నక్వీనే ఆసియా కప్ ట్రోఫీ దాచేశాడు! ఫాకింగ్ విషయం బయటపెట్టిన తిలక్
ఆసియా కప్ 2025 ముగిసిపోయి దాదాపు 2 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ భారత్‌కి ట్రోఫీ ఇవ్వకుండా ఏసీసీ ప్రెసిడెంట్ నక్వీ నక్క నాటకాలు ఆడుతున్నాడు. ఇలాంటి టైంలో నక్వి గురించి, ఆసియా కప్ ట్రోఫీ గురించి.. తెలుగు ఆటగాడు, టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ షాకింగ్ నిజాలు చెప్పాడు. ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తిలక్ వర్మ.. సెప్టెంబర్ 28న పాకిస్థాన్‌తో ఫైనల్ గెలిచిన తర్వాత టీమ్ ఆటగాళ్లంతా గంటసేపు గ్రౌండ్‌లోనే ఉన్నామని, గ్రౌండ్‌లో ట్రోఫీ ఎక్కడా కనిపించలేదని, కనీసం ఆసియా క్రికెట్ కౌన్సిల్..ఏసీసీ ప్రెసిడెంట్..మోసిన్ నఖ్వీ చేతిలో కూడా ట్రోఫీ లేదని దిమ్మతిరిగే సీక్రెట్ బయటపెట్టాడు.
చాలాసేపు ట్రోఫీ కోసం వెయిట్ చేసి.. చివరికి ట్రోఫీ లేకపోయినా.. ట్రోఫీ ఉన్నట్లుగా క్రియేట్ చేసి ఫోటోలకి ఫోజులిచ్చామని తిలక్ చెప్పుకొచ్చాడు. ‘ఆ రోజు మ్యాచ్ గెలిచాక అందరం ఆసియా కప్ 2025 ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్నాం. కానీ దాదాపు గంట గడిచినా ట్రోఫీ మా చేతికి రాలేదు. అందరూ టీవీల్లో చూసుంటారు. టీమిండియా ప్లేయర్స్ చాలామంది మైదానంలోనే పడుకొని ఉన్నాం. అర్ష్‌దీప్ సింగ్ మాత్రం రీల్స్ చేస్తూ అందరిని అలరించాడు. మైదానంలో ఎక్కడా కూడా మాకు ట్రోఫీ కనిపించలేదు. చాలా సమయం అయ్యాక.. అర్ష్‌దీప్ ట్రోఫీ అందుకొన్నట్లుగా క్రియేట్ చేశాడు. అందరం అతడిని ఫాలో అయ్యాం. టీ20 ప్రపంచకప్ 2024 సమయంలో ఎలా సంబరాలు చేసుకున్నామో ట్రోఫీ లేకున్నా అలాగే చేశాం’ అని తిలక్ అసలు విషయం చెప్పాడు. అంటే టీమిండియా తన చేతి నుంచి ట్రోఫీ అందుకునే అవకాశం లేదని ముందే తెలుసు కాబట్టి.. నక్వీ తన పీత బుద్ధితో ట్రోఫీని ముందే సీక్రెట్‌గా దాచేశాడన్నమాట.





















