అన్వేషించండి

YV Subba Reddy: 'వైసీపీ ఫైనల్ లిస్ట్ వచ్చేది అప్పుడే' - ఒంగోలు ఎంపీ స్థానంలో పోటీపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

Andhra News: వచ్చే ఎన్నికల్లో పోటీపై సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ అని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీపై క్లారిటీ ఇచ్చారు.

YV Subbar Reddy Comments on Ongole MP Seat: వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభకు తాను పోటీ చేయనని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి (YV SubbaReddy) స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఒంగోలులో (Ongole) పోటీ చేయాలనుకుంటే.. 2019 ఎన్నికల్లోనే పోటీ చేసే వాడినని.. ఈ విషయాన్ని సీఎం జగన్ కు చాలాసార్లు చెప్పానని తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాలకు గ్యాప్ రావడంతోనే పార్టీ పనులు చూసుకుంటున్నట్లు చెప్పిన ఆయన, ఎన్నికల పోటీ విషయంలో అంతిమంగా జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీల మార్పు విషయంలో అధినేత జగన్ క్లారిటీతోనే ఉన్నారని తెలిపారు. గెలిచే అవకాశాలు లేని అభ్యర్థులకు సీట్లు ఉండవని సీఎం ముందు నుంచి చెబుతూ వస్తున్నారని.. అందుకు అనుగుణంగానే 3 జాబితాలను విడుదల చేశామని అన్నారు.

వ్యక్తిగత కారణాలతోనే

సిట్టింగ్స్ కొత్త అభ్యర్థులతో అడ్జస్ట్ కావడానికి కొంత సమయం పడుతుందని.. సీనియర్లు వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. కొత్త మార్పులు, చేర్పులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ పండుగ తర్వాతే వస్తుందని స్పష్టం చేశారు. ఇక దేశంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన సీఎంగా జగన్ చరిత్ర సృష్టించారని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం వల్ల మీ కుటుంబాల్లో మేలు జరిగితేనే ఓట్లెయ్యాలని ప్రజలను కోరుతున్నామని అన్నారు. ఇక, షర్మిల కాంగ్రెస్ చేరడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని.. ఆమెను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసేదేమీ లేదని స్పష్టత ఇచ్చారు.

ఇప్పటికీ 3 జాబితాలు విడుదల

ఏపీలో రాబోయే ఎన్నికల్లో 'వై నాట్ 175' నినాదంతో దూసుకెళ్తున్న వైసీపీ అందుకు అనుగుణంగా పలు నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను మార్చింది. సామాజిక సమీకరణలు, సర్వేల ఆధారంగా పలువురు సిట్టింగులకు సైతం సీట్లు మార్పులు చేసింది. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన వారికి ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేలా ఆదేశాలిచ్చింది. పలువురు మంత్రులు సైతం ఈ జాబితాలో ఉన్నారు. తొలి జాబితాలో 11 నియోజకవర్గాలకు ఇంఛార్జీలను మార్చగా, రెండో జాబితాలో 27 మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. మూడో జాబితాలో 21 మందికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో నాలుగో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఫస్ట్ లిస్ట్ - గుంటూరు పశ్చిమ - విడదల రజని, మంగళగిరి - గంజి చిరంజీవి, ప్రత్తిపాడు - బాలసాని కిషోర్ కుమార్, కొండెపి - ఆదిమూలపు సురేష్, వేమూరు - వరికూటి అశోక్ బాబు, తాడికొండ - మేకతోటి సుచరిత, సంతనూతలపాడు - మేరుగు నాగార్జున, చిలకలూరిపేట - మల్లెల రాజేశ్ నాయుడు, అద్దంకి - పాణెం హనిమిరెడ్డి, రేపల్లె - ఈవూరు గణేష్, గాజువాక - వరికూటి రామచంద్రరావు.

రెండు జాబితా - అనంతపురం ఎంపీ - మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంపీ - జోలదరాశి శాంత, అరకు ఎంపీ (ఎస్టీ) - కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, రాజాం (ఎస్సీ) - డాక్టర్ తాలె రాజేష్, అనకాపల్లి - మలసాల భరత్ కుమార్, పాయకరావు పేట (ఎస్సీ) - కంబాల జోగులు, రామచంద్రాపురం - పిల్లి సూర్యప్రకాష్, పి.గన్నవరం (ఎస్సీ) - విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం - వంగ గీత, జగ్గంపేట - తోట నరసింహం, ప్రత్తిపాడు - వరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీ - మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ - చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ, పోలవరం (ఎస్టీ) - తెల్లం రాజ్యలక్ష్మి, కదిరి - బీఎస్ మక్బూల్ అహ్మద్, ఎర్రగొండపాలెం (ఎస్సీ) - తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మిగనూరు - మాచాని వెంకటేష్, తిరుపతి - భూమన అభినయ రెడ్డి, గుంటూరు ఈస్ట్ - షేక్ నూరి ఫాతిమా, మచిలీపట్నం - పేర్ని క్రిష్ణమూర్తి (కిట్టూ), చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుకొండ - కేవీ ఉషశ్రీ చరణ్, కళ్యాణదుర్గం - తలారి రంగయ్య, అరకు (ఎస్టీ) - గొడ్డేటి మాధవి, పాడేరు (ఎస్టీ) - మత్స్యరాస విశ్వేశ్వర రాజు, విజయవాడ సెంట్రల్ - వెల్లంపల్లి శ్రీనివాస రావు, విజయవాడ వెస్ట్ - షేక్ ఆసిఫ్ 

మూడో జాబితా

ఎమ్మెల్యే అభ్యర్థులు 

  • ఇచ్ఛాపురం - పిరియా విజయ
  • టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
  • చింతలపూడి (ఎస్సీ) - కంభం విజయరాజు
  • రాయదుర్గం - మెట్టు గోవింద్ రెడ్డి
  • దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
  • పూతలపట్టు (ఎస్సీ) - మూతిరేవుల సునీల్ కుమార్
  • చిత్తూరు - విజయానంద రెడ్డి
  • మదనపల్లె - నిస్సార్ అహ్మద్
  • రాజంపేట - ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
  • ఆలూరు - బూసినే విరూపాక్షి
  • కోడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సతీష్
  • గూడూరు (ఎస్సీ) - మేరిగ మురళి
  • సత్యవేడు (ఎస్సీ) - మద్దిల గురుమూర్తి
  • పెనమలూరు - జోగి రమేశ్
  • పెడన - ఉప్పాల రాము

ఎంపీ అభ్యర్థులు వీరే

  • విశాఖపట్నం ఎంపీ - బొత్స ఝాన్సీ
  • విజయవాడ - కేశినేని నాని
  • శ్రీకాకుళం - పేరాడ తిలక్
  • కర్నూల్‌ ఎంపీ - గుమ్మనూరి జయరాం
  • తిరుపతి ఎంపీ - కోనేటి ఆదిమూలం
  • ఏలూరు - కారుమూరి సునీల్ కుమార్ యాదవ్

Also Read: Congress Target: షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం బిగ్ టార్గెట్ - కింగ్ మేకర్ అయ్యేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget