Omicron in AP: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు, ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి.. వైద్యఆరోగ్యశాఖ కీలక ప్రకటన
ఐర్లాండ్ నుంచి విజయనగరానికి వచ్చిన 34 ఏళ్ల ప్రయాణికుడికి ఒమిక్రాన్ ఉన్నట్లుగా తేలింది. విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోటకు చెందిన వ్యక్తికి ఈ వేరియంట్ సోకినట్లుగా గుర్తించారు.
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. విజయనగరం జిల్లాలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కూడా దీన్ని ధ్రువీకరించింది. ఐర్లాండ్ నుంచి విజయనగరానికి వచ్చిన 34 ఏళ్ల ప్రయాణికుడికి ఒమిక్రాన్ ఉన్నట్లుగా తేలింది. విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోటకు చెందిన వ్యక్తికి ఈ వేరియంట్ సోకినట్లుగా గుర్తించారు.
తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా నెగటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో ఒక్క ఒమిక్రాన్ యాక్టివ్ కేసు కూడా లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఐర్లాండ్ నుంచి వచ్చిన ఈ వ్యక్తి దేశంలో తొలుత ముంబయి ఎయిర్ పోర్టుకు వచ్చి అక్కడి నుంచి విశాఖపట్నం నవంబరు 27న వచ్చాడు. ముంబయిలో ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించగా.. కొవిడ్ నెగటివ్ అని వచ్చింది.
విజయనగరం వచ్చాక మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్టు చేయగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈయన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష కోసం హైదరాబాద్ సీసీఎంబీకి పంపించారు. ఆ ఫలితాల్లో అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ ఉన్నట్లుగా తేలింది. కానీ, అతనికి ఎలాంటి లక్షణాలు లేవు. మళ్లీ ఈ నెల 11న మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్టు చేయగా.. కరోనా నెగటివ్ అని తేలినట్లుగా అధికారులు ప్రకటించారు.
Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం
ఏపీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు గుర్తించడం ఇదే మొదటిది అని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన మొత్తం 15 మంది ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని, వీరి నమూనాలు సీసీఎంబీకి పంపగా.. ఒక ఒమిక్రాన్ గుర్తించినట్లుగా వెల్లడించారు. మరో ఐదుగురి రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా నిబంధనలు పాటిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.
Also Read: Hyderabad: సెలైన్ బాటిల్‌లో విషం ఎక్కించిన డాక్టర్.. దాన్ని తన చేతికే పెట్టుకొని..
Also Read: Chandrababu: నెల్లూరులో టీడీపీ కట్టప్పలకు చంద్రబాబు మొట్టికాయలు.. జీరో స్కోరేంటని ఆగ్రహం..!
Also Read: లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి