Weather Update: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం
ఏపీకి వర్షాల ముప్పు తప్పేలా లేదు. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఇది ఉత్తర తమిళనాడు-దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని సముద్రతీర ప్రాంతాల మీదుగా ఇవాళ తీరం దాటనునున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ నుంచి పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వారం రోజులుగా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Heavy Rainfall and Thunderstorms warning for the Districts of Andhra Pradesh in Telugu for 3 days Valid from 08:30 Hrs IST of 19.11.2021 to 08:30 Hrs IST of 22.11.2021. pic.twitter.com/pKrKH5gfqs
— MC Amaravati (@AmaravatiMc) November 17, 2021
ఏడు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. నాలుగు రోజులపాటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ తెలిపింది. 17, 18, 19 వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండమాన్ నికోబర్ ఐలాండ్స్, కోస్టల్, తమిళనాడు, కర్ణాటక, నార్త్ కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, గోవా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.
అల్పపీడన తీరం దాటే సమయంలో.. ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఐఎండీ హెచ్చరికలతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమైంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టము నకు 5 .8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది.
Fishermen are advised not to venture into the above areas. pic.twitter.com/o1c0ivsUO4
— India Meteorological Department (@Indiametdept) November 17, 2021
మరొక అల్పపీడన ద్రోణి అరేబియా సముద్రం దాని పరిసర ప్రాంతమైన గోవా, దక్షిణ మహారాష్ట్ర తీరం నుంచి దక్షిణ తమిళనాడు వరకు గల అల్పపీడనం, దానికి అనుబంధంగా గల ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్లు వరకు విస్తరించి ఉంది. ఈ కారణంగా రాగాల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: మానేరులో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు కేటీఆర్ పరామర్శ.. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం
Aslo Read: CM KCR: ధాన్యం కొనుగోళ్లపై ఆదేశాలివ్వమని చెప్పండి.. ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ..