Driver Saved 6 Persons in Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన రియల్ హీరో | ABP Desam
ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి నిజంగా రియల్ హీరో. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని 20 మంది ప్రాణాలు కోల్పోగా...బస్సుల్లో మంటల్లో చిక్కుకున్న వారిని కొంతమంది స్థానికులు రక్షించారు. అదే సమయంలో హిందూపుర్ నుంచి నంద్యాల వెళ్తున్న కారులో వెళ్తున్న ఓ వ్యక్తి మంటల్లో చిక్కుకున్న బస్సు చూసి తన వాహనాన్ని ఆపి పరుగు పరుగున వెళ్లారు. కిటీకీ అద్దాలు పగుల గొట్టి తనకు కనిపించిన ఆరుగురు ప్రయాణికులను బయటకు లాగి ప్రాణాలు కాపాడాడు రియల్ వారియర్. అందులో అద్దం పగిలి ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కాగా..తను బయటకు లాగిన ఆరుగురి తన కారులోనే ఎక్కించుకుని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందేలా చేశాడు. మానవత్వం ప్రదర్శించి ఈయన చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. దైవం మానుష రూపేణా అన్నట్లు దేవుడి మీ రూపంలో వచ్చి ఆరుగురు ప్రాణాలను కాపాడారు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.





















