Daily Horoscope Today 23rd November 2022: ఈ రాశివారికి అన్నీ కలిసొస్తున్నట్టే ఉంటుంది కానీ జాగ్రత్తగా ఉండాలి, నవంబరు 23 రాశిఫలాలు
Horoscope Today 23rd November 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
23rd November 2022 Daily Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మీరు ఏ పని చేపట్టినా మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన డీల్ కోసం వెయిట్ చేయాల్సి రావొచ్చు. ఈ రోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి వస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీ కీర్తి పెరుగుతుంది. కుటుంబంలోనూ ప్రత్యేకమైన గౌరవాన్ని పొందుతారు. మీ మనస్సంతా సంతోషంగా ఉంటుంది.
వృషభ రాశి
ఈ రోజు మీకు మెరుగైన ఫలితాలున్నాయి. వ్యాపార స్థలాన్ని మార్చాలి అనుకుంటే ఇదే మీకు సరైన సమయం..లాభదాయక అవకాశం. కొంతకాలంగా కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారాలను పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. చిన్న పిల్లల నుంచి మీకు కొన్ని అభ్యర్థనలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలసి టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
మిథున రాశి
ఈ రోజు మీకు చాలా సృజనాత్మకంగా ఉంటుంది. కొన్ని కొత్త వ్యాపార ప్రణాళికలు మీ మనస్సులో వస్తాయి. వాటిని మీరు భాగస్వామితో పంచుకుంటారు...ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. విద్యార్థులు సీనియర్ల సహకారంతో సమస్యలు పరిష్కరించుకుంటారు
కర్కాటక రాశి
ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పరిష్కరించుకోవడానికి మీరు మీ సోదరుడితో చర్చించవచ్చు. ఉద్యోగంలో చేపట్టిన పనిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. కుటుంబంతో కలసి ఓశుభకార్యంలో పాల్గొంటారు. కార్యాలయంలో మీ ఆలోచనలు చెప్పి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు.
Also Read: నవంబరు 29 సుబ్రహ్మణ్య షష్టి - వివాహం సంతానం సమస్యలు , కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు ఇలా చేయండి
సింహ రాశి
ఈ రోజంతా మీరు చాలా బిజీగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాల కోసం కొంత సమయం వెచ్చిస్తారు. సమస్యాత్మక వ్యక్తికి సహాయం చేసేందుకు మీరు ప్రయత్నిస్తారు కానీ...అందులోనూ మీకు స్వార్థం ఉందనే నింద పడాల్సి వస్తుంది. కార్యాలయంలో మీ పనికి కొనని అడ్డంకులు ఉంటాయి. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి.
కన్యా రాశి
ఈ రోజు అదృష్టం మీకు ప్రతి విషయంలోనూ సహకరిస్తున్నట్లు అనిపిస్తుంది. చేసే పనిని ఆలోచనాత్మకంగా చేయాలి. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండకండి. మీ చుట్టూ ఏదైనా చర్చ జరిగితే దానికి మీరు దూరంగా ఉండడం మంచిది..లేదంటే సమస్యలో ఇరుక్కుంటారు. చేసే పనిని ఆత్మవిశ్వాసంతో చేయండి..అప్పుడే విజయం సాధిస్తారు.
తులా రాశి
ఈ రోజు మీకు శుభ ఫలితాలు వస్తాయి. కొత్త ప్రాజెక్ట్‌లో పని చేయాలని ఆలోచిస్తే అది కచ్చితంగా పూర్తవుతుంది. భూమి ఆస్తికి సంబంధించిన ఏదైనా కుటుంబ సమస్య కోర్టులో నడుస్తున్నట్లయితే అది ఓ కొలిక్కి వస్తుంది. ఈ రోజు ఇంట్లో ఆనందం ఉంటుంది. మీకు స్నేహితుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో ఏదైనా వివాదం రేగితే అదికూడా ఈ రోజు పరిష్కారం అవుతుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులందరితో కలిసి పార్టీని ఎంజాయ్ చేస్తారు. కుటుంబంలో అవివాహితులు ఎవరైనా ఉంటే వారికి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో ఏమైనా గొడవలు జరిగితే వాటికి ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారు
ధనుస్సు రాశి
ఈ రోజు మీ కీర్తి మరింత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఏదైనా చేసే ముందు తప్పనిసరిగా తండ్రి సలహాలు తీసుకోవాలి లేదంటే సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉపాది ప్రయత్నాలు కొన్ని సక్సెస్ అవుతాయి...కానీ వాటిని మీరు సరిగ్గా గుర్తించగలగాలి. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడతారు.
Also Read: నవంబరు 24 నుంచి మార్గశిరమాసం ప్రారంభం, ఆధ్యాత్మికంగా ఈ నెల చాలా ప్రత్యేకం
మకర రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో ఎవరైనా పెళ్లిచేసుకునే వివాహానికి అర్హులైతే , ఈ రోజు వారి వివాహానికి సంబంధించి ప్రతిపాదనలు రావచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి
ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వేరేవారికి సంబంధించిన నిర్ణయం ఏదైనా తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రోజు మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి, ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. జీవిత భాగస్వామితో ఏదైనా అడ్డంకి ఏర్పడి ఉంటే అది ఈరోజుతో ముగుస్తుంది. తీర్థయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు
మీన రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. మీ ఇంటికి అతిథి రావొచ్చు... అనుకోని ఖర్చులుంటాయి. వ్యాపారంలో ఏదైనా రిస్క్ తీసుకోవలసి వస్తే తీసుకోండి..దానివల్ల మంచి ఫలితమే ఉంటుంది. సున్నితమైన ప్రవర్తనతో సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా కొత్త పని చేస్తే అందులో విజయం సాధిస్తారు. సోదరులతో మంచి సంబంధాలుంటాయి