచి భక్తులు పోటెత్తారు. స్వామియే శరణం అయ్యప్ప అనే శరణు ఘోషతో శబరిగిరులు మారుమోగిపోతున్నాయి
ఆరంభంలోనే రద్దీ అనుకుంటే..రాను రాను భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. ఈ ఏడాది భక్తుల సంఖ్య గతేడాది కన్నా రెట్టింపు ఉందని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డ్ స్పష్టం చేసింది. మండల మకరు విళక్కు సీజన్ మొదటి 9 రోజుల్లోనే దాదాపు ఆరు లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు చెప్పారు. గతేడాది ఇదే మొదటి 9 రోజుల్లో కేవలం మూడు లక్షల 3 వేల 501 మంది భక్తులు దర్శించుకున్నారు. అంటే 2023 తో పోలిస్తే 2024లో భక్తుల సంఖ్య డబుల్ అయింది. గతేడాది జరిగిన పొరపాట్లు ఈ ఏడాది జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. పదునెట్టాంబడిపై గతంలో నిముషానికి 60 మందిని అనుమతిస్తే ఈ ఏడాది నిముషానికి 80 మంది ఎక్కగలుగుతున్నారు.
Also Read: శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
భక్తుల రద్దీ డబుల్ అయినట్టే అయ్యప్ప ఆదాయం కూడా భారీగా పెరిగిందని దేవస్థాం బోర్డు ఛైర్మన్ ప్రకటించారు. 2023 ఈ సీజన్లో రూ.28.38 కోట్లు ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.41.64 కోట్లు సమకూరింది. అంటే గతేడాది కన్నా దాదాపు పదమూడున్నర కోట్లు అధికం. ప్రసాదాల ద్వారా వచ్చిన ఆదాయం 20 కోట్లు ఉంది. సాధారణంగా శబరిమల ప్రసాదం అనగానే అరవణ పాయసమే తీసుకుంటారు... దాని ద్వారా రూ.17.71 కోట్లు, అప్పం ద్వారా రూ.2.21 కోట్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు.
శబరిమల చేరుకున్న తర్వాత రూమ్స్ కోసం తిరగకుండా ముందుగా ఆన్ లైన్లో బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. కేవలం ట్రావెన్ కోర్ అధికారిక వెబ్ సైట్ ( www.onlinetdb.com )లో మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే లాగిన్ అయినవారు లాగిన్ అయి..లేని వారు కొత్తగా రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయి బుక్ చేసుకోవచ్చు. అందులో ఇచ్చిన పూర్తివివరాలు పరిశీలించి రూమ్ బుక్ చేసుకోవాలి. ఎంత మంది , ఎన్ని రూమ్స్ అనే విషయాలు వివరంగా పేర్కొనాలి. అక్కడకు చేరుకున్న తర్వాత కూడా మీ ఐడీ ప్రూఫ్ , ఫొటో చూపించి మరోసారి కన్ఫామ్ చేసుకోవాలి. ఆన్ లైన్లో బుక్ చేసే టైమ్ లో పోస్ట్ చేసిన నంబర్ కన్నా ఎక్కువ మంది వెళ్లినట్టైతే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!
భక్తుల రద్దీ ఎలా ఉన్నా కానీ అందరూ స్వామి దర్శనం చేసుకునే తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.గతేడాది చాలామంది భక్తులు స్వామి సన్నిధి వరకూ వెళ్లి దర్శనభాగ్యం దొరక్క తిరిగి వచ్చారు. అందుకే ఈ ఏడాది ముందస్తు ఏర్పాట్లు, జాగ్రత్తల ద్వారా ఈ ఏడాది భక్తులంతా అయ్యప్పను కళ్లారా చూసే వెళ్లేలా స్పాట్ బుకింగ్ టిక్కెట్లు కోసం ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేశారు. వండిపెరియార్ సత్రం, ఎరుమేలి, పంబా ఈ మూడు ప్రదేశాలలో ఆన్ లైన్ బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Also Read: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది అయ్యప్ప దర్శనం మరింత వేగంగా!