Minister Kannababu: చంద్రబాబు చూడాల్సింది అఖండ మూవీ కాదు జస్టిస్ చంద్రు వీడియో... ప్యాకేజీకి ఓకే చెప్పినప్పుడే హోదా కనుమరుగు
ప్యాకేజీకి ఒకే చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు మంత్రి కన్నబాబు. ప్యాకేజీకి అంగీకరించిన రోజే హోదా కనుమరుగైందన్నారు.
ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ కావాలని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అడగలేదా అని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ధాన్యం సేకరణలో మిల్లర్లు, దళారుల ప్రమేయం తగ్గిస్తున్నామన్నారు. ఇటీవల వర్షాలకు పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటివరకూ 2,36,880 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 7 వేలకు పైగా ఆర్బీకేలలో ధాన్యం సేకరణ చేశామని స్పష్టం చేశారు.
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రతి గింజను రైతు భరోసా కేంద్రాల ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
— YSR Congress Party (@YSRCParty) December 11, 2021
-ధాన్యం సేకరణలో మిల్లర్లు, దళారుల ప్రమేయం తగ్గించాం
-ఇప్పటి వరకు 2,36, 880 టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం
- మంత్రి కన్నబాబుhttps://t.co/YoVd5A60Jr
Also Read: ఏపీ హైకోర్టు పరిధిదాటి వ్యవహరిస్తోంది... తమిళనాడు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు !
అఖండ చూసిన ప్రస్టేషన్ లో
ప్రత్యేక హోదాపై రాజీనామా చేద్దామని చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీకి ఓకే చెప్పి అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేసిన విషయం మర్చిపోయారా అన్నారు. ఎంపీల రాజీనామా అంటున్న చంద్రబాబుకు గతంలో వైసీపీ ఎంపీల రాజీనామా చేసిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. అఖండ సినిమా చూసిన ప్రస్టేషన్ లో చంద్రబాబు మాట్లాడినట్లు ఉందని కన్నబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు చూడాల్సింది అఖండ సినిమా కాదని, జస్టిస్ చంద్రు వీడియో అన్నారు. గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో వందల కోట్లు పక్కదారి పట్టించేలా షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. అమరావతి కోసం ఊరేగింపులు, బంద్‌లు పేరుతో బినామీ ఆస్తులు పెంచుకోడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న రోజే హోదా కనుమరుగైందని మంత్రి కన్నబాబు అన్నారు.
Also Read: "హోదా" కోసం రాజీనామాలు చేద్దాం ..రా ! సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్ !
పవన్ కల్యాణ్ దీక్ష చేస్తే మంచిదే
ఓటీఎస్ ద్వారా పేదలకు ఇళ్లపై హక్కు కల్పిస్తుంటే టీడీపీ లేనిపోని రాద్ధాంతం చేస్తుందని మంత్రి కన్నబాబు విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడుతున్న చంద్రబాబు.. గోదావరి ఎరువుల ప్లాంట్ ఎందుకు అమ్మేశారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్‌ను విక్రయిస్తామని కేంద్రం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమేంటని నిలదీశారు. పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విభజన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం ప్రజలు ఇచ్చినా చంద్రబాబు దుర్వినియోగం చేశారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కల్యాణ్ దీక్ష మంచిదే అన్న మంత్రి కన్నబాబు... దాని కన్నా కేంద్రంపై ఒత్తిడి చేస్తే బాగుంటుందన్నారు.
Also Read: లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి