YS Jagan Mohan Reddy: చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్
YS Jagan Wishing a speedy recovery for Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.
![YS Jagan Mohan Reddy: చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ YS Jagan Mohan Reddy Wishing a speedy recovery for Chandrababu Naidu From Covid YS Jagan Mohan Reddy: చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/18/f30958a0a50db8904f558adfc3d65890_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YS Jagan Mohan Reddy: కరోనా వైరస్ బారిన పడిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం మెరుగవ్వాలని ఆకాంక్షిస్తూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు కోవిడ్‌ను జయించి, త్వరగా కోలుకోవాలంటూ టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. కోవిడ్ బారిన పడిన చంద్రబాబుకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ప్రస్తుం కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న కరోనా బారిన పడ్డారు. లక్షణాలు లేవుగానీ, ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్‌కు వెళ్తున్నానని చెప్పారు. తనను ఇటీవల నేరుగా కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
Wishing a speedy recovery & good health for Sri @ncbn garu.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 18, 2022
నేడు టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే తన ట్విటర్ ద్వారా ప్రకటించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు. తనకు కరోనా పాజిటివ్ అని తేలగానే వెంటనే ఇంట్లోనే క్వారంటైన్‌లోకి వెళ్లిపోయానని, అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనకు దగ్గరగా మెలిగిన వారు, నేరుగా కాంటాక్ట్ ఉన్నవారు కూడా జాగ్రత్త వహించాలని చంద్రబాబు సూచించారు.
Also Read: Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..
Also Read: Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు.. పెరుగుతున్న చలి తీవ్రత
Also Read: Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా..
Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్ కంపెనీకి నష్టాల సెగ!!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)