News
News
X

TDP Ysrcp Dilemma : "ఎన్టీఆర్" పేరు మార్పు వివాదం - రెండు పార్టీల్లోనూ అలజడి ! ఏ పార్టీకి ఎక్కువ ఎఫెక్ట్ ?

సీఎం జగన్ ఏ వ్యూహంతో హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టాలనుకున్నారో కానీ రెండు పార్టీల్లో అలజడికి కారణం అవుతోంది. ఏ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందో అంచనా వేయడం కష్టంగా మారింది.

FOLLOW US: 

TDP Ysrcp Dilemma :  ముఫ్పై ఏళ్లుగా  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉంది. ఆ యూనివర్శిటీ పేరు మారుస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ సీఎం జగన్ ఇలా అనుకుని అలా బిల్లు పాస్ చేసేశారు. ఆయన ఏ రాజకీయ వ్యూహంతో ఈ బిల్లును పాస్ చేశారో కానీ రెండు పార్టీలలోనూ ఈ అంశంపై అలజడి రేగుతోంది. చివరికి జగన్ మాటే శాసనం అన్నట్లుగా ఉండే వైఎస్ఆర్‌సీపీలో కూడా అసంతృప్తి కనిపిస్తోంది. ఆయన కుటుంబసభ్యులూ వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందించలేదన్న అనవసర పంచాయతీని సోషల్ మీడియాలో ఆ పార్టీ నేతలు పెట్టుకున్నారు. దీంతో ఆ పార్టీలోనూ అలజడి కనిపిస్తోంది. 

వైద్య విశ్వవిద్యాలయానికి పేరు మార్పుపై వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి !

పదవులు రాలేదని అసంతృప్తికి గురి కావడం వేరు… నిర్ణయాల పట్ల అసంతృప్తికి గురి కావడం వేరు . రాజకీయ పార్టీల్లో పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలపై అసహనం పెద్దగా కనిపించదు. ప్రాంతీయ పార్టీల్లో అసలు కనిపించదు. జగన్ .. మూడు రాజధానుల నిర్ణయాన్ని  సమర్థించారు. ఇష్టం లేని వాళ్లు ఊరుకున్నారు. కానీ ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కానీ ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై వైసీపీలోనే అసంతృప్తి వ్యక్తమయింది. యార్లగడ్డ రాజీనామా చేశారు. స్పందించడానికి కొడాలి నాని, లక్ష్మి పార్వతి వంటి వారు ముందుకు రాలేదు. పార్టీ పదవులు స్థాయితో సంబంధం లేకుండా చాలా మంది తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్‌సీపీని అమితంగా అభిమానించే వారు కూడా వ్యతిరేక కామెంట్స్ చేశారు. 

రేపు ప్రభుత్వం మారితే వైఎస్ఆర్ పేరు తీసేస్తారు.. అది తండ్రికి మరింత అవమానకరమన్న షర్మిల ! 

అనూహ్యంగా జగన్‌కు సొంత సోదరి అయిన షర్మిల నుంచే వ్యతిరేకత వచ్చింది. జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల వైఎస్ఆర్ కు అవమానం జరుగుతుందని... ఒక ప్రభుత్వం పెట్టిన పేరును..మరో ప్రభుత్వం ఆ పేరును తొలగిస్తే అవమాన పరిచినట్లేనని ఆమె స్పష్టం చేశారు.  ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు…రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే అప్పుడు వైఎస్సార్ ను సైతం అవమానించి నట్లే కదా అని ప్రశ్నించారు. ఒకరి ఖ్యాతిని తీసుకొని వైఎస్సార్ గారికి ఆ ఖ్యాతి ని ఇవ్వాల్సిన అవసరం లేదని..  స్పష్టం చేశారు. ఓ కుమార్తెగా తనను నాన్న ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదని.. ఈ ప్రపంచంలో నేను నాన్నను ఆరాదించినట్లుగా ఎవరు ఆరాధించి ఉండరని ఆమె ప్రకటించారు. షర్మిల స్పందనతో అసెంబ్లీలో పేరు మార్పు కోసం జగన్ చేసిన సమర్థన.. బయట వైసీపీ నేతలు చేస్తున్న వాదనలు తేలిపోతున్నట్లు అయ్యాయి. 
 
టీడీపీలోనూ ఈ అంశంపై రచ్చ !

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ సహజంగానే వ్యతిరేకించింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన వైనంపై ఆ పార్టీలోని కొంత మంది అనవసర వ్యాఖ్యలు చేసి.. ఎన్టీఆర్‌పై విమర్శలు చేయడంతో ఆ పార్టీలోనూ చిచ్చు ప్రారంభమైనట్లు అయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్  , ఆయన ఫ్యాన్స్ పేరుతో వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ కొన్ని హ్యాష్ ట్యాగ్ లు వైరల్ చేశాయి. కావాల్సినంత రచ్చ చేశాయి.  ఎన్టీఆర్ తటస్థంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ ట్వీట్ చేశారని.. చాలా మంది అనుకున్నారు. అయితే ఎన్టీఆర్... తన తాతను గౌరవించలేకపోయారని టీడీపీ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పుడు జూనియర్‌తో  టీడీపీకి మరింత గ్యాప్ పెరిగినట్లయింది. అయితే ఇది సోషల్ మీడియాలోనే. బయట ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. 

షర్మిలకు టీడీపీ - జూనియర్ ఎన్టీఆర్‌కు వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ సపోర్ట్ !

అటు షర్మిల కూడా ఎన్టీఆర్ పేరు తీసేయడాన్ని వ్యతిరేకించడంతో ఆమె మాటలను టీడీపీ హైలెట్ చేస్తోంది. షర్మిల కేంద్రం జగన్ నిర్ణయాన్ని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ..  వైఎస్ఆర్‌ను పొగిడారని.. చంద్రబాబును పట్టించుకోలేదని చెబుతూ  వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ట్రెండింగ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం రెండు పార్టీల్లోనూ అలజడి రేపుతోంది. చివరికి ఎవరికి ఎక్కువ నష్టం చేస్తుందో అంచనా వేయడం కష్టమే. 

Published at : 24 Sep 2022 07:00 AM (IST) Tags: NTR name controversy Sharmila vs Jagan Junior vs TDP Telugu party politics

సంబంధిత కథనాలు

Sitaram Yechury : కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది, ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ- సీతారాం ఏచూరి

Sitaram Yechury : కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది, ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ- సీతారాం ఏచూరి

CBI Searches : ఆపరేషన్ మేఘ్ చక్ర పేరుతో సీబీఐ సోదాలు, ఛైల్డ్ పోర్నోగ్రఫీ క్లౌడ్ స్టోరేజీలపై దాడులు

CBI Searches : ఆపరేషన్ మేఘ్ చక్ర పేరుతో సీబీఐ సోదాలు, ఛైల్డ్ పోర్నోగ్రఫీ క్లౌడ్ స్టోరేజీలపై దాడులు

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Appalaraju : ఆకస్మిక తనిఖీ కోసం ఆస్పత్రికి వెళ్లిన మంత్రి అప్పల్రాజు - ఆ తర్వాత ఏమయిందంటే ?

Minister Appalaraju :   ఆకస్మిక తనిఖీ కోసం ఆస్పత్రికి వెళ్లిన మంత్రి అప్పల్రాజు - ఆ తర్వాత ఏమయిందంటే ?

Breaking News Telugu Live Updates: హైదరాబాద్ చేరుకున్న భారత్, ఆసీస్ క్రికెట్ ప్లేయర్లు 

Breaking News Telugu Live Updates: హైదరాబాద్ చేరుకున్న భారత్, ఆసీస్ క్రికెట్ ప్లేయర్లు 

టాప్ స్టోరీస్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Zodiac Signs: జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి

Zodiac Signs:  జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి