అన్వేషించండి

By Election Results : పరిషత్ ఉపఎన్నికల్లోనూ వైఎస్ఆర్‌సీపీ హవా..పుంజుకున్న టీడీపీ ! పూర్తి ఫలితాలు ఇవే

10 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అధికార పార్టీ హవా కనిపించింది. టీడీపీ కూడా పుంజుకుంది.


ఆంధ్రప్రదేశ్‌లో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువ‌డ్డాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అత్యధికం గెల్చుకుంది. అయితే టీడీపీ కూడా పుంజుకుంది. కొన్ని చోట్ల మెరుగైన ఫలితాలను సాధించింది. మొత్తం పది జడ్పీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు 7, తెలుగుదేశం పార్టీకి 3 దక్కాయి. 123 ఎంపీటీసీ స్థానాల్లో 83 వైఎస్ఆర్‌సీపీ, 32 తెలుగుదేశం, బీజేపీకి 6, ఇండిపెండెంట్లు నాలుగు చోట్ల విజయం సాధించారు. 

Also Read:  దర్యాప్తు అలా కాదు.. ఇలా చేయండి..! వివేకా హత్య కేసులో సీబీఐ డైరక్టర్‌కు అరెస్టయిన నిందితుడి లేఖ !

కృష్ణా జిల్లాలో మూడు జడ్పీటీసీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. విస్సన్నపేట,  జి.కొండూరు జడ్పీటీసీల్లో వైసీపీ విజయం సాధించింది. పెడన జడ్పీటీసీలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. కృష్ణా జిల్లాలో 8 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా వైఎస్ఆర్‌సీపీకి ఆరు, టీడీపీకి రెండు దక్కాయి. తూర్పుగోదావరి జిల్లాలో 11 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఐదు వైఎస్ఆర్‌సీపీ, నాలుగు టీడీపీ, ఒకటి సీపీఐ, మరొకటి సీపీఎం గెల్చకున్నాయి. అనంతపురం జిల్లాలో చిలముత్తూరు జెడ్పీటీసీని వైఎస్ఆర్‌సీపీ గెల్చుకుంది. విశాఖ జిల్లాలో ఆనందపురం జడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోరాడ వెంకట్రావు ఘన విజయం సాధించారు.  ప.గో జిల్లాలో14 ఎంపీటీసీలు, రెండు జడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి. 10 ఎంపీటీసీ స్థానాలు, పెనుగొండ జెడ్పీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. జనసేన-1,టీడీపీ-3 ఎంపీటీసీ స్థానాల గెలుచుకున్నాయి.  

Also Read: బీజేపీ మద్దతుతో అమరావతి రైతులకు నైతిక బలం .. పాదయాత్రలో పాల్గొననున్న ఏపీ నేతలు !

కర్నూలు జిల్లా నంద్యాల జడ్పీటీసీ  స్థానాన్ని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోపవరం గోకుల్ కృష్ణ రెడ్డి గెలిచారు. విజయనగరం జిల్లాలో మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా వైఎస్ఆర్‌సీపీ 6, టీడీపీ 2, బీజేపీ 1 స్థానంలో గెలిచాయి. శ్రీకాకుళం జిల్లాలో 15 ఎంపీటీసీ స్థానాలు జరగగాని వైఎస్ఆర్‌సీపీ పది, టీడీపీ ఐదు చోట్ల గెలిచాయి. చిత్తూరు జిల్లాలో 8 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీకి ఐదు.. టీడీపీకి మూడు  దక్కాయి.  నెల్లూరు జిల్లాలో 4 ఎంపీటీసీ స్థానాల్లో మూడు వైఎస్ఆర్‌సీపీకి ఒకటి టీడీపీకి దక్కాయి.  కడప , కర్నూరు జిల్లాల్లో జరిగిన అన్ని ఎంపీటీసీల్లో అధికార పార్టీ గెలిచింది. గుంటూరు జిల్లాలో 11 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైఎస్ఆర్‌సీపీకి 9, టీడీపీకి రెండు లభించాయి. శావల్యాపురం జడ్పీటీసీని టీడీపీ గెల్చుకుంది.  అనంతపురం జిల్లాలో 16 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైఎస్ఆర్‌సీపీ పది, టీడీపీ ఆరు చోట్ల విజయం సాధించింది. 

Also Read:  మహిళా సాధికారతలో సువర్ణ అధ్యాయం.. చంద్రబాబుకు ఇప్పటికైనా బుద్ది రావాలన్న సీఎం జగన్ !

పలు చోట్ల హోరాహోరీ పోరు సాగింది. ఫలితాలు మరీ ఏకపక్షంగా లేకపోవడం...నిర్బంధాల మధ్య అయినా టీడీపీ మెరుగైన సీట్లు సాధించడంతో ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. కడప, కర్నూలు వంటి జిల్లాల్లో మాత్రం ఒక్క ఎంపీటీసీ కూడా గెలవలేకపోయారు. 

Also Read : సంబరాలే కాదు సమీక్ష కూడా చేసుకోవాలి.. వైఎస్ఆర్‌సీపీకి సంకేతాలిస్తున్న ఫలితాలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan on Amaravati Legal Status: అసెంబ్లీలో అమరావతిపై తీర్మానం ఏపీ సర్కార్ డ్రామా.. మాస్టర్ ప్లాన్ ఎందుకు మార్చారు? జగన్ ప్రశ్నలు
YS Jagan on Amaravati Legal Status: అసెంబ్లీలో అమరావతిపై తీర్మానం ఏపీ సర్కార్ డ్రామా.. మాస్టర్ ప్లాన్ ఎందుకు మార్చారు? జగన్ ప్రశ్నలు
YSRCP Supports Amaravati Bill: అమరావతి బిల్లుకు వైసీపీ వ్యతిరేకం కాదు.. ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అమరావతి బిల్లుకు వైసీపీ వ్యతిరేకం కాదు.. ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
Property Rights: భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Cylinder Price Hike: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
Karimnagar Jeevan Reddy: బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
Rules From 1 April 2026: ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
Property Rights: భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
YSRCP Amaravathi: రాజధాని విషయంలో తేల్చుకోలేకపోతున్న వైఎస్ఆర్‌సీపీ - ఓ విధానం లేకుండా ప్రజలకేం చెబుతారు?
రాజధాని విషయంలో తేల్చుకోలేకపోతున్న వైఎస్ఆర్‌సీపీ - ఓ విధానం లేకుండా ప్రజలకేం చెబుతారు?
Ippasara Anirudh Reddy: ఇప్పసారా రాజకీయం - అనిరుధ్ రెడ్డి హెల్తీ ప్రచారం వెనుక అసలు వ్యూహమేంటి?
ఇప్పసారా రాజకీయం - అనిరుధ్ రెడ్డి హెల్తీ ప్రచారం వెనుక అసలు వ్యూహమేంటి?
Iran Target Tech Companies: ఇరాన్ హిట్ లిస్ట్‌లో టెక్‌ సంస్థలు! షేక్ అవుతున్న కార్పొరేట్ దిగ్గజాలు, అమెరికా! 
ఇరాన్ హిట్ లిస్ట్‌లో టెక్‌ సంస్థలు! షేక్ అవుతున్న కార్పొరేట్ దిగ్గజాలు, అమెరికా! 
Embed widget