Predictions 2026 Donald Trump: భారత్ పై ట్రంప్ తీవ్ర ప్రభావం, అమెరికాలో అలజడి ! అగ్రరాజ్యం భవిష్యత్తుపై జ్యోతిష్యుల సంచలన అంచనాలు!
Predictions 2026 Donald Trump: ABP ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడిన జ్యోతిష్య శాస్త్ర నిపుణులు Y రాఖీ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఆయనకే నష్టం కలిగిస్తాయని చెప్పారు..ఇంకా ఏమన్నారంటే..

Astrology Predictions 2026 Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు, నిర్ణయాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలు విమర్శలకు గురయ్యాయి, ఇందులో భారత్‌పై 50 శాతం పన్ను విధించడం కూడా ఒకటి. అలాగే వీసాపై కూడా ఎన్నో వివాదాలు ఉన్నాయి. కొత్త సంవత్సరం 2026లో కూడా ట్రంప్ విధానాలపై ప్రపంచం దృష్టి సారిస్తుందనడంలో సందేహం లేదు.
2026లో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ట్రంప్ తీసుకునే నిర్ణయాలు దేశం, ప్రపంచం, ముఖ్యంగా భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, అనే అంశంపై ABP ప్రత్యేక కార్యక్రమంలో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు Y రాఖీ కొత్త సంవత్సరం 2026 ట్రంప్‌కు ఎలా ఉండబోతుందో వివరించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ జ్యోతిష్యులు కూడా పాల్గొన్నారు. 2026 సంవత్సరానికి ట్రంప్ గురించి జ్యోతిష్యుల అంచనాలు ఏంటో తెలుసుకుందాం.
ట్రంప్ తీసుకునే నిర్ణయాలే ఆయనకు భారంగా మారవచ్చు
ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ జన్మించింది 1946 జూన్ 14. ఈ సమచారం ప్రకారం అయితే ట్రంప్ ది సింహ లగ్నం, వృషభ రాశి. వృషభ రాశివారికి అద్భుతమైన టైమ్ నడుస్తుండడం వల్ల ట్రంప్ మళ్లీ అధికారంలోకి రాగలిగారు. అయితే వృషభం కుజుడి రాశి..దీని రెండో ఇంట్లో కేతువు ఉన్నాడు. అందుకే ట్రంప్ మాట్లాడే ముందు తాను ఏమంటున్నాడో, దాని ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించరు. దూకుడుగా మాట్లాడేస్తారు.
ట్రంప్ నిర్ణయాలు భారతదేశానికి ప్రమాదకరం
2026 సంవత్సరంలో.. సంఖ్యాశాస్త్రం ప్రకారం అయితే ట్రంప్ ప్రస్తుతం యూటర్న్ తీసుకునే మూడ్‌లో కనిపించడం లేదు. అలాగని ఏడాది మొత్తం ఇలానే ఉండిపోతారని స్పష్టంగా చెప్పలేం. 2026లో భారత్ ని, ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టే మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది
2026 ట్రంప్ టెన్షన్‌ను పెంచుతుంది
2026లో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇతర దేశాలనే కాదు..అమెరికాను కూడా ఇబ్బందిపెడతాయి. అమెరికా వాతావరణం, స్టాక్ మార్కెట్, వాతావరణ వివాదం, ఉద్యోగాల మాంద్యం, రోడ్లపై ప్రజలు నిరసనలు తెలపడం, ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ట్రంప్ జాతకం ప్రకారం ప్రస్తుతం గురు దశ నడుస్తోంది. బృహస్పతి తిరోగమన దశ సమయంలో ట్రంప్ ఆవేశం, ఆగ్రహం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రభావం చూపించే మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రస్తుతానికి అమెరికన్లకు, ఇతర దేశాలవారికి ఇబ్బంది కలిగించినా..భవిష్యత్ లో ట్రంప్ కే నష్టం చేకూర్చనున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
రాజకీయ ప్రకంపనలు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ సూచనలు ! 2026 అల్లకల్లోలమేనా?
రాహు శుక్ర షడాష్టక యోగం 'లివ్-ఇన్ రిలేషన్షిప్'కు దారితీస్తుందా?





















