By: ABP Desam | Updated at : 08 Jan 2023 01:28 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలో రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో భేటీ అవ్వడంపై అప్పుడే అధికార పార్టీ నేతలు కూడా సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయని.. అలా చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళారని ట్వీట్ చేశారు. డుడు బసవన్నలా తల ఊపడానికి వెళ్లారని ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత, దత్తపుత్రుడు జనసేన పవన్ కల్యాణ్ మధ్య ఉన్న ముసుగు మరోసారి తొలగిపోయిందని మంత్రి అంబటి రాంబాబు ఓ టీవీ ఛానెల్‌తో స్పందించారు. జనసేనను టీడీపీలో కలిపేయాలని.. చంద్రబాబు, పవన్ కలిసినా తమకు నష్టం లేదని అన్నారు. చంద్రబాబు దగ్గర పవన్ ఊడిగం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
సంక్రాంతి పండుగ మామూళ్ల కోసం దత్త తండ్రి వద్దకు దత్త పుత్రుడు వెళ్లారంటూ ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేస్తూ.. పవన్ కల్యాణ్‌ను, చంద్రబాబును ట్విటర్‌లో ట్యాగ్ చేశారు.
సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయి చంద్రబాబు ఇంటికి పవన్‌కళ్యాణ్ వెళ్ళాడు డుడు బసవన్నలా తల ఊపడానికి ! @ncbn @PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) January 8, 2023
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. సంక్రాంతి ప్యాకేజీ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లారని ఎద్దేవా చేశారు. కందుకూరు, గుంటూరు ఘటనల్లో జనం చనిపోతే పరామర్శించలేదని అన్నారు. చంద్రబాబు ఇంటికి వెళ్లడం పవన్ కల్యాణ్ కు సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఎవరు కలిసినా వైఎస్ జగన్‌ను అంగుళం కూడా కదపలేరని అన్నారు.
ఎవరిని చెప్పుతో కొట్టాలో - ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశాయని అన్నారు. బాబు చెప్పినట్టు ఆడతాడు కాబట్టే పవన్ దత్తపుత్రుడు అయ్యాయని.. ఇప్పుడు చెప్పు తీసుకుని ఎవరిని కొట్టాలో పవన్ చెప్పాలని నిలదీశారు. ఈ భేటీతో వీరిద్దరి మధ్య ముసుగు తొలిగిపోయిందని అన్నారు. ఏపీని వదిలేసి పక్కరాష్ట్రంలో కూర్చుని జీవో నెంబర్-1పై చర్చించడమేంటని ప్రశ్నించారు. ప్యాకేజీకి లొంగిపోయాడు కాబట్టే చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడని.. వీళ్ల కలయిక వల్ల ఏపీకి ఒరిగేది ఏమీ లేదు అంటూ మాట్లాడారు.
13 మంది చనిపోతే పవన్ ఎందుకు పరామర్శించలేదు - ఎంపీ మార్గాని భరత్
టీడీపీ రోడ్ షోలలో రెండు వేర్వేరు ఘటనల్లో 13 మంది చనిపోతే పవన్ కల్యాణ్ పరామర్శించేందుకు వెళ్లలేదని, అలాంటిది రాజకీయాల కోసం పవన్ చంద్రబాబును కలిసేందుకు వెళ్లారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. వారి మధ్య ఉన్న ఒప్పందాలు రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. పవన్ కల్యాణ్ కొన్ని రోజులు ఇంట్లో ఉండి అప్పుడప్పుడూ రాజకీయాల్లో కనిపిస్తుంటారని ఎద్దేవా చేశారు. అధికారం పోగానే చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయారని, ఖాళీ సమయాల్లో పవన్ కల్యాణ్ కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారని భరత్ అన్నారు. వారిద్దరూ హైదరాబాద్ లో కలవడమే.. ఏపీ రాజకీయాల పట్ల వారికి శ్రద్ధ లేదని తెలుస్తోందని మాట్లాడారు.
కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ ఆదివారం (జనవరి 8) మధ్యాహ్నం వెళ్లారు. వీరిద్దరు భవిష్యత్తులో రాజకీయంగా కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే కోణంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ముందస్తు ఎన్నికల ఊహాగానాల వేళ రెండు పార్టీల పొత్తును ఇప్పుడే ప్రకటించాలా? లేదంటే కొంతకాలం వేచి ఉండాలా? అనేది మాట్లాడుతుకోనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, ప్రతిపక్ష సభలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం, ప్రతిపక్ష నేతలపై కేసులు, దాడులు వంటి అంశాలపై మాట్లాడుకోనున్నట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్-1పైన కూడా తాజా భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. వీరిద్దరూ కాసేపట్లో ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం ఉంది.
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Breaking News Telugu Live Updates: ఎమ్మెల్యే కోటంరెడ్డికి భద్రత తగ్గించిన ఏపీ సర్కార్
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Kotamreddy Security: కోటంరెడ్డికి ఏపీ సర్కార్ షాక్, సెక్యూరిటీ సగానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ
సెలవుపై వెళ్లిన దుర్గగుడి ఈవో - పోస్టింగ్ కోసం వైసీపీ నేతల మధ్య వార్ !
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?
TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్