Telangana News: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం-జాయింట్ కలెక్టర్ పదవి రద్దు
Telangana News: తెలంగాణలో జిల్లా స్థాయి పాలనలో రేవంత్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాయింట్ కలెక్టర్ల పదవిని రద్దు చేసి వారిని ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారులుగా మార్చారు.

Telangana News: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు జిల్లాల్లో కలెక్టర్లకు సహాయకులుగా ఉంటూ వస్తున్న జాయింట్ కలెక్టర్ పదవిని రేవంత్ సర్కారు రద్దు చేసింది. వారిని ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా మార్చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై తెలంగాణలో జేసీ అనే పదవి ఇకపై కనిపించదు.
రాష్ట్రంలో పాలనలో వెసులుబాటు కోసం జేసీలను ప్రవేశ పెట్టారు. అయితే ఈ పదవులను రద్దు చేసిన సర్కారు వారికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఇకపై వారంతా అటవీ భూముల సంరక్షణకు చర్యలు తీసుకుంటారు. అటవీభూ సర్వే, హక్కుల నిర్దారణ, సెటిల్‌మెంట్ పనులు చేపడతారు. 1967 ఫారెస్ట్ చట్టం ప్రకారం వీళ్లందా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పర్యవేక్షణలో పని చేస్తారు.
1927 చట్టం ప్రకారం నియమితులయ్యే ఫారెస్టు సెటిల్మెంట్ ఆఫీసర్లు అటవీ భూములు నిర్దారించడం, రక్షించడం, అక్కడ నివసించే వారి హక్కులను కాపాడటం, వారి భూహక్కులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం చేస్తారు. వీళ్లు అడవుల్లో తిరిగే స్వేచ్చ ఉంటుంది.
ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాల పర్వవేక్షణ, గ్రామసభల నిర్వహణ, ఇతర అభివృద్ధి పనుల్లో భాగమై కలెక్టర్లకు సహాయంగా ఉన్న జేసీల పదవి రద్దు సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ భారమంతా కలెక్టర్లపై పడుతుంది. క్షేత్రస్థాయి పనుల పర్యవేక్షణ ప్రభుత్వంతో సమన్వయం అన్నీ వాళ్లే నేరుగా పర్యవేక్షించాలి.





















