News
News
X

Vengalarao Comments: ఎంపీ రఘురామనే కొట్టాము, నువ్వెంత అంటూ బట్టలిప్పి మరీ చితకబాదారు: వెంగళరావు ఆవేదన

Vengalarao Comments: సీబీఐ వాళ్లు బట్టలు విప్పి మరీ కొట్టారని, అరికాళ్లకు కోటింగ్ ఇచ్చారని ఘర్షణ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు వెంగళరావు కన్నీటి పర్యంతం అయ్యాడు.

FOLLOW US: 

Vengalarao Comments: అధికార పార్టీ వైసీపీపై వ్యతిరేక పోస్టులు పెడుతూ రెచ్చ గొడుతున్నాడన్న అభియోగంపై బొబ్బూరి వెంగళరావును సీఐడీ పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. "ఘర్షణ" మీడియా పేరుతో యూట్యూబ్ ఛానల్‌ నిర్వహిస్తున్న వెంగళరావును సీఐడీ అధికారులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ప్రజల్లో వర్గ వైషమ్యాలను ప్రేరేపిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారన్న ఆరోపణలతో ఐపీసీలోని సెక్షన్ 153ఏ, 505(2), 506, 386, 120బీ, ఐటీ చట్టంలోని 67ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిన్న డీజీపీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొని విజయవాడ నుంచి బస్సులో వెళ్తున్న సందర్భంలో సీఐడీ పోలీసులు అదుపులో తీసుకొని గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్ళారు. నిన్న రాత్రి జడ్జీ ఎదుట హాజరుపరచగా వెంగళరావు కన్నీటి పర్యంతం అయ్యారు. నిన్న డీజీపీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొని వెళుతున్న సందర్భంలో సీఐడీ పోలీసులు అదుపులో తీసుకొని గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకు వెళ్ళారు. నిన్న రాత్రి జడ్జీ ముందు హాజరు పరచగా వెంగళరావు కన్నీటి పర్యంతం అయ్యాడు.

నడవలేని పరిస్థితుల్లో ఉన్నాను.. మీరే చూడండి! 
పోలీసులు బట్టలు విప్పి మరీ తీవ్రంగా హింసించారని తెలిపాడు. కస్టడీలో ‌కొట్టినట్లు చెబితే తన రెండేళ్ల కుమారుడిని చంపేస్తామని హెచ్చరించినట్లు వెల్లడించాడు. అరికాళ్లకు కోటింగ్, థర్డ్ డగ్రీ ప్రయోగించినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని చెప్పాడు. తాము చెప్పినట్లు నడుచుకోకపోతే బెయిల్ కూడా రాదని.. తనపై తన కుటుంబంపై ఇష్టమొచ్చినట్లుగా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తామని బెదిరించినట్లు వెల్లడించాడు. తన రెండు చేతులు పైకి కట్టేసి.. వాటి మధ్యలో కర్ర పెట్టి అరికాళ్లపై కొట్టారని, బల్లపై పడుకోబెట్టి, తన నడుంపై కూర్చొని కాళ్లు పైకి ఎత్తి కొట్టినట్లు ఏడుస్తూ తెలిపాడు. అలాగే ఒక కర్రతో తన వృషణాల్లో పొడిచే ప్రయత్నం చేసి తనను భయపెట్టారని వివరించాడు. 

ఎంపీని కొడితేనే దిక్కులేదు.. నువ్వెంత? 
ఎంపీ రఘు రామకృష్ణ రాజును కొడితేనే దిక్కు లేదు.. నిన్ను కొడితే కోర్టులు ఏం చేయగల్గుతాయని పోలీసులు వివరించారు. అలాగే నిన్ను కొట్టినట్లుగా న్యాయమూర్తితో చెబితే నువ్వు బయటకు వచ్చాక నిన్ను చంపినా కోర్టులు ఏం చేయలేవని బెదిరించినట్లు ఆరోపించాడు. మేం చెప్పినట్లు వింటేనే బతుకుతావని, లేదంటే నిన్ను నీ కుటుంబాన్ని ఉంచమని చెప్పినట్లు వాపోయాడు. తనను విపరీతంగా కొట్టి ఓ పేపర్ పై సంతకం చేయించుకున్నట్లు వెల్లడించారు. అందులో  ఉన్న విషయాలన్నీ అవాస్తవాలేనని అన్నారు. శుక్రవారం రాత్రి సీఐడీ పోలీసులు వెంగళరావుకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, మేజిస్ట్రేట్ శృతి ఇంటి వద్ద హాజరు పరిచారు.

పోలీసులు కొట్టడంతో తన ఒంటికి గాయాలు అయనట్లు ఆయన చూపించడంతో న్యాయమూర్తి తిరిగి వైద్య పరీక్షలకు ఆదేశించారు. మేజిస్ట్రేట్ ఆదేశాలతో వెంగళరావును సుమారు 11.55 గంటలకు జీజీహెచ్ కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. శనివారం ఉదయం వైద్యులు పరీక్షలు చేసి నివేదికను సీల్డ్ కవర్ లో పెట్టి జడ్జికి అందజేస్తారు. అయితే ఈ ఘటనపై టీడీపీ నాయకులు స్పందించారు. సీఐడీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య మధ్య తరగతికి చెందిన వాడిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు ఎందుకు పాల్పడుతోందన్నారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించాల్సినంత పెద్ద తప్పు వెంగళరావు ఏం చేశాడంటూ ప్రశ్నించారు. 

Published at : 27 Aug 2022 10:25 AM (IST) Tags: Vengalarao Comments Vengal Rao Comments on CBI TDP Fires on CBI Police AP Latest Issue CBI Third Degree on Vengal Rao

సంబంధిత కథనాలు

రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు

రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు

Amalapuram BRS Banners : అమలాపురంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల కలకలం, రాజకీయ వ్యూహాంలో భాగమేనా?

Amalapuram BRS Banners : అమలాపురంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల కలకలం, రాజకీయ వ్యూహాంలో భాగమేనా?

Maharaja Govt Hospital: మహారాజ ప్రభుత్వాసుపత్రి పేరు మార్పు- భగ్గుమన్న టీడీపీ

Maharaja Govt Hospital: మహారాజ ప్రభుత్వాసుపత్రి పేరు మార్పు- భగ్గుమన్న టీడీపీ

Tirumala News: భక్తులతో కిటకిటలాడుతున్న ఏడు కొండలు, సర్వదర్శనానికి 35 గంటల సమయం!

Tirumala News: భక్తులతో కిటకిటలాడుతున్న ఏడు కొండలు, సర్వదర్శనానికి 35 గంటల సమయం!

Breaking News Telugu Live Updates: తెలంగాణలో ప్రాజెక్ట్ ల అవినీతిపై సీబీఐ కి పిర్యాదు చేసిన షర్మిల

Breaking News Telugu Live Updates: తెలంగాణలో ప్రాజెక్ట్ ల అవినీతిపై సీబీఐ కి పిర్యాదు చేసిన షర్మిల

టాప్ స్టోరీస్

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

Chiranjeevi: అప్పట్లో అభిమానుల్లో విపరీతమైన ద్వేషం ఉండేది, అందుకే పార్టీ కల్చర్ తీసుకొచ్చా: చిరంజీవి

Chiranjeevi: అప్పట్లో అభిమానుల్లో విపరీతమైన ద్వేషం ఉండేది, అందుకే పార్టీ కల్చర్ తీసుకొచ్చా: చిరంజీవి

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Sonal Chauhan Photos: 'ది ఘోస్ట్‌' బ్యూటీ సోనాల్ క్యూట్ లుక్

Sonal Chauhan Photos: 'ది ఘోస్ట్‌' బ్యూటీ సోనాల్ క్యూట్ లుక్