(Source: ECI/ABP News/ABP Majha)
Weather Latest Update: ఏపీలో తీవ్ర వేడిగాలులు ఈ జిల్లాల్లో అధికం - బిపర్‌జాయ్ తుపానుతో అక్కడ తీవ్ర విధ్వంసం - ఐఎండీ
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నైరుతి రుతుపవనాలు ఈరోజు కర్ణాటకలోని మరికొన్ని భాగాలు మరియు కొంకణ్, తమిళనాడు లోని మిగిలిన భాగాలు, ఆంధ్రప్రదేశ్ లోని మరికొన్ని భాగాలకు వ్యాపించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం (జూన్ 12) ఓ ప్రకటనలో తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులుతో (గాలి గంటకు 30 నుండి 40 కి మీ వేగం) కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఈ రోజు ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, కొమరం భీం, మంచిర్యాల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 08 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 62 శాతంగా నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
నేడు ఏపీలో ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తీవ్రమైన వేడిగాలులు ఉంటాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీర ప్రాంత జిల్లాలైన మిగతా జిల్లాల్లో సాధారణ వడగాడ్పులు ఉంటాయని అంచనా వేశారు. వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేశారు.
బిపర్‌జాయ్ తుపాను గమనం ఎలా ఉందంటే..
జూన్ 15 మధ్యాహ్నం నాటికి బిపార్జోయ్ తుఫాను గుజరాత్‌లోని మాండ్వి మరియు పాకిస్తాన్‌లోని కరాచీ మధ్య, గుజరాత్‌లోని జాఖౌ ఓడరేవు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో 125-135 కి.మీ వేగంతో 150 కి.మీ వేగంతో గాలులు వీస్తూ బిపార్జోయ్ తుఫాను చాలా తీవ్రమైన తుఫానును తీసుకువస్తోంది. జూన్ 15న అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను జూన్ మూడో వారంలో రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో చెదురుమదురుగా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని స్కైమెట్ వెదర్ తెలిపింది.
సాధారణ రుతుపవనాలు
తుపాను కారణంగా కురిసిన వర్షాలు సాధారణ రుతుపవనాల వర్షాలు కావని, వ్యవసాయంలో రైతులకు ప్రయోజనం ఉండదని ఏజెన్సీ పేర్కొంది. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగా ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రాంతీయ సూచన కేంద్రం అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు. అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన గాలులు రాజస్థాన్, దక్షిణ హర్యానా మీదుగా ఢిల్లీకి చేరుకుంటాయి. గరిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల కొనసాగుతుంది.