News
News
వీడియోలు ఆటలు
X

Sajjala Comments : సాహసం చేస్తున్నామంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి - ఏ విషయంలో అంటే ?

వైసీపీ కొత్త ప్రచారం కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభిస్తోంది. ఇది ఓ రకంగా సాహసం అని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు.

FOLLOW US: 
Share:

Sajjala Comments : ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ సాహసం చేసేందుకు సిద్ధమవుతోంది.  శుక్రవారం నుంచి  జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన  ఈ కార్యక్రమం గురించి మీడియాతో మాట్లాడారు. శుక్రవారం నుంచి ఈనెల 20వతేదీ వరకు జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఉంటుందని సజ్జల తెలిపారు. ఈ నినాదం ప్రజల్లోంచి వచ్చిందేనన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తమ ప్రతినిధులు వెళ్తారన్నారు. కోటి 60 లక్షల ఇళ్లకు గృహ సారథులు వెళ్తారన్నారు. 7లక్షల మంది గృహ సారథులు ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తారన్నారు. గత పాలనకు, తమ పాలనకు ఉన్న తేడాను అడుగుతారన్నారు.  
 
ప్రతి ఇంటి దగ్గరకు వెళ్తారని.. మమ్మల్ని మా జగన్ అన్న పంపారు అని చెప్పి పది నిమిషాలు మాట్లాడతారని సజ్జల తెలిపారు..   జగన్ ఇచ్చిన మెసేజ్ వారికి అందించి వెళ్తారు. అన్ని కులాలు, మతాలు, ఇతర రాజకీయ కుటుంబాలను కూడా కలుస్తారు. గతంలో పాలన ఎలా జరిగింది? ఇప్పుడు ఎలా జరుగుతోందో? వారి అభిప్రాయాలు తీసుకుంటారు. దేశంలో ఎవరూ చేయని కార్యక్రమం మేము చేస్తున్నాం. మీకు ఈ నాలుగేళ్లలో ప్రభుత్వ సాయం అందితేనే తనకు ఓటేయమని జగన్ అంటున్నారు. ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు'' అని సజ్జల అన్నారు.

''ఏ నెలలో ఏ సంక్షేమం అందించబోతున్నది కూడా అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారు. అప్పట్లో జన్మభూమి కమిటీ జలగలు ప్రజల్ని పీడించాయి. ఇప్పుడు లంచాలు లేకుండా అర్హతే ప్రమాణంగా సంక్షేమం అందిస్తున్నాం. గృహ సారథులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లినప్పుడు ఐదు ప్రశ్నలు వేస్తారు. వారి నుండి జగన్ పాలనపై అభిప్రాయాలు తెలుసుకుంటారు'' అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మా పథకాలతో మీ ఇళ్లలో మేలు జరిగిందని నమ్మితేనే మళ్లీ నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని సీఎం జగన్ ఇటీవల సభల్లో ధైర్యంగా అడగ్గలుగుతున్నారంటే, తాము అమలు చేస్తున్న విధానాలే కారణమని తెలిపారు. ఈ ధైర్యం ప్రజలు ఇచ్చిందేనని, తమది పొగరు కాదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి సీఎం జగన్ కు సంపూర్ణ మద్దతు లభిస్తుందని తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. 

జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా తమ ప్రతినిధులు ప్రతి ఇంటికి ఓ కరపత్రంతో వెళతారని, అందులో గత టీడీపీ పాలన ఎలా ఉంది, ఇప్పుడు వైసీపీ పాలన ఎలా ఉంది అనే వివరాలు ఉంటాయని వెల్లడించారు. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబునాయుడు నేతృత్వంలో జలగల్లా ఎలా పీల్చేశారనేది కూడా ప్రజలకు వివరించడం జరుగుతుందని అన్నారు.ఆ తర్వాత ప్రజా మద్దతు పుస్తకం అనే సర్వే బుక్ లెట్ ఉంటుందని, దాంట్లో 5 ప్రశ్నలు ఉంటాయని సజ్జల వివరించారు. తద్వారా ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేస్తామని, ఆ ఐదు ప్రశ్నల సమాధానాలే జగన్ కు మద్దతుపై స్పష్టత ఇస్తాయని తెలిపారు. 

చివరిగా, జగనే మా నాయకుడు, ఆయనకే మా ఆశీస్సులు అని భావించినవారు గృహ సారథులు అందించే ఓ ఫోన్ నెంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే మద్దతు తెలిపినట్టవుతుందని అన్నారు. మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు జగన్ సందేశం ఐవీఆర్ఎస్ పద్ధతిలో వినిపిస్తుందని సజ్జల వివరించారు. మీకు అభ్యంతరం లేకపోతే సీఎం జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్ ను మీ ఇంటి తలుపుకు అంటిస్తామని గృహ సారథులు ఆయా కుటుంబాలను కోరతారు... దాంతో పాటే ఫోన్ కు అంటించే స్టిక్కర్లను కూడా ఇస్తారు అని వెల్లడించారు. ఇదంతా కూడా స్వచ్ఛందంగానే అని సజ్జల స్పష్టం చేశారు.

Published at : 06 Apr 2023 04:44 PM (IST) Tags: YSRCP Sajjala Ramakrishna Reddy

సంబంధిత కథనాలు

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Rajahmundry MP Bharat: చంద్రబాబు ఒక ఆల్‌ ఫ్రీ బాబా, దసరా మేనిఫెస్టో అక్కడినుంచే కాపీ కొడతారు- ఎంపీ భరత్‌ జోష్యం

Rajahmundry MP Bharat: చంద్రబాబు ఒక ఆల్‌ ఫ్రీ బాబా, దసరా మేనిఫెస్టో అక్కడినుంచే కాపీ కొడతారు- ఎంపీ భరత్‌ జోష్యం

Pawan Kalyan Varahi: ఈ 14 నుంచే రోడ్లపైకి పవన్ కళ్యాణ్ వారాహి, రూట్ మ్యాప్ విడుదల చేసిన జనసేన

Pawan Kalyan Varahi: ఈ 14 నుంచే రోడ్లపైకి పవన్ కళ్యాణ్ వారాహి, రూట్ మ్యాప్ విడుదల చేసిన జనసేన

AP BJP: కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం స్టిక్కర్లు, గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

AP BJP: కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం స్టిక్కర్లు, గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

Andhra News : ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘంపై గురి - నకిలీ లేఖలపై విచారణకు ఆదేశం !

Andhra News :  ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘంపై గురి - నకిలీ లేఖలపై విచారణకు ఆదేశం !

టాప్ స్టోరీస్

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !

YS Viveka Case  : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ -  సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే   !

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్