Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. తెలంగాణపై ఈశాన్య గాలుల ప్రభావం
ఈశాన్య దిశ నుంచి బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో, తమిళనాడు, ఏపీ తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తక్కువ ఎత్తులో ఈశాన్య దిశ నుంచి బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో, తమిళనాడు, ఏపీ తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి రెండు రోజులపాటు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దక్షిణ కోస్తాంధ్రలో నేడు తేలికపాటి వర్షాలు కురవనుండగా.. రేపు కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వాసులు మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని, బలమైన గాలులు వీస్తుంటే తీర ప్రాంతాల్లో సముద్రంలో వేటకు వెళ్లడం ప్రమాదకరమని మత్స్యకారులను హెచ్చరించారు. రాయలసీమలో కొన్ని చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నేడు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, రేపు కొన్ని చోట్ల ఈదురుగాలుతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతారణ కేంద్రం పేర్కొంది.
Also Read: Hyderabad: ముగిసిన శిల్పా చౌదరి పోలీస్ కస్టడీ... రూ. 7 కోట్లు తిరిగిచ్చేందుకు అంగీకారం..!
Synoptic features of weather inference for Andhra Pradesh in Telugu Dated 12.12.2021. https://t.co/UOuiiqz4Gv
— MC Amaravati (@AmaravatiMc) December 12, 2021
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
నైరుతి బంగాళాఖాతంలో వీస్తున్న చల్ల గాలుల ప్రభావం కొంతమేర తెలంగాణలోనూ ఉంది. అయితే రాష్ట్రంలో ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం లోని కొన్ని ప్రాంతాల్లో భారీ పడిపోతాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో వాతారణం పొడిగా ఉంటుంది. మరో మూడు రోజులు వాతావరణంలో పెద్దగా మార్పులేమీ ఉండవని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
Also Read: Omicron in AP: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు, ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి.. వైద్యఆరోగ్యశాఖ కీలక ప్రకటన